Just LifestyleLatest News

Important In A Relationship : ఒకరికొకరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలా?బంధంలో స్పార్క్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Important In A Relationship : బంధంలో పార్ట్‌నర్‌కు ఎప్పుడూ కూడా నువ్వు నాకు చాలా స్పెషల్ అనే ఫీలింగ్ కలిగించడం చాలా ఇంపార్టెంట్.

Important In A Relationship

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఎవరినీ చూసినా రిలేషన్షిప్ ఎక్స్‌పర్ట్‌గా మారిపోయి ఏది గ్రీన్ ఫ్లాగ్, ఏది రెడ్ ఫ్లాగ్ అని తమకు తోచింది చెబుతూ ఫ్రీగా సలహాలు ఇచ్చేస్తుంటారు. అవతలి వ్యక్తి మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇవ్వొద్దని.. కాసేపు వెయిట్ చేయించి మీ విలువ పెంచుకోవాలని లేదంటే..మీరు నీడీగా కనిపిస్తే మీ పార్ట్‌నర్‌ ముందు చులకనైపోతారని మైండ్ గేమ్‌లు ఆడమని చెబుతుంటారు.

కానీ రియల్ లైఫ్‌లో ఇలాంటి ఈగో గేమ్‌ల కంటే రిలేషన్‌షిప్‌లో ఒకరికొకరు ఎంత ఇంపార్టెంట్(Important In A Relationship) అనిపించేలా చేస్తున్నారనేదే అసలైన పునాది అని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తాము ఎన్నో జంటల మీద రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశామని అంటున్నారు.

నిజానికి ఏ బంధంలోనైనా సరే పార్ట్‌నర్‌ ముందు ఆ చిన్న చిన్న ప్రయత్నాలను ఎప్పటికీ ఆపకూడదు. అంటే పెళ్లి అయింది కదా ఇంకేముందిలే అని కాకుండా చిన్న చిన్న కాంప్లిమెంట్స్, చిన్న ఫ్లర్టింగ్‌, చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం చేయాలన్న మాట. అప్పుడే ఎన్నాళ్లయినా కూడా బంధంలో స్పార్క్ తగ్గకుండా ఉంటుంది.

ఈ పర్సన్ రోజంతా తన పక్కనే ఉంటారు కదా, తనకు తన పార్ట్‌నర్ గురించి అంతా తెలుసు అని అనుకోకుండా.. ఈరోజు నీ రోజంతా ఎలా గడిచిందని అడగడం, ఉదయాన్నే ఒక చిన్న గుడ్ మార్నింగ్ చెబుతూ దగ్గరకు తీసుకోవడం వంటి చిన్న చిన్న పలకరింపులే ఏ బంధాన్ని అయినా రోజురోజుకూ స్ట్రాంగ్ చేస్తాయి.

Important In A Relationship
Important In A Relationship

బంధంలో పార్ట్‌నర్‌కు ఎప్పుడూ కూడా నువ్వు నాకు చాలా స్పెషల్ అనే ఫీలింగ్ కలిగించడం చాలా ఇంపార్టెంట్(Important In A Relationship). ఎంత కాలం గడిచినా ఎదుటివారిలోని ట్యాలెంట్‌ను, ప్రయత్నాన్ని మెచ్చుకోవడం వల్ల వాళ్లకి మీపై ఉండే రెస్పెక్ట్, ఆప్యాయత రెట్టింపు అవుతాయి.

కాబట్టి సోషల్ మీడియా చెప్పే పిచ్చి రూల్స్ అన్నీ పక్కన పెట్టి, పార్ట్‌నర్‌కు ఇంపార్టెన్స్(Important In A Relationship) ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీ హ్యాపీనెస్‌లో, మీ ఆలోచనల్లో మీ పార్ట్‌నర్ ఎంత ఇంపార్టెంట్ అనిపించేలా మీరు చేస్తారో, ఆ రిలేషన్ అంత కాలం స్ట్రాంగ్‌గా, అన్యోన్యంగా సాగుతుంది.

Relationship Secrets : ప్రేమ ఉంటే సరిపోదా? గోల్స్ డిఫరెంట్‌గా ఉంటే రిలేషన్‌షిప్ సక్సెస్ అవడం కష్టమా?

Related Articles

Back to top button