Hill Stations:జేబుకు చిల్లు పడని జిల్ జిల్ హిల్ స్టేషన్లు..ఈ వేసవిలో ఆ ఐదు చోట్ల వాలిపోండి..
Hill Stations: మన ఇండియాలోనే తక్కువ మందికి తెలిసిన, ప్రకృతి ఒడిలో ఉన్న అద్భుతమైన ఆఫ్-బీట్ హిల్ స్టేషన్లను తక్కువ ఖర్చుతో చుట్టి వచ్చేయొచ్చు.
Hill Stations
మార్చిలోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. ఏసీలు వేసినా, ఐస్ క్రీంలు తిన్నా ఆ వేడి తగ్గడం లేదు. ఇలాంటి టైమ్‌లో ఊటీ, మనాలీ వంటి హిల్ స్టేషన్(Hill Stations)కు వెళ్లాలని ఉన్నా అక్కడ జనాల రద్దీ బీపీ పెంచేస్తుంటుంది. పోనీ ఖర్చు చూద్దామా అంటే ఆ టూర్ బడ్జెట్ ఆకాశాన్ని తాకుతోంది. ఇలాంటి వారి కోసం మన ఇండియాలోనే తక్కువ మందికి తెలిసిన, ప్రకృతి ఒడిలో ఉన్న అద్భుతమైన ఆఫ్-బీట్ హిల్ స్టేషన్లను తక్కువ ఖర్చుతో చుట్టి వచ్చేయొచ్చు.
లాంగ్‌వా – నాగాలాండ్.. మీరు ఎప్పుడైనా సరే ఒకే ఇంట్లో ఉండి 2 దేశాలను చూశారా? నాగాలాండ్‌లోని లాంగ్‌వా గ్రామం అలాంటి వింతకు వేదికగా చెబుతారు. ఇక్కడి రాజు గారి ఇల్లు సగం ఇండియాలో, మిగిలిన సగం మయన్మార్‌లో ఉంటుంది.
చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, పచ్చని ప్రకృతి మధ్య ఈ ప్రదేశం ఎవరికైనా సరే సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ హోమ్ స్టేలు చాలా తక్కువ ధరకే దొరకడంతో పాటు..రద్దీ అస్సలు ఉండదు, కాబట్టి మీ భాగస్వామితో లేదా స్నేహితులతో ప్రశాంతంగా గడపొచ్చు.
చక్రాతా – ఉత్తరాఖండ్..ముస్సోరీ పేరు చాలామందికి పరిచయమే.అయితే దానికి దగ్గరలోనే ఉండే చక్రాతా గురించి చాలా మందికి తెలీదు. ఇక్కడ ఎత్తైన దేవదారు వృక్షాలు, టైగర్ ఫాల్స్ వంటి జలపాతాలు అందంగా స్వాగతం పలుకుతాయి. పర్యాటకుల తాకిడి తక్కువే కాబట్టి ఇక్కడ హోటల్ ధరలు కూడా తక్కువ బడ్జెట్ లోనే ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు , ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది ఒక స్వర్గం లాంటిది.
తవాంగ్-అరుణాచల్ ప్రదేశ్.. మంచు కొండల మధ్య, బౌద్ధారామాల శాంతిని మనసారా ఆస్వాదించాలనుకుంటే తవాంగ్ బెస్ట్ ఆప్షన్. ఇక్కడి సెలా పాస్, తవాంగ్ మొనాస్టరీ ఎవరినైనా సరే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయి. ఇక్కడ గాలిలో ఉండే స్వచ్ఛత ఒత్తిడిని ఒక్క క్షణంలో మాయం చేసేస్తుంది. ఇద్దరు, ముగ్గురు వెళ్లడం కంటే..ఒక గ్రూపులో ఇక్కడ ప్రయాణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

ఢిల్లీకి దగ్గరగా ఉన్నా కూడా, ఈ హిల్ స్టేషన్ (Hill Stations) ఇంకా తన సహజత్వాన్ని కోల్పోలేదు. బ్రిటిష్ కాలం నాటి బిల్డింగులు, పాత చర్చిలు, బ్లూ కలర్ సరస్సులతో ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ పెద్దగా షాపింగ్ మాల్స్, ట్రాఫిక్ గొడవలుండవు. కేవలం మీరు ,ప్రకృతి మాత్రమే ఉంటారు. తక్కువ ఖర్చుతో సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
జూకు వ్యాలీ -మణిపూర్/నాగాలాండ్ సరిహద్దు.. మీరు ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి జూకు వ్యాలీ అస్సలు మిస్ అవ్వొద్దు. ఈ లోయలో వికసించే కలర్‌ఫుల్ ఫ్లవర్స్, చుట్టూ ఉండే ఆకుపచ్చని కొండలను చూస్తుంటే భూమి మీదే స్వర్గం అంటే.. ఇదేనేమో అనిపిస్తుంది. ఇక్కడ క్యాంపింగ్ చేయడం ఒక మర్చిపోలేని అనుభూతి. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేయగలిగే అడ్వెంచర్ ట్రిప్ .





