Just LifestyleLatest News

Benching : ప్రేమ పాఠాల్లో నయా ట్రెండ్ బెంచింగ్.. ఈ జనరేషన్‌ను ముంచేస్తున్న మోడ్రన్ డేటింగ్ ..

Benching : ఈ మోడ్రన్ ట్రెండ్ ఇంతగా ఫేమస్ కావడానికి మెయిన్ రీజన్ డేటింగ్ యాప్స్ కల్చరే అంటున్నారు సైకాలజిస్టులు. మొబైల్‌లో ఒక్క స్వైప్ చేస్తే వందల మంది ప్రొఫైల్స్ కనిపిస్తుండటంతో, ఛాయిస్‌లు విపరీతంగా పెరిగిపోయాయి.

Benching

ఈ రోజుల్లో కొత్త గ్యాడ్జెట్స్ ఎంత ఫాస్ట్‌గా మార్కెట్లోకి వస్తున్నాయో, అంతే స్పీడ్‌గా యూత్ మధ్య రిలేషన్‌షిప్స్, లవ్ అఫైర్స్ కూడా అప్‌డేట్ అయిపోతున్నాయి. ఒకప్పుడు ప్రేమంటే ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉండేది. కానీ ఈ సోషల్ మీడియా, క్రేజీ డేటింగ్ యాప్స్ ఎంట్రీ ఇచ్చాక రిలేషన్‌షిప్‌లలో కొత్త పదాలు, వింతవింత ట్రెండ్‌లు పుట్టుకొస్తున్నాయి.

అలా ఈ యంగ్ జనరేషన్‌లో ఎక్కువగా వినిపిస్తున్న వైరల్ పదమే బెంచింగ్(Benching). వినడానికి ఏదో స్పోర్ట్స్ గ్రౌండ్‌కు సంబంధించిన పదంలా అనిపిస్తున్నా, ఇది ప్రస్తుత జనరేషన్ లవ్ లైఫ్‌ను మాత్రం పూర్తిగా మార్చేస్తోంది.

నిజానికి ఈ బెంచింగ్(Benching) అనే పదాన్ని ఆటల భాష నుంచి తీసుకున్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక మెయిన్ ప్లేయర్ సరిగ్గా ఆడకపోవడం లేదా ఇంకేదైనా కారణం వల్లో అతని స్థానంలో ఆడించడానికి కొందరు ప్లేయర్లను రిజర్వ్ బెంచ్ మీద కూర్చోబెడతారు.

సరిగ్గా డేటింగ్‌లో కూడా ఇదే ఫార్ములాను అప్లై చేసేస్తున్నారు ఈ తరం వాళ్లు.అంటే ఒక వ్యక్తితో క్లోజ్‌గా ఉంటూ, రెగ్యులర్‌గా చాటింగ్ చేస్తూ, ఇష్టపడుతున్నట్టు కలరింగ్ ఇస్తూనే.. వారికి పూర్తి కమిట్‌మెంట్ ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టడాన్ని బెంచింగ్ అంటారు.

ఒకవేళ వారి కంటే బెటర్ ఆప్షన్ ఎవరైనా దొరుకుతారేమో అని వెతుకుతారు. ఒకవేళ వారు అనుకున్నట్లుగా ఎవరూ దొరకకపోతే అప్పుడు వాడుకోవడానికి ఈ మొదటి వ్యక్తిని తమ బ్యాకప్‌లా బెంచ్ మీద ఉంచుతారన్నమాట. అవతలి వ్యక్తికి పూర్తిగా దూరమవ్వరు, అలా అని నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లరు.

ఈ మోడ్రన్ ట్రెండ్ ఇంతగా ఫేమస్ కావడానికి మెయిన్ రీజన్ డేటింగ్ యాప్స్ కల్చరే అంటున్నారు సైకాలజిస్టులు. మొబైల్‌లో ఒక్క స్వైప్ చేస్తే వందల మంది ప్రొఫైల్స్ కనిపిస్తుండటంతో, ఛాయిస్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో ఎవరికో ఒకరికి పూర్తిగా లాక్ అవకుండా తమ బెనిఫిట్స్ చూసుకుంటున్నారు.

ఒకరితో మాట్లాడుతూనే, వారి కంటే లుక్స్ వైజ్ లేదా కెరీర్ వైజ్ ఇంకా మంచి ప్రొఫైల్ దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు. డైలీ హాయ్, బై అంటూ మెసేజ్‌లు పెడుతూ తాము టచ్‌లోనే ఉన్నామనే భ్రమను వారిలో కల్పిస్తూ టైమ్ పాస్ చేస్తుంటారు.

మరి ఈ అలవాటు సొసైటీకి మంచిదేనా అంటే, కచ్చితంగా కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మనుషుల మధ్య బలంగా ఉండాల్సిన నమ్మకాన్ని, సున్నితమైన బంధాల విలువను పూర్తిగా పతనం చేస్తోంది.

ఇలా బెంచింగ్‌కు గురయ్యే వ్యక్తులు మానసిక వేదనను అనుభవిస్తారట. ఎందుకంటే అవతలి వ్యక్తి తనను నిజంగా లవ్ చేస్తున్నాడో లేదో తెలీక, ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో అని వెయిట్ చేస్తూ ఉండటం వల్ల వారి బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంటుంది.

ఇది ఒక రకమైన ఎమోషనల్ అబ్యూస్ కిందకే వస్తుందని సైకాలజీ చెబుతోంది. దీనివల్లే ఇప్పుడు యూత్‌.. నిజమైన ప్రేమ, పెళ్లి అనే సిస్టం మీద నమ్మకాన్ని పోగొట్టుకుని , కేవలం స్వార్థపూరిత బంధాల వైపు అడుగులు వేస్తున్నారు.

Benching
Benching

లైఫ్‌లో ఎక్కువ ఆప్షన్లు ఉంచుకోవడం ఏ మాత్రం తప్పు కాదు. కానీ అవతలి వ్యక్తి యొక్క ఫీలింగ్స్‌తో, సమయంతో ఆడుకుంటూ వారిని రిజర్వ్ బెంచ్ మీద ఉంచడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు.

ఇప్పుడు ఈ ట్రెండ్ యూత్‌కు చాలా స్మార్ట్‌గా, కూల్‌గా అనిపించొచ్చు. కానీ లాంగ్ రన్‌లో ఇది మనుషుల మధ్య ఉండాల్సిన సున్నితమైన ఫీలింగ్స్‌ను చంపేసి, కేవలం ఆర్టిఫిషియల్ బంధాలను మాత్రమే మిగిలేలా చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ బెంచింగ్(Benching) గేమ్ ఆడుతున్నారని అనుమానం వస్తే మాత్రం, అలాంటి లూప్‌లో ఉండిపోకుండా వెంటనే క్లారిటీ తెచ్చుకుని బయటకు వచ్చేయడమే అన్నిరకాలుగా మంచిది.

Panchangam : పంచాంగం

Related Articles

Back to top button