Just LifestyleLatest News

Curry Leaves : కరివేపాకు కొన్న రెండు రోజులకే నల్లబడిపోతోందా?.. నెల రోజులు తాజాగా ఉంచే సూపర్ చిట్కాలు మీకోసం..

Curry Leaves : 2,3 రోజులకే కరివేపాకు వాడిపోవడం, నల్లగా మారిపోవడం చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని ఈజీ చిట్కాలు పాటిస్తే కరివేపాకుని ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా నిల్వ చేసుకోవచ్చు.

Curry Leaves

మన వంటకాల్లో కరివేపాకు లేకపోతే వంట చేసిన ఫీలే రాదు అన్నట్లుగా అలవాటు చేసుకున్నాం. వంటలకు మంచి రుచే కాదు.. మంచి సువాసన ఇస్తుంది . అంతే కాకుండా ఇది మనకు కావాల్సిన ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది.

అయితే మార్కెట్ నుంచి కొని తెచ్చిన కరివేపాకు(Curry Leaves) 2,3 రోజులకే ఆకులు వాడిపోవడం, నల్లగా మారిపోవడం చూస్తూనే ఉంటాం. దీంతో ఎక్కవ మోతాదులో ఉన్నా కూడా దాన్ని డస్ట్‌బిన్‌లో పడేస్తుంటాం. కానీ కొన్ని ఈజీ చిట్కాలు పాటిస్తే కరివేపాకుని ఎక్కువ రోజులు సూపర్ ఫ్రెష్‌గా నిల్వ చేసుకోవచ్చని చాలామందికి తెలీదు.

కరివేపాకు తెచ్చిన వెంటనే కడిగితే, ఆకులపై ఉండే తడి పూర్తిగా ఆరిన తర్వాతే నిల్వ చేయాలన్నది మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. ఆకులపై తడి ఉంటే కరివేపాకు(Curry Leaves)లు త్వరగా పాడైపోతాయి. కాబట్టి శుభ్రమైన క్లాత్ లేదా టిష్యూ పేపర్‌తో తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి.

పూర్తిగా ఆరిన కరివేపాకును కింద టిష్యూ పేపర్ పరచిన గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్ కవర్‌లో ఉంచాలి. దీనివల్ల ఆకుల్లో ఉండే ఎక్స్‌ట్రా తేమను టిష్యూ పీల్చుకుని ఆకులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ డబ్బాను, లేదా కవర్‌ను ఫ్రిడ్జ్‌లోని వెజిటబుల్ డ్రాయర్‌లో ఉంచితే 2 వారాల నుంచి 3 వారాల వరకు కరివేపాకు ఫ్రెష్‌గా ఉంటుంది.

Curry Leaves
Curry Leaves

అలాగే ఒక ఎయిర్ టైట్ డబ్బాలో అడుగున కొంచెం బియ్యం వేసి..బాగా ఆరిన కరివేపాకును అందులో వేయాలి. ఇలా నిల్వ ఉంచిన కరివేపాకు డబ్బాను ఫ్రిడ్జ్‌లో ఉంచితే దాదాపు నెల రోజులు వరకూ ఫ్రెష్ గానే ఉంటుంది.

ఒకవేళ మీరు నెలల తరబడి యూజ్ చేయాలనుకుంటే మాత్రం కరివేపాకుని ఐస్ క్యూబ్ ట్రేలో.. నీటితో పాటు ఆకులను గడ్డకట్టించి తర్వాత జిప్‌లాక్ బ్యాగ్‌లో కూడా దాచుకోవచ్చు. కరివేపాకును నీడలో లేదా కొంచెం ఎండలో ఆరబెట్టి ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టినా చాలా రోజులు ఉంటుంది. లేదంటే లేదా పొడి చేసి కూడా వాడుకోవచ్చు.

Linen : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన లెనిన్.. ఆగస్ట్ 7 అర్ధరాత్రి నుంచే వచ్చేసిన అయ్యగారు

Related Articles

Back to top button