Sandalwood: గంధంతో మొటిమలు, ముడుతలు, జిడ్డు చర్మానికి చెక్..

Sandalwood: ముఖంపై మొటిమలను నివారించడానికి , కాంతిని పెంచడానికి గంధాన్ని తరచుగా ఉపయోగిస్తారు.

Sandalwood

ఆయుర్వేదంలో గంధం (Sandalwood) చిరకాలంగా ఒక ముఖ్యమైన పదార్థంగా ఉపయోగించబడుతోంది. ఇది చర్మాన్ని సంరక్షించి, మెరిసేలా చేస్తుంది, ముఖ్యంగా ముఖంపై మొటిమలను నివారించడానికి , కాంతిని పెంచడానికి గంధాన్ని తరచుగా ఉపయోగిస్తారు. గంధం పొడి, పేస్ట్ లేదా నూనె రూపంలో చర్మానికి ఉపయోగిస్తే ఈ ప్రకృతి సహజసిద్ధమైన పదార్థం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు.

మొటిమలు , నల్ల మచ్చల నివారణ.. గంధం(Sandalwood) చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది, చర్మాన్ని అలర్జీల నుంచి రక్షించి, మొటిమలను దూరం చేస్తుంది. ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. మొటిమలు, నల్లమచ్చలు పోవాలంటే, ఒక టీస్పూన్ గంధం నూనె, చిటికెడు పసుపు ,కొంచెం కర్పూరం కలిపి ముఖానికి ప్యాక్ లాగా రాసుకోవాలి. రాత్రాంత అలాగే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది, టాన్‌ తొలగిస్తుంది.. చందనంలో ఉండే తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ (Exfoliating) లక్షణాల వల్ల ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది మీ చర్మంపై నల్ల మచ్చలను పోగొట్టడానికి, అలాగే సూర్యరశ్మి వల్ల ఏర్పడిన టాన్‌ను తొలగించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. డార్క్ స్పాట్స్ వదిలించుకోవడానికి, ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి , కొబ్బరి నూనె కలిపి ముఖానికి పూసుకుని, మసాజ్ చేసి రాత్రంతా ఉంచడం మంచిది. క్రమం తప్పకుండా దీనిని ఉపయోగిస్తే మచ్చలు పోయి, ముఖం తళతళ మెరుస్తుంది.

Sandalwood

వృద్ధాప్యాన్ని నివారిస్తుంది (Anti-Aging).. గంధపు(Sandalwood) చెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఇది చర్మ ముడుతలను నివారించి, వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది. దీంతోపాటు చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం, 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి మరియు 2 టేబుల్ స్పూన్ల గంధం పొడి కలిపి రాసి, 15-20 నిమిషాలు ఉంచి నీటితో కడిగితే సరిపోతుంది.

పొడి చర్మానికి నివారణ.. పొడి , నిర్జీవమైన చర్మంతో బాధపడేవారు చందనం ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పాలపొడి, కొన్ని చుక్కల గంధం నూనె , రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాయాలి. 15 నిమిషాలు ఉంచి నీటితో కడిగితే చర్మం నిగారింపుగా, తేమగా మారుతుంది.

జిడ్డుగల చర్మానికి ఉపశమనం… జిడ్డుగల చర్మంపై తరచుగా ధూళి పేరుకుపోవడం, రంధ్రాలు మూసుకుపోవడం జరుగుతుంది. అలాంటివారికి చందనం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇది చర్మంపై అదనపు నూనెను (Sebum) నియంత్రిస్తుంది. దీని కోసం, అర టీస్పూన్ గంధం పొడి, కొంచెం టమోటా రసం, అర టీస్పూన్ ముల్తానీ మట్టి వేసి పేస్ట్‌లా కలిపి ముఖంపై పూసుకొని, 15 నిమిషాల తర్వాత క్లీన్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తూ, జిడ్డు లేకుండా ఉంటుంది.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version