Phone Calls : పనులు పెండింగ్ పెట్టి మరీ ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారా? కంపల్సివ్ మూడ్ గురించి తెలుసుకోండి..
Phone Calls: ఇకపై ఎక్కువగా ఫోన్ మాట్లాడనని ప్రియమైన వారికి మాట ఇచ్చినా, ఫోన్ పట్టుకుంటే చాలు లోకాన్ని మరిచిపోయి మాట్లాడేస్తుంటారు.
Phone Calls
ఫోన్ రింగ్ అవ్వడమే ఆలస్యం.. గంటల తరబడి అవతలి వారి మాటల ప్రవాహంలో మునిగిపోయే మనస్తత్వాలు మన చుట్టూ చాలానే కనిపిస్తాయి. వద్దు అని వారి మనసు హెచ్చరిస్తున్నా, ఇకపై ఎక్కువగా ఫోన్ మాట్లాడనని ప్రియమైన వారికి మాట ఇచ్చినా, ఫోన్ పట్టుకుంటే చాలు లోకాన్ని మరిచిపోయి మాట్లాడేస్తుంటారు. ఈ తీరు వెనుక కేవలం కాలక్షేపం మాత్రమే లేదు. దీని వెనుక మనిషి మెదడులోని కొన్ని విచిత్రమైన కెమికల్ చేంజెస్, సైకాలజీ దాగి ఉందని నిపుణులు అంటున్నారు.
ఫోన్ కాల్స్(Phone Calls) మాట్లాడటం వల్ల తమ పనులు పెండింగ్ పడుతున్నాయని, సమయం వృధా అవుతుందని తెలిసినా, చివరకు ఆ ఫోన్ కాల్స్ వల్ల తాము మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నామని తెలిసినా కూడా ఆ అలవాటును మానుకోలేకపోతుంటారు.
దీని వెనుక మెదడులో జరిగే ఒక సైకలాజికల్ లాక్ ఉంటుంది. దీనిని సైకాలజీలో బిహేవియరల్ అడిక్షన్ (Behavioral Addiction) లేదా కంపల్సివ్ బిహేవియర్ (Compulsive Behavior) అంటారు.
తమ పనులు ఆగిపోతున్నాయని వారి మెదడుకు తెలుసు, కానీ ఫోన్ మాట్లాడటం(Phone Calls) ఆపలేరు. ఇలా తెలివికి , ప్రవర్తనకు జరిగే యుద్ధాన్ని సైకాలజీలో కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అంటారు. ఈ టైమ్‌లో వారి మైండ్ ఏం చేస్తుందంటే.. పర్లేదు, ఇంకొక్క ఐదు నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత ఆ పని పూర్తి చేద్దాంలే అంటూ తనను తాను సమర్థించుకుంటూ (Self-Justification) తప్పుడు సంకేతాలను ఇస్తుంది. అలా ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంటగా మారిపోతుంది.
చాలామందికి ఏదైనా ఒక ముఖ్యమైన పనిని కానీ కష్టమైన పనిని కానీ మొదలుపెట్టాలంటే లోపల ఒక తెలియని బద్ధకం లేదా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి (Escapism) మెదడు చాలా సులువైన మార్గాన్ని వెతుకుతుంది. అదే.. ఒక ఫోన్ కాల్(Phone Calls) మాట్లాడటం.
ఆ పని ఎలాగూ చేయాలి కదా, ఈలోపు ఒక్కసారి మాట్లాడి వచ్చేస్తానని ఫోన్ ఎత్తుతారు. తీరా మాట్లాడటం మొదలుపెట్టాక, ఆ కబుర్లలో వచ్చే సంతోషం వల్ల అసలైన పనిని మరింత ముందుకు నెట్టేస్తూ (Postpone) ఆ లూప్‌లోనే తెలీకుండానే ఉండిపోతారు. దీనినే ప్రోక్రాస్టినేషన్ లూప్ (Procrastination Loop) అంటారు.
ఒక వ్యక్తికి ఇదే అలవాటుగా మారినప్పుడు, వారి చేతిలో ఫోన్ లేకపోయినా, సైలెంట్లో ఉన్నా కూడా లోపల ఒక రకమైన అశాంతి, ఆందోళన , టెన్షన్ మొదలవుతాయి. అలాగే ఫోన్ కట్ చేస్తే ఫీల్ అవుతారేమో..అవతలి వాళ్లు ఏమనుకుంటున్నారో.. ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారేమోననే అనవసరపు ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటాయి. ఆ మానసిక అశాంతి నుంచి బయటపడటం కోసమే, తమ పనులు పాడవుతున్నా సరే ఆ ఫోన్ కాల్స్‌ను కొనసాగిస్తుంటారు.
ఈ చక్రం నుంచి ఎలా బయటపడాలంటే.. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కేవలం మాట ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు . ఎందుకంటే అలవాటు చాలా బలంగా మారిపోయి ఉంటుంది కాబట్టి దీనిని మార్చడానికి కొన్ని చిన్న ట్రిక్స్ ఉపయోగించాలి.

ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు ఫోన్‌ను వేరే గదిలో పెట్టడం లేదా డీఎన్డీ మోడ్ (DND/Focus Mode) ఆన్ చేయడం ద్వారా ఫోన్ వైపు లాగే అట్రాక్షన్‌ను ఫిజికల్‌గా దూరం చేయొచ్చు.
ముందుగా కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడగలనని మీకు మీరు ఒక బౌండరీ సెట్ చేసుకొని,అవతలి వ్యక్తి.. ఫోన్ ఎత్తగానే వారికి మీరొక ముఖ్యమైన పనిలో ఉన్నానని చెప్పగలగాలి. దీనివల్ల అవతలి వారు కూడా మాటలు పెంచడానికి ఆలోచిస్తారు.
తాము ఎప్పుడు, ఏ పని నుంచి తప్పించుకోవడానికి ఫోన్ వాడుతున్నామో తమను తాము గమనించుకోవడం (Self-Awareness) ద్వారా ఈ లూప్ నుంచి మెల్లగా బయటపడొచ్చు.
Peddi Trailer : ఆట మారుతోంది..ఆటగాడు మారట్లే..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పెద్ది ట్రైలర్





