Life-changing
జీవితంలో ఏదైనా అనుకోని నెగిటివ్ సంఘటన జరిగినప్పుడు.. అయ్యో, నాకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతుంటాం.కానీ, అదే నెగిటివ్ సిట్యువేషన్ నుంచి వెతికి వెతికి మరీ 3 పాజిటివ్ విషయాలను బయటకు తీసే మైండ్ సెట్‌ను కనుక అలవాటు చేసుకుంటే .. లైఫే మారిపోతుంది (Life-changing).
సైకాలజీ (Behavioral Psychology) ప్రపంచంలో ఈ మానసిక అలవాటునే కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ (Cognitive Reframing) లేదా సిల్వర్ లైనింగ్ మైండ్ సెట్ అంటారు. మనం చూసే చూపును మార్చుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుందని.. ఈ క్రేజీ సైకాలజీ ట్రిక్ వెనుక ఉన్న సీక్రెట్స్‌ను సైకాలజిస్టులు వివరిస్తున్నారు.
ఉదాహరణకు మనం నడుస్తున్నప్పుడు అనుకోకుండా కింద పడ్డామనుకోండి.. అబ్బా, కాలు విరిగిపోలేదు, కేవలం చిన్న గీత మాత్రమే పడింది అంటే నేను లక్కీయే అనుకోవడం మొదటి పాజిటివ్ విషయం. రోడ్డుపై వెళ్లేటపుడు ఇలాంటి గుంతలు ఉన్నప్పుడు చూసుకుని నడవాలనే విషయం నాకు తెలిసిందని అనుకోవడం రెండో పాజిటివ్ విషయం.
ఇక ఈ దెబ్బ వల్ల కాసేపు రెస్ట్ తీసుకుని నాకోసం నేను కేర్ తీసుకోవడానికి టైమ్ దొరికిందని అనుకోవడం మూడో పాజిటివ్ విషయం. ఇలా ఆలోచించడాన్నే సైకాలజీలో ఒక ఆర్ట్‌గా చెబుతారు. అంటే ఇక్కడ జరిగిపోయిన విషయాన్ని మనం మార్చలేం, కానీ ఆ తప్పు నుంచి మనం నేర్చుకునే పాఠాన్ని, మనకు కలిగిన లాభాన్ని వెలికితీసి మనకు మనమే అలా చెప్పుకోవడంతో మన మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
ఇలా ప్రతి నెగిటివ్ విషయంలోనూ 3 మంచి విషయాలను వెతికే అలవాటును నేర్చుకోవడం వల్ల మన మెదడులో న్యూరోప్లాస్టిసిటీ అనే మార్పు వస్తుంది. సాధారణంగా మనిషి బ్రెయిన్ ఎప్పుడూ నెగిటివ్ విషయాలకు చాలా త్వరగా కనెక్ట్ అవుతుంది. దీనినే నెగిటివిటీ బయాస్ అంటారు.
అయితే ఏదైనా చెడు సంఘటన జరిగినపుడు మనం కావాలని నెగిటివ్ ఇన్సిడెంట్ నుంచి మూడు పాజిటివ్ పాయింట్స్ ఆలోచించడం స్టార్ట్ చేస్తే, మెదడులోని నెగిటివ్ ఆలోచనా విధానం బ్రేక్ అయిపోతుందన్న మాట. దీనివల్ల విపరీతమైన ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి.. ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే మానసిక శక్తి (Resilience) పెరుగుతుంది.
ఈ మైండ్ సెట్ అలవాటు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని సైకాలజిస్టులు చెబుతున్నారు. లైఫ్‌లో ఏదైనా బ్యాడ్ సిట్యువేషన్ ఎదురైనప్పుడు.. దీనిలో నాకు తెలియకుండా దాగి ఉన్న ఆ మూడు మంచి విషయాలు ఏంటని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అది చిన్న జాబ్ లాస్ కావొచ్చు, బ్రేకప్ కావొచ్చు, లేదా బిజినెస్ లాస్ కావొచ్చు.. ప్రతిదాని వెనుక ఒక కొత్త అనుభవం, ఒక కొత్త అవకాశం, ఒక సరికొత్త పరిణతి దాగి ఉంటాయన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి.
ఇలా ఆలోచించడం వల్ల మనం ప్రాబ్లెమ్స్‌ను చూసి భయపడటం మానేస్తాం. వాటిని మన ఎదుగుదలకు ఉపయోగపడే మెట్లుగా మార్చుకుంటాం. అందుకే నెగిటివిటీకి గుడ్ బై చెప్పేసి.. ప్రతి బ్యాడ్ మూమెంట్‌లోనూ ఆ మ్యాజికల్ 3 పాజిటివ్స్ వెతకడం అలవాటు చేసుకోవాలని.. లైఫ్ ఎప్పుడూ హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా సాగిపోతుందని (Life-changing) మానసిక నిపుణులు చెబుతున్నారు.
Ponnam Prabakar : బరాబర్ మా అయ్య జాగీరే..పవన్ కు పొన్నం కౌంటర్
