Just LifestyleJust CrimeJust InternationalLatest News

Beauty Products :మనం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ వెనుక దాగిన చీకటి చరిత్ర ..వైద్య శాస్త్ర నీడలో మరుగున పడిన దారుణ గాథ

Beauty Products : రోజుకు ఒక డాలర్ కోసం ఆశపడి, తమ మీద ఆధారపడిన కుటుంబాలను పోషించుకోవడానికి ముందుకు వచ్చిన నిరక్షరాస్యులైన ఖైదీలు, తమ బాడీలను గినియా పిగ్స్ లాగా డాక్టర్ చేతికి అప్పగించారు.

Beauty Products

 వైద్య చరిత్రలోనే భయంకరమైన చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన హోమ్స్‌బర్గ్ జైలు ప్రయోగాల కథనం, నేటికీ మానవ హక్కుల ఉల్లంఘనకు పరాకాష్టగా నిలిచిపోయింది. 1951లో ఫిలడెల్ఫియాకు చెందిన డాక్టర్ ఆల్బర్ట్ క్లిగ్‌మన్ ఒక జైలులోకి అడుగుపెట్టినప్పుడు, అక్కడ ఉన్న వేలాది మంది ఖైదీల శరీర రంగులను చూసి సారవంతమైన పొలాన్ని చూసినట్లుగా భావించడం అత్యంత హేయమైన చర్యగా ప్రపంచం ముందు నిలిచింది.

అక్కడ ఉన్న మెజారిటీ నల్లజాతీయులను , పేద ఖైదీలను కేవలం పరిశోధనా ముడిసరుకుగా మాత్రమే పరిగణించిన డాక్టర్ ఆల్బర్ట్ క్లిగ్‌మన్, వారి చర్మాన్ని ఎకరాల కొద్దీ చర్మమని అభివర్ణించడం ఆనాటి జాతి వివక్షకు, అనైతిక ధోరణికి నిదర్శనంగా నిలిచి పోయింది. దాదాపు 2 దశాబ్దాలకు పైగా సాగిన ఈ ప్రయోగాల్లో సామాన్య ఖైదీలు.. అమానవీయమైన ప్రయోగాలకు గురయ్యారన్న న్యూస్ మాత్రం ప్రపంచానికి కాస్త ఆలస్యంగా తెలిసింది.

మొదట్లో మామూలు సౌందర్య సాధనాల (Beauty Products) పరీక్షలతో మొదలైన ఈ ప్రయోగాలన్నీ.. మెల్లగా అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్, వైరస్‌లను ఇంజెక్ట్ చేసే స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఆర్మీ, సీఐఏ , ప్రముఖ ఫార్మా కంపెనీల అండతో ఏకంగా క్లిగ్‌మన్ ఖైదీలపై రేడియోధార్మిక పదార్థాలు, విషపూరిత డయాక్సిన్,హాలూసినోజెన్‌లను వాడుతూ.. భయంకరమైన ప్రయోగాలు రహస్యంగా నిర్వహించాడు.

కేవలం రోజుకు ఒక డాలర్ కోసం ఆశపడి, తమ మీద ఆధారపడిన కుటుంబాలను పోషించుకోవడానికి ముందుకు వచ్చిన నిరక్షరాస్యులైన ఖైదీలు, తమ బాడీలను గినియా పిగ్స్ లాగా డాక్టర్ చేతికి అప్పగించారు. ఈ ప్రయోగాల వల్ల చాలా మంది ఖైదీలు జీవితాంతం మానని పుండ్లు, క్యాన్సర్ , మానసిక రుగ్మతలతో భయంకరమైన జీవితాన్ని అనుభవించారు.

విచిత్రం ఏంటంటే, ఇంతటి అమానవీయ ఎక్స్‌పెరిమెంట్స్ చేసిన క్లిగ్‌మన్, అదే డేటాను ఉపయోగించి ప్రపంచ ప్రసిద్ధ ‘రెటిన్-ఏ’ వంటి స్కిన్‌కేర్ ప్రొడెక్టులు, బ్యూటీ ప్రొడక్ట్స్(Beauty Products) లను  డెవలప్ చేసి కోట్లు గడించాడు. అంతేకాదు మెడికల్ వరల్డ్ అతన్ని దశాబ్దాల పాటు ఆధునిక డెర్మటాలజీ పితామహుడు అని గౌరవించింది.

Beauty Products
Beauty Products

1974లో ప్రభుత్వం ఈ ప్రయోగాలను నిషేధించినా కూడా, బాధితులకు మాత్రం న్యాయం జరగలేదు. 2000వ సంవత్సరంలో బాధితులు దావా వేసినా టెక్నికల్ రీజన్స్‌తో కోర్టు దానిని కొట్టివేసింది. క్లిగ్‌మన్ తన చివరి శ్వాస వరకు తాను చేసిన దానిలో తప్పు లేదని వాదించడం గమనార్హం.

ఇటీవలి కాలంలో జరిగిన నిరసనల తర్వాత యూనివర్సిటీలు, నగర పాలక సంస్థలు క్షమాపణలు చెప్పినా సరే, బాధితుల జీవితాల్లో జరిగిన నష్టాన్ని అవి పూడ్చలేవు. ఈ రోజు మనం వాడుతున్న ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) వెనుక హోమ్స్‌బర్గ్ జైలు ఖైదీల రక్తం, కన్నీళ్లు , బలవంతపు త్యాగాలు దాగి ఉన్నాయన్నది మాత్రం చేదు నిజం. వ్యవస్థలు , వ్యక్తులు కలిసి ఒక బలహీన వర్గాన్ని ఎలా వాడుకోవచ్చో చెప్పడానికి ఈ ఉదంతం ఒక హెచ్చరికగా నిలుస్తుంది.

Related Articles

Back to top button