Just LifestyleLatest News

Color:మీరు వేసుకునే బట్టల రంగు మీ మూడ్‌ని మారుస్తుందని మీకు తెలుసా..

Color: ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు తమ తమ లోగోలను తయారు చేసినప్పుడు, ఆఫీసులను డిజైన్ చేసేటప్పుడు ఈ కలర్స్ సీక్రెట్స్‌నే వాడుకుంటాయి.

Color

కలర్స్ అంటే కేవలం కంటికి కనిపించే అందాలు మాత్రమే కాదు. అవి మన మెదడుపై, ప్రవర్తనపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని సైకాలజిస్టులు అంటున్నారు. దీనినే శాస్త్రీయంగా కలర్ సైకాలజీ అని పిలుస్తారని చెబుతారు. ఎందుకంటే మనం ఏ రంగు బట్టలు వేసుకుంటున్నాం, మన చుట్టూ ఏ రంగులు ఉన్నాయనే దానిని బట్టి కూడా మన ఆలోచనలు, భావోద్వేగాలు మారిపోతుంటాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు తమ తమ లోగోలను తయారు చేసినప్పుడు, ఆఫీసులను డిజైన్ చేసేటప్పుడు ఈ కలర్స్ సీక్రెట్స్‌నే వాడుకుంటాయి.

నీలి రంగు అంటే నమ్మకం అంటారు. మీరెప్పుడైనా గమనించారా? బ్యాంకుల లోగోలు కానీ ఇన్సూరెన్స్ కంపెనీల లోగోలు కానీ ఎక్కువగా నీలి రంగులోనే ఉంటాయి. ఎందుకంటే బ్లూ కలర్( Color) అనేది మెదడులో ప్రశాంతతను, నమ్మకాన్ని కలిగిస్తుందట. అందుకే ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు బ్లూ కలర్ షర్టులు లేదా డ్రస్సులు వేసుకోవాలని నిపుణులు సూచిస్తారు. ఇది మీరు ఎంత స్థిరంగా, నమ్మకస్తుడిగా ఉన్నారో అవతలి వారికి తెలియజేస్తుందని వారి ఉద్దేశం. అదేవిధంగా బెడ్ రూమ్ గోడలకు కూడా చాలా ప్రశాంతంగా నిద్ర పడుతుందని లైట్ బ్లూ కలర్ వేస్తుంటారు.

Color
Color

ఎరుపు రంగు అంటే శక్తి, ఆకలికి గుర్తుగా చెబుతారు. రెడ్ కలర్( Color) వేసుకునప్పుడు మన రక్తపోటు, గుండె వేగం కూడా స్వల్పంగా పెరుగుతాయి. అంటే రెడ్ కలర్ ఒక రకమైన ఉత్తేజాన్ని, ఆకర్షణను కలిగిస్తుంది. ఇంకో విశేషమేమిటంటే, రెడ్ కలర్ ఆకలిని పెంచుతుంది. అందుకే చాలా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లోగోలు చాలా వరకూ ఎరుపు రంగులోనే ఉంటాయి. కానీ, మీరు ఎక్కువగా టెన్షన్ పడేవారయితే మాత్రం ఒత్తిడిని మరింత పెంచే ఎరుపు రంగుకు దూరంగా ఉండటమే మంచిది.

పసుపు తెలుపు రంగుల ప్రభావం చూస్తే.. ఎల్లో కలర్ రంగు సంతోషానికి, ఉత్సాహానికి సంకేతంగా చెబుతారు. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక తెలుపు రంగు అంటేనే స్వచ్ఛతకు, శాంతికి నిదర్శనం. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు వైట్ కలర్ బట్టలు వేసుకుంటే ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది. మొత్తంగా రంగులనేవి కేవలం అలంకారాలు కావు, అవి మన మనసును నయం చేసే సాధనాలు కూడా అని తెలుసుకుని వాటిని ఫాలో అయిపోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button