Just LifestyleLatest News

Potatoes In The Fridge : ఫ్రిడ్జ్‌లో ఆలుగడ్డలు పెడుతున్నారా? అయితే మీరిది తప్పకుండా చదవాల్సిందే..

Potatoes In The Fridge : బంగాళదుంపలను తక్కువ టెంపరేచర్ వద్ద ఉంచినప్పుడు దానిలోని పిండి పదార్థాలు షుగర్స్‌గా మారిపోతాయి.

Potatoes In The Fridge

ఆలుగడ్డలను ఏ కర్రీలో వేసినా, వాటినే కూర చేసినా , ఫ్రై చేసినా ఆ టేస్టే వేరే లెవెల్ అంటారు చాలామంది. అందుకే కూరగాయలు అందుబాటులో లేనప్పుడు, చుట్టాలెవరైనా వచ్చినపుడు ఈజీగా చేయెచ్చని బంగాళాదుంపలను స్టాక్ పెట్టుకుంటారు.

అయితే కొంతమంది కూరగాయలతో పాటు ఆలుగడ్డలను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు(Potatoes In The Fridge). అయితే ఫ్రిడ్జ్ చల్లదనం వల్ల ఆలుగడ్డల్లో కొన్ని ప్రమాదకర రసాయనిక మార్పులు జరిగి పెద్ద వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బంగాళదుంపలను తక్కువ టెంపరేచర్ వద్ద ఉంచినప్పుడు దానిలోని పిండి పదార్థాలు షుగర్స్‌గా మారిపోతాయి. ఇలా మారిన వాటిని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినప్పుడు లేదా ఎక్కువ వేడి వద్ద వండినప్పుడు వాటిలో అక్రిలమైడ్ (Acrylamide)అనే చాలా డేంజరస్ అయిన కెమికల్ తయారవుతుంది.

ఈ అక్రిలమైడ్ బాడీలోకి చేరితే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఎట్టి పరిస్థితులలోనూ ఆలుగడ్డలను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టడం(Potatoes In The Fridge) వల్ల వండినప్పుడు చాలా తీపిగా మారడం, త్వరగా నల్లబడిపోవడం జరుగుతుంది.

Potatoes In The Fridge
Potatoes In The Fridge

మరి బంగాళాదుంపలను ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలంటే.. ఎప్పుడైనా సరే గాలి ధారాళంగా ఆడే చీకటి, పొడి ప్లేసులలో మాత్రమే వీటిని భద్రపరచాలి. ఎండ డైరెక్టుగా పడే చోట, ప్లాస్టిక్ కవర్లలోనూ అస్సలు ఉంచకూడదు. దీని కోసం వెంటిలేషన్ ఉండే బుట్టలు, పేపర్ బ్యాగులు వాడటం మంచిది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బంగాళాదుంపలను ఎప్పుడూ కూడా ఉల్లిపాయలతో కలిపి ఉంచకూడదు. ఉల్లిపాయల నుంచి వచ్చే వాయువుల వల్ల బంగాళాదుంపలు చాలా వేగంగా పాడైపోతాయి.

Khairatabad Bypoll : ఖైరతాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు? విజయారెడ్డి పిటిషన్‌తో యాక్షన్ సీన్ మారిందా?

Related Articles

Back to top button