Just LifestyleLatest News

Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ మిమ్మల్ని అడిక్ట్ చేస్తోందా? ఈ చిన్ని ట్రిక్స్ ఫాలో అవ్వండి చాలు..

Online Shopping Addiction : చాలామంది వర్క్ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ లేదా లోన్లీనెస్‌ను మర్చిపోవడానికి ఈ ఆన్‌లైన్ షాపింగ్‌ను ఒక ఎస్కేప్ రూట్‌లా వాడుతుంటారు.

Online Shopping Addiction

ఈ రోజుల్లో హోమ్ నీడ్స్ నుంచి పర్సనల్ థింగ్స్ వరకు ఏది కావాలన్నా మన మొబైల్‌లో ఒక చిన్న క్లిక్ చేస్తే చాలు, డైరెక్టుగా గుమ్మం ముందుకు వచ్చేస్తున్నాయి. నిజానికి ఇది మన లైఫ్‌ను చాలా ఈజీ చేసింది. కానీ ఇదే మెల్లగా మనకు తెలీకుండానే ఒక పెద్ద వ్యసనంగా మారేలా చేస్తుందన్న విషయం చాలామంది తెలుసుకోలేకపోతున్నారు.

మనం మన లిమిట్‌ కూడా దాటిపోయి ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి కేవలం కంటికి కనిపించే ఆఫర్లు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. దీని వెనుక మన మనస్తత్వం, మెదడు పనిచేసే తీరు, మైండ్ గేమ్ ఆడే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ దాగి ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

మనం ఆన్‌లైన్ యాప్‌లలో నచ్చిన వస్తువును చూసి బై నౌవ్ అనేది ప్రెస్ చేయగానే మెదడులో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది మనలో తెలీకుండానే ఒక విచిత్రమైన ఉత్సాహాన్ని, జోష్‌ను ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఐటెమ్‌ను వాడటంలో కంటే కూడా ఆర్డర్ పెట్టడంలో, ఆ పార్శిల్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడటంలోనే ఎక్కువమందికి ఒక కిక్ వస్తుందట.

చాలామంది వర్క్ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ లేదా లోన్లీనెస్‌ను మర్చిపోవడానికి ఈ ఆన్‌లైన్ షాపింగ్‌ను ఒక ఎస్కేప్ రూట్‌లా వాడుతుంటారు. కానీ ఇలా షాపింగ్ వల్ల వచ్చే హ్యాపీనెస్‌ క్షణకాలమే అన్న విషయాన్ని మర్చిపోతుంటారు. ఆర్డర్ పూర్తయ్యాక అనవసరంగా ఖర్చు చేశాననే గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్లీ ఆ స్ట్రెస్ నుంచి బయటపడటానికి ఇంకో ఆర్డర్ చేస్తారు. అలా ఇదొక ఊబిలా మారిపోతుంది.

చాలాసార్లు ఇంకొద్ది నిమిషాల్లో సేల్ ముగుస్తుందనో.. కేవలం రెండు మాత్రమే స్టాక్ ఉన్నాయనే మెసేజ్‌లు రాగానే ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే కొనకపోతే ఆఫర్ పోతుందేమో అనే ఈ ఆందోళనను బిజినెస్ కంపెనీలు క్యాష్ చేసుకుంటాయి. ఆలోచించే టైమ్ కూడా ఇవ్వకుండా క్షణాల్లో మనచేత డెసిషన్ తీసుకునేలా చేస్తాయి. చివరికి సరదాగా ప్రొడక్ట్స్‌ని కార్ట్‌లో యాడ్ చేయడం, ఆర్డర్ చేయడం కూడా మెదడుకు ఒక ఎంటర్‌టైన్మెంట్‌గా మారిపోతుంది.

అయితే ఈ అలవాటు లిమిట్స్ దాటితే పొదుపు కరిగిపోయి, అప్పుల పాలవడం గ్యారంటీ అన్న విషయం అస్సలు గుర్తుకు రాదు. ఆ తర్వాత ఫ్యామిలీలో గొడవలు, మానసిక ప్రశాంతత పాడవ్వడం వంటి ప్రాబ్లెమ్స్ స్టార్ట్ అవుతాయి.

అందుకే ఈ ఆన్‌లైన్ షాపింగ్ పిచ్చిని(Online Shopping Addiction) తగ్గించుకోవడానికి సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే ఆర్డర్ చేసేయకుండా కనీసం 24 గంటలు వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోవాలి.

ఈ గ్యాప్ వల్ల ఆవేశంలో తీసుకునే సగం నిర్ణయాలు అక్కడే ఆగిపోతాయి. ఆ వస్తువు మనకు ఇప్పుడు అవసరమా, ఒకవేళ కావాలి అనుకుంటే ఎంత అవసరం, అది లేకపోతే ఇబ్బంది ఉంటుందా అని ఒకటికి రెండు సార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలు..చాలా వరకూ కార్టులో ఉన్న వస్తువు ఆర్డర్ వరకూ రాకుండా ఉంటుంది.

Online Shopping Addiction
Online Shopping Addiction

అంతేకాకుండా ప్రతినెలా ఆన్‌లైన్ షాపింగ్‌కి ఇంత మాత్రమే ఖర్చు చేయాలని ఒక ఫిక్స్‌డ్ బడ్జెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. షాపింగ్ యాప్‌ల నోటిఫికేషన్లు అన్నింటిని సైలెంట్‌లో పెట్టేయాలి. బోర్ కొట్టినపుడు, స్ట్రెస్‌గా ఫీల్ అయినపుడు షాపింగ్ యాప్స్ ఓపెన్ చేయకుండా బుక్స్ చదవడం, వర్కౌట్ చేయడం నచ్చిన హాబీస్‌పై ఫోకస్ పెట్టడం వంటివి అలవాటు చేసుకోవాలి.

మొత్తంగా చెప్పాలంటే ఆన్‌లైన్ షాపింగ్ ఎప్పుడూ తప్పు కాదు. కానీ అది మన ఎమోషన్స్‌ని కూడా కంట్రోల్ చేసే స్టేజ్‌కి వెళ్తేనే అసలు ప్రాబ్లెమ్ వస్తుంది. అందుకే కాస్త ప్లానింగ్‌తో, ఆలోచించి షాపింగ్ చేస్తే మనీ సేవ్ అవడంతో పాటు మనశ్శాంతి కూడా మిగులుతుంది.

Tholi Ekadashi : తొలి ఏకాదశి ఉపవాస మహిమ తెలుసా..శయన ఏకాదశి వెనుక ఉన్న కథేంటి?

Related Articles

Back to top button