Latest News

SmartPhone Prices : మొబైల్స్‌పై ఏఐ ఎఫెక్ట్.. 30 శాతం వరకు పెరగనున్న ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు

SmartPhone Prices : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణ వల్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మెమరీ చిప్‌ల కొరత, బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్లపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది.

SmartPhone Prices

వరల్డ్ వైడ్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం ఏ రేంజ్‌లో దూసుకెళ్తుందో మనందరికీ తెలిసిందే. అయితే, ఈ ఏఐ టెక్నాలజీ పెరగడం వల్ల డైరెక్టుగా సామాన్యుడి జేబుకే చిల్లు పడబోతోంది. త్వరలోనే మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇదొక చేదు వార్తే అని చెప్పాలి. రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల ధరలు(SmartPhone Prices) చాలా టూ మచ్‌గా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ కేటగిరీలో లభించే ఫోన్ల ధరలు ఏకంగా 30 శాతం వరకు పెరగొచ్చని ఫేమస్ ఇంటర్నేషనల్ పరిశోధనా సంస్థ జెఫరీస్ తన తాజా రిపోర్ట్‌లో బాంబు పేల్చింది.

ఈ సడన్ షాక్‌కి మెయిన్ రీజన్ ఏఐ అప్లికేషన్లకు విపరీతంగా పెరిగిన డిమాండేనని తెలుస్తుంది. ఎందుకంటే చాట్‌జీపీటీ, జెమిని వంటి అధునాతన ఏఐ మోడళ్లను నడిపించడానికి టెక్ దిగ్గజ కంపెనీలు ప్రపంచం మొత్తం భారీ డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. ఈ డేటా సెంటర్లకు గుండెకాయ వంటి హై-ఎండ్ ప్రాసెసర్లు, మెమరీ చిప్‌లు విపరీతమైన పరిమాణంలో అవసరం పడుతున్నాయి.

దాంతో, ఏఐ కంపెనీలు మార్కెట్లో ఉన్న మెమరీ చిప్‌లను ఊహించని రేంజ్‌లో కొనుగోలు చేస్తుండటంతో, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు మెమరీ చిప్‌ల షార్టేజ్‌ ఏర్పడింది. ఒకప్పుడు 20 డాలర్లుగా ఉన్న మెమరీ యూనిట్ ధర, ఈ డిమాండ్ వల్ల ఏకంగా 60 నుంచి 65 డాలర్ల స్థాయికి చేరుకోవడమే దీనికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.

ఈ కాస్ట్‌ భారం ప్రధానంగా రూ. 16,000 లోపు లభించే బడ్జెట్ ఫోన్లపైనే పడబోతోంది. సాధారణంగా ఒక బడ్జెట్ ఫోన్ టోటల్ తయారీ ఖర్చులో 60 శాతానికి పైగా కేవలం మెమరీ చిప్‌లకే ఖర్చయిపోతుంది. చిప్‌ల ధరలు మూడు రెట్లు పెరిగిపోవడంతో, స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఆ భారాన్ని డైరెక్టుగా వినియోగదారుల మీదకి నెట్టడానికి రెడీ అవుతున్నాయి. దీని ప్రభావంతో $200 లోపు లభించే సరసమైన మొబైల్ మార్కెట్ వాటా గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది.

తయారీ ఖర్చులను కంట్రోల్ చేయడానికి కొన్ని కంపెనీలు రాబోయే మోడళ్లలో పాత తరం ప్రాసెసర్లను వాడటం, పాత మొబైల్స్, ల్యాప్‌టప్‌ల నుంచి కలెక్ట్ చేసిన ప్రాసెసర్లను యూజ్ చేయడం లేదా తక్కువ ధర మోడళ్ల ప్రొడెక్ట్స్‌ను తగ్గించుకోవడం వంటి మార్గాలను ఎంచుకునే ఆలోచనలో ఉన్నాయి.

2027 నాటికి ఏఐ రంగంలో సుమారు 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండటంతో, ఈ చిప్‌ల కొరత, ధరల మంట 2027 మధ్యకాలం వరకు కొనసాగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి కొత్త ఫోన్ కొనాలనుకునేవారు మరింత ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Cat On The Wall Mentality : మీ సర్కిల్‌లో గోడ మీద పిల్లి ఉన్నారా? వారి బిహేవియర్ వెనుకున్న సైకాలజీ ఏంటి?

Related Articles

Back to top button