Summer:సమ్మర్ హీటుకు చెక్ పెట్టండిలా..సమ్మర్ చిట్కాలు మీకోసం

Summer: వేసవి కాలం(Summer) రాగానే టెంపరేచర్ రికార్డు స్థాయిల్లో నమోదవడంతో.. ఇళ్లు నిప్పుల కొలిమిలా మారిపోతుంటాయి

Summer

వేసవి కాలం(Summer) రాగానే టెంపరేచర్ రికార్డు స్థాయిల్లో నమోదవడంతో.. ఇళ్లు నిప్పుల కొలిమిలా మారిపోతుంటాయి. చాలా మంది వేడి నుంచి బయటపడటానికి ఏసీల మీద ఆధారపడుతుంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ కొన్ని మార్గాల ద్వారా ఏసీ సహాయం లేకుండానే మన ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు.

వీటిలో అతి ముఖ్యమైనది గాలి ప్రవాహాన్ని కంట్రోల్ చేయడం.వేసవికాలం(Summer)లో పగటిపూట వేడి గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు పూర్తిగా మూసేసి దళసరి కర్టెన్లు వేయాలి. దీనివల్ల బయటి వేడి గాలి లోపలికి రాకుండా ఉంటుంది. సాయంత్రం అయ్యాక బయట వాతావరణం చల్లబడినప్పుడు కిటికీలు తెరిస్తే, క్రాస్ వెంటిలేషన్ ద్వారా ఇంట్లోని వేడి గాలి బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల చల్లదనం పెరుగుతుంది.

మరో చిట్కా ఏమిటంటే, టేబుల్ ఫ్యాన్ ముందు ఒక గిన్నెలో ఐస్ ముక్కలు కానీ కూలింగ్ వాటర్ బాటిల్ కానీ ఉంచాలి. ఇలా చేయడం

వల్ల ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ఏసీ లాగా చల్లగా మారుతుంది. ఇంట్లో సాధారణ బల్బులను వాడటం కంటే ఎల్‌ఈడీ లైట్లు వాడటం మంచిది. ఎందుకంటే పాత బల్బులు ఎక్కువ వేడిని రిలీజ్ చేస్తాయి. అలాగే వంట చేసే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడాలి. దీని వల్ల కిచెన్ లోని వేడి గది అంతా వ్యాపించకుండా బయటకు వెళ్లిపోతుంది.

Summer

ఇంటి చుట్టూ కానీ బాల్కనీలో కానీ మొక్కలు పెంచడం వల్ల కూడా సహజ సిద్ధమైన కూలింగ్ లభిస్తుంది. కాటన్ బెడ్ షీట్లు, కర్టెన్లు వాడటం వల్ల గాలి ప్రసరణ బాగుంటుంది. ఇక బాడీని చల్లగా ఉంచుకోవడానికి కాటన్ దుస్తులు ధరించడం, తడి గుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం వంటివి తక్షణ రిలీఫ్‌ను ఇస్తాయి.

ఒకవేళ మీ ఇంట్లో ఏసీ ఉన్నా అది సరిగా పనిచేయనట్లు అన్పిస్తే.. వెంటనే ఫిల్టర్లు శుభ్రం చేయడం తో పాటు సరైన సర్వీసింగ్ చేయించడం ముఖ్యం. ఏసీని 24 డిగ్రీల వద్ద సెట్ చేయడం వల్ల ఆరోగ్యం , కరెంటు ఆదా రెండూ సాధ్యమవుతాయి.

LSG vs KKR : లక్నో గెలుపు బాట పట్టేనా ?..కోల్ కతాతో డూ ఆర్ డై

Exit mobile version