Just LifestyleLatest News

Mind Controling Power : మీ మైండ్‌కి మీరే బాస్ అవ్వాలా?..ఈ 10 విషయాలు కచ్చితంగా ఫాలో అవ్వండి..

Mind Controling Power : మీరు ఒక విషయానికి నో చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తున్నాడో కూడా క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి.

Mind Controling Power

ఎవరు అవును అన్నా ఎవరు కాదు అన్నా.. మన లైఫ్‌కి మనమే హీరో. కాకపోతే చాలాసార్లు పక్కనోళ్ల మాటలకు, వాళ్ల రెచ్చగొట్టే ప్రవర్తనకో. టక్కున టెంపర్ లూజ్ అయిపోయి మన గేమ్‌ను వాళ్ల చేతుల్లోకి వెళ్లేలా చేసుకుంటాం. ఇలా జరగకుండా ఎప్పుడూ కూడా మన ఆలోచనలు, మన మైండ్, మన చుట్టూ ఉండే సిచ్యువేషన్స్.. అన్నీ కూడా కంప్లీట్ మన కంట్రోల్‌లోనే(Mind Controling Power) ఉండాలంటే 10 సైకాలజీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుంటే చాలని అంటున్నారు మానసిక నిపుణులు.

ప్రతీ చిన్న విషయానికి ఎదుటివారు బాధపడతారనో, వాళ్లు అర్ధం చేసుకోరనో మీరే ఊహించుకుని.. అందరికీ రీజన్స్ చెప్తూ కూర్చోవడం మానేయండి. ఎందుకంటే మీరు తీసుకునే ప్రతీ డిసిషన్ వెనుక ఎందుకు, ఏమిటి అని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు.

ఎవరైనా మిమ్మల్ని కావాలని ప్రొవోక్ చేసినప్పుడు, రెచ్చగొట్టే మాటలు అనేటపుడు వెంటనే ఆవేశపడకుండా మైండ్‌ను ఫుల్ కూల్‌గా ఉంచడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీ రియాక్షన్‌పై మీకు కంట్రోల్ ఉన్నంత(Mind Controling Power) వరకే, అక్కడ జరిగే విషయం మీ చేతిలో ఉంటుంది. ఒక్కసారి కంట్రోల్ తప్పారో ఇక అక్కడ సీన్ మొత్తం అవతలివారి చేతికి వెళ్లిపోయినట్లే.

అలాగే ఇష్టం లేని విషయాలకు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులకు స్ట్రెయిట్‌గా నో చెప్పడం నేర్చుకోండి. అంతేకాదు ఎందుకు నో చెప్తున్నారో అనేది వాళ్లకు వివరించక్కరలేదు. అలా ఎప్పుడూ వివరణలు ఇస్తూ ఉంటే, మీరు చెప్పే ఆ నో కి ఉండే వాల్యూ కూడా తగ్గిపోతుంది.

మీరు ఒక విషయానికి నో చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తున్నాడో కూడా క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి. అక్కడే మీ పట్ల వాళ్లకున్న అసలు ప్రేమ లేదంటే అవసరం ఏంటనే ముసుగు తొలిగిపోయి బయటపడుతుంది.

ఏం జరిగినా సరే వెంటనే రియాక్ట్ అయిపోయి నోరు జారకండి. లేదంటే వెంటనే మెసెజ్‌కు రిప్లై ఇచ్చేయకండి. కాస్త పాజ్ తీసుకోండి. దానిపై మనసులో కాసేపు సైలెంట్‌గా ఆలోచించి, ఆ తర్వాత మెచ్యూర్డ్‌గా జవాబివ్వండి. దాని రిజల్ట్ చాలా అమేజింగ్‌‌గా ఉంటుంది.

నలుగురిలోకి వెళ్లనపుడు మీ బాడీ లాంగ్వేజ్‌ను పవర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకోండి. మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ మీ కాన్ఫిడెంట్ లుక్స్ కానీ మీ సీరియస్ బాడీ లాంగ్వేజ్‌ను మీ ఇంటర్నల్ స్ట్రెంత్‌ని చూపించాలి. అంతే తప్ప లోపల ఉన్న భయాన్ని లేదా బలహీనతను, ఎదుటివారిపై కోపాన్ని బయటకు లీక్ చేయకూడదు.

ఇంకో ముఖ్యమైనది ఎప్పుడూ సింపతీ కోసం విక్టిమ్ కార్డ్ వాడే మనుషులతో వాదనలకు అసలు దిగకండి. అలాంటివారి వాదనల్లో నెగ్గడం కంటే, అసలు ఆ టాపిక్‌లోకి ఎంటర్ అవ్వకుండా వారికి దూరంగా ఉండటమే పెద్ద విక్టరీ.

జనాలతో మాట్లాడం కంటే కూడా వాళ్లు మాట్లాడేటప్పుడు వాళ్ల వాయిస్‌లో వచ్చే టోన్ మార్పులను గమనించడం మొదలు పెట్టండి. ఆ వాయిస్ మోడ్యులేషన్‌ను పట్టేశారంటే, వాళ్ల మైండ్‌లో ఉన్న అసలు ఇంటెన్షన్స్ ఏంటో మీరు ఈజీగా డికోడ్ చేయొచ్చు.అలాగే వారి కళ్లల్లోకి చూస్తూ మాట్లాడండి. అవతలివారి నిజాయితీ వారి కళ్లల్లో కనిపిస్తుందేమో అబ్జర్వ్ చేయండి.

Mind Controling Power
Mind Controling Power

ఏదైనా గొడవ లేదంటే గ్యాప్ తర్వాత అవతలి వ్యక్తి సడన్‌గా మీపై అమితమైన ప్రేమను, ఆప్యాయతను చూపిస్తుంటే అస్సలు నమ్మొద్దు. అది నిజంగా వారు మారడం వల్ల వచ్చిన ప్రేమా.. లేక మిమ్మల్ని మరోసారి మానిప్యులేట్ చేసి వాళ్లకు కావాల్సింది చేయడానికి వేసిన ప్లానా అనేది క్రాస్ చెక్ చేసుకోండి.

ఎప్పుడూ కూడా మీ గోల్స్ సాధించి సక్సెస్ కొట్టే వరకు కూడా వాటిని అందరి ముందూ మైక్ పెట్టి చెప్పుకోకండి. డ్రీమ్స్ ఎప్పుడూ బయటకు వినిపించడం కంటే, రిజల్ట్స్ రూపంలో కనిపించే వరకు మీరు సైలెంట్‌గా ఉండటమే అసలు విజయం అని తెలుసుకోండి.

మొత్తంగా మీరు పర్మిషన్ ఇస్తే తప్ప మీ మనసును, మీ మైండ్‌ను ప్రపంచంలో వేరెవ్వరూ కంట్రోల్ చేయలేరన్న విషయాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి.

Potatoes In The Fridge : ఫ్రిడ్జ్‌లో ఆలుగడ్డలు పెడుతున్నారా? అయితే మీరిది తప్పకుండా చదవాల్సిందే..

Related Articles

Back to top button