Shopping Bill : షాపింగ్ బిల్లులు కొన్ని రోజులకే మాయమవుతున్నాయా? మరి గ్యారంటీ, వారంటీ మాటేంటి?
Shopping Bill : థర్మల్ పేపర్ బిల్లుపై చిన్న టెంపరేచర్ తగిలినా కూడా రంగు మారే ఒక రసాయన పొర ఉంటుంది. ఈ కెమికల్ లేయర్ వలన ప్రింటర్ హీట్ అయినప్పుడు అక్షరాలు ప్రింట్ అవుతాయి.
Shopping Bill
సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేసినపుడు, మెడికల్ షాప్‌లో మందులు కొన్నపుడు, లేదంటే చివరకు ఏటీఎం నుంచి క్యాష్ తీసినపుడు కూడా మన చేతికి ఒక చిన్న పేపర్ బిల్లు ఇస్తారు. కానీ దాన్ని కొద్దిరోజులు వాలెట్‌లోనో, కప్‌బోర్డులోనో దాచి తర్వాత చూస్తే దానిలోని అక్షరాలన్నీ మాయమై పేపర్ తెల్లగా మిగిలిపోవడం మనందరికీ అనుభవమే.
అరే, వస్తువు వారంటీ క్లెయిమ్ చేయాలి.. ఇప్పుడేమో బిల్లు పోయిందేంటని చాలామంది తెగ టెన్షన్ పడతారు. అసలు ఈ థర్మల్ బిల్లులలోని అక్షరాలు అలా ఎందుకు మాయం అయిపోతాయి? దీని వెనుక ఉన్న కెమికల్ గేమ్ ఏంటన్న విషయం ఎవరికీ తెలీదు.
నిజానికి థర్మల్ పేపర్ల బిల్లుపై సాధారణ ఇంక్‌తో ప్రింట్ చేయరు. ఈ పేపర్‌పై చిన్న టెంపరేచర్ తగిలినా కూడా రంగు మారే ఒక రసాయన పొర (Chemical Coating) ఉంటుంది. ఈ కెమికల్ లేయర్ వలన ప్రింటర్ హీట్ అయినప్పుడు అక్షరాలు ప్రింట్ అవుతాయి. అయితే ఈ కెమికల్స్ చాలా డెలికేట్ అయినవి.
ఆ బిల్లును సూర్యకాంతిలో ఉంచినా, వేడి ప్రదేశాల్లో పెట్టినా, లేదంటే తేమ తగిలినా కూడా ఆ కెమికల్ లేయర్ దెబ్బతిని లెటర్స్ మెల్లగా లేతగా మారి చివరికి కనిపించకుండానే పోయి తెల్ల పేపర్ మిగులుతుంది. అలాగే శానిటైజర్లు, ఆయిల్స్, లోషన్లు తాకినా లేదంటే చివరకు వాలెట్‌లో ఇతర కార్డులతో రాపిడి జరిగినా కూడా ప్రింట్ ఎగిరిపోతుంది. పైగా వీటిలో వాడే బీపీఏ( BPA), బీపీఎస్(BPS) వంటి రసాయనాలు హెల్త్‌కు కూడా అంత మంచివి కావు.
ల్యాప్‌టాప్, టీవీ, మొబైల్, బంగారం వంటి ఖరీదైన వస్తువుల బిల్లులు లేదంటే మెడికల్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ బిల్లులు పోకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన నిపుణులు కొన్ని సలహాలు చెబుతున్నారు.
బిల్లు తీసుకోగానే ఏమాత్రం లేట్ చేయకుండా మొబైల్‌లో ఉండే ఏదైనా స్కానర్ యాప్‌తో స్కాన్ చేసి పీడీఎఫ్ (PDF) రూపంలో గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్‌లో స్కానర్ కనుక లేకపోతే తేదీ, షాప్ పేరు, బిల్లు మొత్తం, జీఎస్టీ నంబర్ క్లియర్‌గా కనిపించేలా ఫోన్‌తో ఒక మంచి క్వాలిటీ ఫోటో తీసి పెట్టుకోండి.

ఈరోజుల్లో కొన్ని షాపులు ఎస్‌ఎంఎస్, వాట్సాప్ లేదంటే ఈమెయిల్ ద్వారా డిజిటల్ బిల్లులు కూడా సెండ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ పేపర్ బిల్లుతో పాటు డిజిటల్ కాపీని కూడా అడిగి తీసుకోవడం మర్చిపోవద్దు.
ఇక పేపర్ బిల్లులను కారు డాష్‌బోర్డ్, కిచెన్, కిటికీల దగ్గర కాకుండా చల్లగా ఉండే చీకటి ప్రదేశాల్లో దాచండి. ఇంకా చెప్పాలంటే ఈ డిజిటల్ యుగంలో ఎవరూ కూడా పేపర్ బిల్లులపైన నమ్మకం పెట్టుకుని కూర్చోకూడదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. లేదంటే ఆ బిల్లు వారంటీ టైమ్‌కి హ్యాండివ్వడం గ్యారంటీ. అందుకే ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ బిల్స్‌ని డిజిటల్ బ్యాకప్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
YouTuber Nandana : లండన్ జాబ్స్ పేరుతో బిగ్ స్కామ్.. ఫేమస్ యూట్యూబర్ నందన అరెస్ట్..





