Just LifestyleLatest News

Impatience:క్షణకాలపు ఆవేశం జీవిత కాలపు బంధాలను దూరం చేస్తుందా? అసహనాన్ని అదుపు చేసుకోలేమా?

Impatience: ఒకప్పుడు బస్సుల కోసం గంటలు వెయిట్ చేసే ఓపిక ఉండేది.. కానీ ఇప్పుడు ఒక్క నిమిషం లేట్ అయితేనే చిరాకు (Impatience)పెరుగుతోంది.

Impatience

కోపం, ఆవేశం వల్ల ఎందరో జీవితాలు నరకంగా మారుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎందరికో తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. అసలు అందరిలో సహనం ఎందుకు తగ్గిపోతోందనే విషయంపై మానసిక నిపుణులు కొన్ని వివరణలు ఇస్తున్నారు.

ఇప్పుడు మన మెదడు కూడా క్విక్ రిజల్ట్‌కు అలవాటు పడిపోయింది. వెయిటింగ్ అనే మాటకు చోటు లేకుండా పోతోంది. ఒకప్పుడు బస్సుల కోసం గంటలు వెయిట్ చేసే ఓపిక ఉండేది.. కానీ ఇప్పుడు ఒక్క నిమిషం లేట్ అయితేనే చిరాకు (Impatience)పెరుగుతోంది. వర్క్ టెన్షన్, ఫోన్ నోటిఫికేషన్లు, ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్, భవిష్యత్తుపై కన్ఫ్యూజన్ ఇప్పుడు అందరినీ ప్రతీరోజూ అసహనానికి గురి చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఇతరుల టెంపరరీ ఆనందాలను చూసి తమ జీవితంతో వాటిని పోల్చుకోవడం వల్ల అసంతృప్తి పెరుగుతోంది. అలాగే రోజురోజుకు ఎదుటవారి మాట వినే అలవాటు తగ్గిపోతోంది. ఎదుటవారి మాట పూర్తి కాకముందే మన సమాధానం సిద్ధంగా ఉంటోందా అన్నట్లు రిప్లై ఇస్తున్నాం.

ఓర్పు లేని చోట కేవలం ప్రతిచర్య మాత్రమే ఉంటుంది. బాడీకి విశ్రాంతి లభిస్తున్నా మనసు నిత్యం ఆలోచనలతో అలసిపోతోంది. దీని వల్లే చిన్న చిన్న విషయాలకు కూడా కోపంగా రియాక్టవుతున్నాం. సహనం తగ్గితే కుటుంబ, స్నేహ బంధాలు దూరమయిపోతాయి. అలాగే మన నిర్ణయాల్లో క్లారిటీ ఉండదు. జీవితంపైన చిరాకు ఏర్పడుతుంది. ఇది మనల్ని మనం కోల్పోయేలా చేసి మన అనుకున్నవాళ్లను దూరం చేసేస్తుంది. అందుకే సహనం అంటే పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి అని తెలుసుకోవాలి.

Impatience
Impatience

అందుకే కోపాన్ని అదుపు చేయడానికి ..అసహనం(Impatience) వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కాసేపు ఆగాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చిన్న గ్యాప్ పెద్ద మార్పును తీసుకువస్తుందట. కోపం వచ్చినపుడు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. నాలుగు సెకన్లు లోపలికి శ్వాస తీసుకుని, నాలుగు సెకన్లు ఆపి, నాలుగు సెకన్లు బయటకు వదలాలి. దీనివల్ల కోపం కంట్రోల్ అవుతుంది.

ప్రతిరోజూ 10 నిమిషాలు మెడిటేషన్ లేదా ప్రాణాయామం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమి, ఆకలి కూడా కోపానికి కారణంగా మారొచ్చు కాబట్టి హెల్త్‌పై శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అందరూ మనలాగే, మన అంచనాలను అందుకునేలా ఉండరని, మన మనసుకు తగ్గట్లుగా ప్రవర్తించరని గ్రహించాలి. ఆ సమస్య నిజంగా అంత పెద్దదా అని ఒక్కసారి ఆలోచిస్తే సగం కోపం పోతుంది. ఎప్పుడూ కూడా సహనం మనల్ని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతుందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

Deepika Padukone:దీప్-వీర్ గుడ్ న్యూస్..దువా పోస్ట్‌తో ఆ రూమర్లకు చెక్

Related Articles

Back to top button