Just LifestyleLatest News

First Sight:మొదటి చూపులోనే మనిషిని నమ్మేస్తున్నారా? అదే మన మెదడు చేసే ఒక చిన్న పొరపాటు..

First Sight: ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు చాలా పద్ధతిగా, నీట్‌గా డ్రెస్ వేసుకుని ఎవరైనా వస్తే, వాళ్లు పని కూడా చాలా బాగా చేస్తారని అవతలి వారు ఒక అంచనాకు వచ్చేస్తారు.

First Sight

ఎవరినైనా మనం మొదటిసారి చూసినప్పుడు( First Sight), ఎదుటి వాళ్లు చాలా అందంగా ఉన్నా లేదంటే వాళ్ల నవ్వు చాలా బాగున్నా, వెంటనే మనకు తెలీకుండానే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇంకా వివరంగా చెప్పాలంటే వాళ్లు చూడటానికి( First Sight) బాగున్నారు కాబట్టి, కచ్చితంగా వాళ్లు చాలా మంచి వాళ్లై ఉంటారని, చాలా తెలివైన వాళ్లై ఉంటారని మన మెదడు మనల్ని నమ్మించేస్తుందన్నమాట. దీన్నే సైకాలజీ భాషలో హాలో ఎఫెక్ట్ అని పిలుస్తారట.

సింపుల్‌గా చెప్పాలి అంటే ఎదుటివాళ్లలో ఒకే ఒక్క మంచి లక్షణాన్ని చూసి, మనకు మనమే ఆ వ్యక్తిలో లేని మిగతా మంచి గుణాలన్నీ ఉన్నాయని ఊహించుకోవడం అన్నమాట. ఇది మనకు తెలియకుండానే మన మెదడు చేయించే ఒక పొరపాటు.

నిజానికి ఒక మనిషి అందానికి, ఆ వ్యక్తి ప్రవర్తనకు , తెలివితేటలకు అసలు సంబంధమే ఉండదు. కానీ మన కళ్లకు ఏదైనా నచ్చితే మాత్రం మన మనసు కూడా మన ప్రమేయం లేకుండానే  ఆ వ్యక్తికి అనుకూలంగా మారిపోతుందన్న మాట. దీనికి ఉదాహరణగా .. ఒక ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు చాలా పద్ధతిగా, నీట్‌గా డ్రెస్ వేసుకుని ఎవరైనా వస్తే, వాళ్లు పని కూడా చాలా బాగా చేస్తారని అవతలి వారు ఒక అంచనాకు వచ్చేస్తారు. దీనినే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటూ చాలామంది ఫాలో కూడా అవుతుంటారు.

అంతెందుకు సినిమాల్లో కూడా హీరో , హీరోయిన్ చూడటానికి చాలా బాగుంటారు(First Sight) కాబట్టి, వాళ్లు ఏం చేసినా కరెక్ట్ అని మనకు తెలీకుండానే ఫీల్ అవుతాం. అంటే సినిమాలలో కనిపించే ఆ ఒక్క అందం అనే వెలుగులో.. వాళ్లలో ఉన్న లోపాలన్నీ నిజజీవితంలో మన కళ్లకు కనిపించకుండా పోతాయన్న మాట.

అయితే ఈ అలవాటు వల్ల మనం కొన్నిసార్లు మోసపోయే ఛాన్స్ కూడా ఉంటుందట. ఎందుకంటే పైకి కనిపిస్తున్నంత మాత్రాన లోపల కూడా అలాగే ఉంటారన్న గ్యారంటీ ఉండదు. కొంతమంది రెండు రకాలుగా కూడా బాగున్నా..మరికొంతమందిని మాత్రం బాగా స్టడీ చేయాలి.  ఒక్క రూపం , నవ్వు, చూసి మోసపోకూడదు.

అంటే కేవలం మాటలు బాగున్నాయనో, డ్రెస్సింగ్ బాగుందనో అనుకుని వారిని నమ్మడం వల్ల, ఆ తర్వాత వాళ్ల అసలు రూపం తెలిసినప్పుడు ఇబ్బంది పడతాం. మన మెదడు మాత్రం ఎప్పుడూ ఒక విషయాన్నే సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్న విషయాన్ని మనం గుర్తించాలి.  మన మెదడు ఒక వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే, వాళ్లు చూసే విధానాన్ని బట్టి వారి గురించి మనలో ఒక ముద్ర వేసేస్తుందన్న విషయాన్ని గ్రహించాలి.

First Sight
First Sight

అయితే ముందుగానే మనం ఈ హాలో ఎఫెక్ట్ గురించి తెలుసుకోవడం వల్ల ఒక లాభం ఉంది . మనం ఎవరినైనా కలిసినప్పుడు వెంటనే వారి గురించి ఒక నిర్ణయానికి రాకుండా, కొంచెం సమయం తీసుకుని వాళ్ల గురించి తెలుసుకోగలుగుతాం. కేవలం పైకి కనిపించే అందాన్ని చూసి మురిసిపోకుండా, వాళ్ల నిజమైన వ్యక్తిత్వం ఏంటో గమనిస్తాం.

అలాగే మనం కూడా వేరేవాళ్ల ముందు మనల్ని మనం ప్రెజెంట్ చేసుకునేటప్పుడు, మన మొదటి ఇంప్రెషన్ బాగుండేలా చూసుకోవాలని సైకాలజిస్టులు చెబుతారు. ఎందుకంటే మన లోపల ఎంత మంచి గుణం ఉన్నా.. మొదట కనిపించే ఆ ఒక్క చిన్న మంచి విషయమే అవతలి వాళ్లు మన గురించి ఒక ఒపీనియన్‌కు రావడానికి రీజన్ అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button