Latest News

Wet shoes:తడిచిన షూలో దుర్వాసన వస్తుందా? ఇలా చేస్తే మాయం ..

Wet shoes : తడి బూట్లు , సాక్స్‌లు ధరిస్తే, కాసేపటికే అవి భయంకరమైన దుర్వాసనను వెదజల్లుతాయి.

Wet shoes

కొద్ది రోజులుగా వర్షాలు పడటం వల్ల రోజువారీ ప్రయాణాల్లో షూ, సాక్స్‌లు తడవడం, బురదలో నడవాల్సి రావడం సాధారణమైంది. ఒకసారి వర్షంలో తడిసిన షూ-సాక్స్‌లు పూర్తిగా ఆరిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. తడి బూట్లు , సాక్స్‌లు ధరిస్తే, కాసేపటికే అవి భయంకరమైన దుర్వాసనను వెదజల్లుతాయి. ఈ దుర్వాసనతో కూడిన షూలు ధరిస్తే చుట్టుపక్కల వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. బూట్ల వాసనను తొలగించడానికి ఇక్కడ కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.

wet shoes
wet shoes

1. నిమ్మ మరియు లావెండర్ నూనె చిట్కా.. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు, ముందుగా తడిచిన బూట్లు(wet shoes) తీసి పొడి గుడ్డతో బాగా తుడవాలి. ఆ తర్వాత, షూ లోపల నిమ్మకాయ ముక్క లేదా నిమ్మ తొక్క ముక్క ఉంచాలి. కొద్దిగా లావెండర్ ఆయిల్ (Lavender Oil) చుక్కలు కూడా వేస్తే, ఇది దుర్వాసనను సమర్థవంతంగా తొలగిస్తుంది.

2. బేకింగ్ సోడా మ్యాజిక్.. దుర్వాసనను తొలగించడానికి బేకింగ్ సోడా చాలా బాగా పనిచేస్తుంది. పొడి గుడ్డతో తడి బూట్లు తుడవాలి. ఆ తర్వాత, బూట్లలోపల బేకింగ్ సోడాను చల్లాలి. మరుసటి రోజు బూట్లు ధరించే ముందు ఆ సోడాను పూర్తిగా తుడిచి, ఆ తర్వాత ధరించాలి. బేకింగ్ సోడా అన్ని రకాల దుర్వాసనలను పీల్చుకుంటుంది.

3. టీ ట్రీ ఆయిల్ వినియోగం.. టీ ట్రీ ఆయిల్ (Tea Tree Oil) బూట్లు మరియు సాక్స్‌ల నుండి దుర్వాసనను, మరియు దానికి కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా తొలగించడంలో సహాయపడుతుంది. షూ(wet shoes) మీద కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసుకోవచ్చు. సాక్స్‌లను శుభ్రం చేసే సమయంలో కూడా టీ ట్రీ ఆయిల్‌ను నీటిలో కలపవచ్చు. దీంతో తడిచిన బూట్లు దుర్వాసన పోయి తాజాగా మారుతాయి.

4. పాదాల సంరక్షణ ముఖ్యం.. బూట్లు(wet shoes) వేసుకునే ముందు మీ పాదాలకు బేబీ పౌడర్‌ను పూయాలి. సాక్స్‌ల లోపల కూడా కొద్దిగా పౌడర్‌ వేసుకోవాలి. ఇలా చేస్తే పాదాలకు చెమట తక్కువగా పడుతుంది. ఒకవేళ చెమట పట్టినప్పటికీ, పౌడర్ దానిని పీల్చుకుంటుంది, చెడు వాసనను రానివ్వదు.

5. సరైన శుభ్రత.. ఈ కాలంలో వీలైనంత వరకు వాటర్ ప్రూఫ్‌ బూట్లు ధరించడానికి ప్రయత్నించాలి. అలాగే ఉతికి శుభ్రం చేయడానికి వీలుండే బూట్లు ధరించవచ్చు. ఉతికిన బూట్లను సబ్బు నీటిలో కాసేపు నానబెట్టి, తర్వాత బ్రష్‌తో స్క్రబ్ చేసి, శుభ్రంగా నీటితో కడిగి ఎండలో ఆరబెడితే దుర్వాసన రాకుండా ఉంటుంద

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button