Just LifestyleLatest News

Banana Flower : అరటి పువ్వులోని సీక్రెట్ హెల్త్ బెనిఫిట్స్.. తెలిస్తే అస్సలు వదలరు..

Banana Flower : అరటిపువ్వులో పుష్కలంగా ఉండే మెగ్నీషియం ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించి మనకు రోజూ ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది.

Banana Flower

అరటి చెట్టు ఒక అద్భుతమైన సంజీవని అని మనందరికీ తెలుసు. అయితే అందరూ అరటి పండ్లు, అరటికాయల మీద దృష్టి పెట్టి, అరటి పువ్వును మాత్రం పట్టించుకోకుండా పక్కన పడేస్తుంటారు. కొంతమందికి ఇది ఉపయోగపడుతుందని కూడా తెలీదు. అయితే నిజానికి ఆ పువ్వులో పోషకాల నిధి దాగుందని డాక్టర్లు చెబుతారు. మనం చేసుకునే డిషెస్‌లో అప్పుడప్పుడూ అయినా దీనికి కాస్త స్పేస్ ఇస్తే చాలు, మన శరీరానికి కొండంత బలాన్ని, అనేక వ్యాధుల నుంచి ఊహించని ప్రొటెక్షన్‌ను అందిస్తుంది.

ఈ మధ్యకాలంలో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామందిని డయాబెటిస్ సమస్య వేధిస్తుంది. అయితే అరటి పువ్వును రెగ్యులర్‌గా తినడం వల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవల్స్‌ను నేచురల్‌గానే అదుపులోకి తెచ్చుకోవచ్చు.

ఇది బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని, దాని పనితీరును మెరుగుపరిచి డయాబెటిస్‌ను పెరగనీకుండా అడ్డుకుంటుంది. ఇక ఏజ్ పైబడటం వల్ల లేదా బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల వచ్చే.. కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులతో బాధపడేవారికి కూడా ఇది మంచి మందులా పనిచేస్తుంది. అరటిపువ్వులో ఉండే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్లు లోపల ఉన్న ఇన్‌ఫ్లమేషన్ వెంటనే ఉపశమనం ఇస్తాయి.

అరటి పువ్వు(Banana Flower) మహిళలకు ఒక గొప్ప వరమనే చెప్పాలి. ఈ రోజుల్లో హార్మోన్ల ఇమ్‌బ్యాలెన్స్‌ వల్ల పీసీఓడీ, పీరియడ్స్ సరైన టైమ్‌కి రాకపోవడం, నెలసరి సమయంలో భరించలేని కడుపునొప్పి, తీవ్రమైన బ్లీడింగ్ వంటి సమస్యలతో సఫర్ అయ్యే స్త్రీలకి ఇది సూపర్ రిలీఫ్ ఇస్తుంది.

వీటిలో ఉండే ప్రొజెస్టెరాన్ హార్మోన్‌ను బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని ట్రాక్‌లో ఉంచుతుంది. అలాగే బాడీలో ఐరన్ తక్కువయి హిమోగ్లోబిన్ పడిపోయి అస్సలు ఓపిక లేని వారు అరటి పువ్వుతో పప్పు లేదంటే కర్రీ చేసుకుని రెగ్యులర్‌గా తింటూ ఉంటే ఎర్ర రక్తకణాల కౌంట్ వేగంగా పెరుగుతుంది.

Banana Flower
Banana Flower

అంతేకాదు బరువు తగ్గాలనుకునే వాళ్లకి కూడా అరటి పువ్వు(Banana Flower) ది బెస్ట్ అనే చెప్పొచ్చు. దీనిలో ఉండే హై క్వాలిటీ డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను వేగవంతం చేసి, మలబద్ధకం ప్రాబ్లెమ్‌ను క్లియర్ చేస్తుంది. అలాగే కడుపు నిండిన ఫీలింగ్‌ను ఎక్కువ సేపు ఉంచి అనవసరమైన క్రేవింగ్స్ తగ్గిస్తుంది.

అలాగే అరటిపువ్వులో(Banana Flower) పుష్కలంగా ఉండే మెగ్నీషియం మైండ్ ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించి మనకు రోజూ ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది. బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను కూడా భద్రంగా ఉంచుతుంది.

https://www.justtelugu.in/lifestyle/relationship-secrets-35114.html

Related Articles

Back to top button