Just LifestyleLatest News

Summer Trip : సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ?..చల్లదనాన్ని ఇచ్చే ఈ ప్రాంతాలకు చెక్కేయండి

Summer Trip : పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. సుదీర్ఘమైన ఈ సెలవుల్లో చాలా మంది టూర్‌లు ప్లాన్‌ చేస్తుంటారు

Summer Trip

సమ్మర్ వచ్చిందంటే స్కూల్స్ కు హాలిడేస్… పిల్లలతో కలిసి చాలా మంది వేసవి వెకేషన్(Summer Trip) కు ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం చల్లని ప్రాంతాలకు వెళ్లి సేదతీరుతుంటారు. మరి ఈ వేసవి(Summer Trip)లో జమ్మూకశ్మీర్ లాంటి చల్లదనాన్ని ఇచ్చే అందమైన టూరిస్ట్ స్పాట్స్ చాలానే ఉన్నాయి.

చల్లటి ప్రాంతం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఊటీ. అయితే ఊటీ తరహాలో సమ్మర్ లో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతాలు మరికొన్ని గురించి ఇప్పుడు చూద్దాం. కొన్ని హిల్ ఏరియాస్ కూడా వేసవిలో విహరించేందుకు మంచి పర్యాటక కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. వీటిలో లడక్ ఒకటి. ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఉన్న లడక్ అందమైన పర్యాటక ప్రదేశం. ఎంతో చల్లని వాతావరణంలో అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించొచ్చు. ట్రావెలింగ్ ను ఇష్టపడే వారికి లడక్ బాగా నచ్చుతుంది.

అలాగే తమిళనాడులో ఉన్న అందమైన హిల్ రిసార్ట్ కొడైకెనాల్. చాలా మంది టూరిస్టులకు ఇది ఫేవరెట్ స్పాట్. కొండలు, నిర్మలమైన సరస్సులతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్టోబర్ నుంచి జూన్ మధ్య కొడైకెనాల్ సందర్శించడానికి బెస్ట్ టైమ్.

ఇక భూతల స్వర్గంగా చెప్పుకునే కేరళలో ప్రతీ ప్రాంతం కూడా ఒక అద్భుతమైన టూరిస్ట్ స్పాట్. ఇక్కడ ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కేరళలోని అందమైన పట్టణం అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మున్నార్. జీవితంలో ఒకసారైనా మున్నార్ వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. ఇది సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

Summer Trip
Summer Trip

బోటింగ్, ఫిషింగ్ వంటివి ఇక్కడ స్పెషాలిటీలు, ముఖ్యంగా టీ తోటలతో నిండిపోయిన మున్నార్ లో విహరించడాన్ని చాలా మంది ఆస్వాదిస్తారు. సెప్టెంబర్ నుంచి మే మధ్యలో మున్నార్ సందర్శించడానికి బెస్ట్ టైమ్ గా చెబుతారు. అలాగే కేరళలోని ఒక ప్రశాంతమైన కొండ పట్టణం వయనాడ్ కూడా మంచి టూరిస్ట్ స్పాట్. ఈ ప్రాంతం ఏడాది పొడవునా అందంగా ఉంటుంది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో మనాలి ప్రాంతం నచ్చని వారు ఎవ్వరూ ఉండరు.

దేశంలో ఉన్న ఎంతో అందమైన పర్యాటక ప్రదేశాల్లో ఇది ఒకటి. గ్రీన్ ఆపిల్స్, అందమైన నదులతో చల్లని వాతవారణంతో నిండి ఉంటుంది. సమ్మర్ వెకేషన్ కు ఇది అద్భుతమైన డెస్టినేషన్. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని కూడా మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడ ప్రకృతి దృశ్యాలను చూస్తే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు., పురాతన మఠాలు, చంద్రతాల్ వంటి స్వచ్ఛమైన సరస్సులు , విశిష్టమైన టిబెటన్ బౌద్ధ సంస్కృతికి ప్రసిద్ధి చెందిన స్పితి వ్యాలీని కూడా వేసవిలో మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పొచ్చు.

Gold: కుప్పకూలిన బంగారం ధరలు.. రెండు రోజుల్లోనే భారీ డ్రాప్!

Related Articles

Back to top button