Just LifestyleLatest News

Financial Habits : చేతిలో డబ్బు మిగలడం లేదా.. వాస్తు దోషమా? సైకాలజీ చెప్పే సీక్రెట్ ఏంటి?

Financial Habits : సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం, మనలో ఎవరికైనా ఏదైనా ఆర్థిక సమస్య ఎదురైనప్పుడు మన మెదడు ఆ తప్పులు తనవే అని ఒప్పుకోవడానికి ఇష్టపడదు

Financial Habits

ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా నిలవడం లేదు.. లక్ష్మీదేవి వచ్చినంత వేగంగా వెళ్లిపోతోందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఆదాయం పెరుగుతున్నా బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఉండటం లేదని వాపోతుంటారు.

ఇలాంటప్పుడు చాలా మంది సమస్యకు కారణమేంటని ఆలోచించకుండా, వెంటనే వాస్తు మార్పుల కోసం పరిగెడుతుంటారు. ఇంటి ఈశాన్యం మూసేసి ఉంది అనో.. కుబేర మూలలో బరువులు ఎక్కువయ్యాయి అనో అనుకుంటూ రకరకాల కారణాలు వెతుకుతుంటారు. కానీ, డబ్బు నిజంగా ఇంటి వాస్తు లోపం వల్ల పోతోందా.. లేదా చేతివాటం , అలవాట్ల వల్ల పోతోందా?” అనే ప్రశ్నను మాత్రం ఎవరూ ప్రశ్నించుకోరు.

సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం, మనలో ఎవరికైనా ఏదైనా ఆర్థిక సమస్య(Financial Habits) ఎదురైనప్పుడు మన మెదడు ఆ తప్పులు తనవే అని ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఆ తప్పులను బయట ఉన్న పరిస్థితులపైకి నెట్టేయడానికే ప్రయత్నిస్తుంది.

అందుకే అవసరం లేకపోయినా ఆన్‌లైన్ యాప్స్‌లో లెక్కలేకుండా ఖర్చు చేసే ఒక వ్యక్తి.. దానిని సరిదిద్దుకోవడానికి బదులు, మా ఇంటి వాస్తు అస్సలు బాలేదు, అందుకే డబ్బు నిలవడం(Financial Habits) లేదని నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే అలా నమ్మడం వల్ల తన తప్పు లేదనే ఒక దొంగ ఓదార్పు మెదడు నుంచి లభిస్తుంది.

నిజానికి చేతిలో డబ్బు నిలవకపోవడానికి ముఖ్యంగా మూడు రకాల అలవాట్లు కారణమవుతుంటాయి.

మొదటిది.. ప్లానింగ్ లేకుండా కొనేయడం. కేవలం పక్కింటి వాళ్ల దగ్గర ఉందనో, లేక సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉందనో అవసరం లేని వస్తువులను కూడా అప్పులు చేసి కొనేస్తుంటారు.

రెండోది.. డైలీ ఖర్చులపై నిఘా లేకపోవడం. ఎంత ఆదాయం వస్తోందో తెలుసు కానీ, అది ఏయే దారుల్లో ఖర్చయిపోతోందో లెక్కలు చూసుకోరు.

మూడోది.. సొసైటీ కోసం, పక్కవారి కోసం గొప్పలకు పోయి బతకడం. ఈ రోజుల్లో చాలా మంది పక్కవారితో పోల్చుకుని తమ ఆర్థిక స్థాయికి మించిన హంగులను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనివల్ల తీవ్రమైన అప్పుల ఒత్తిడిని అనుభవిస్తున్నారు.

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలంటే మనకు వచ్చిన ఇన్కమ్ కంటే తక్కువ ఖర్చు చేయడం, రూపాయి రూపాయి జాగ్రత్తగా దాచుకోవడం, తెలివిగా మదుపు చేయడం, ఏది అవసరమో దానికే ఖర్చు పెట్టడం చేస్తే అదే నిజమైన ధన వాస్తు. చాలా మంది ఇంటి దిశలను మార్చడానికి వేలాది రూపాయలు నీళ్లలా ఖర్చు చేస్తారు. కానీ, తమ జేబు అలవాట్లను మార్చుకోవడానికి ఐదు నిమిషాల సమయాన్ని కూడా కేటాయించరు.

Financial Habits
Financial Habits

ఇంటి వాతావరణం మీ మూడ్‌ను మార్చగలదేమో కానీ, మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను డిసైడ్ చేసేది మాత్రం కేవలం మీ ఫైనాన్సియల్ క్రమశిక్షణ(Financial Habits) మాత్రమే. ఇల్లు ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా, ఖర్చులపై కంట్రోల్ లేకపోతే మాత్రం డబ్బులు అస్సలు నిలవవు. అందుకే డబ్బు నిలవడం లేదని అనిపించినప్పుడు ముందుగా వాస్తు వైపు కాకుండా, మీ అలవాట్ల వైపు దృష్టి పెట్టండి. ఎందుకంటే అసలు సమస్య ఇంటి వాస్తులో ఉండదు.. మన ఆలోచనా విధానంలోనే ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి.

HDFC : హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్..జులై 1 నుంచి మారనున్న ఈ రూల్స్

Related Articles

Back to top button