Two Faced People : ఎవరి దగ్గర వాళ్ల మాట మాట్లాడే మనస్తత్వం.. ఆ డేంజర్ పీపుల్ వెనుక ఉన్న 3 షాకింగ్ నిజాలు
Two Faced People : ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వారిలో మార్పు రావడమనేది చాలా కష్టమైన విషయమే అయినా, కొన్ని పద్ధతుల ద్వారా మార్పు తీసుకురావచ్చు
Two Faced People
మన సొసైటీలో చాలామంది ఎవరి దగ్గరకు వెళ్తే వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతూ, అందరితోనూ చాలా మంచిగా నటిస్తూనే.. వెనుక నుంచి ఒకరి విషయాలను ఇంకొకరికి చేరవేసే మైండ్‌సెట్‌తో కనిపిస్తుంటారు. ఈ విధమైన ప్రవర్తనను సైకాలజీ భాషలో టాక్సిక్ మెంటాలిటీ లేదా కపట మనస్తత్వం (Hypocrisy) అని పిలుస్తారు.
ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే దీనిని రెండు నాలుకల ధోరణి లేదా అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అని కూడా అంటారు. ఇలాంటి వ్యక్తులకు లోపల ఏ ఒక్కరిపై నిజమైన ప్రేమ , గౌరవం ఉండవు. కేవలం అందరి ముందు తాము చాలా గొప్పవాళ్లమని, అందరికీ కావలసిన వాళ్లమనిపించుకోవాలనే స్వార్థంతో మాత్రమే వీరు ఇలా ప్రవర్తిస్తుంటారు.
ఎదుటివారి బలహీనతలను , వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకుని, వాటిని ఇతరుల దగ్గర చర్చించి ఒక రకమైన వికృతానందాన్ని పొందడం వీరి మానసిక బలహీనత.
ఇలాంటి వ్యక్తుల వల్ల సొసైటీలో , కుటుంబాలు,ఫ్రెండ్స్ మధ్యలో చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. వీరు చేసే పనుల వల్ల ఎంతో కాలంగా మంచిగా ఉండే స్నేహితులు, బంధువుల మధ్య లేనిపోని అపోహలు ముదిరి.. చివరికి గొడవలకు దారితీస్తాయి. నమ్మి పంచుకున్న రహస్యాలను అలా బయటపెట్టడం ద్వారా నమ్మకద్రోహానికి గురయ్యామనే బాధ అవతలివారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది.
ఆఫీసుల్లో , వ్యాపారాల్లో అయితే ఇలాంటి వారి వల్ల టీమ్ వర్క్ మొత్తం దెబ్బతింటుంది, ఎవరికీ ఎవరి మీద నమ్మకం లేని వాతావరణం ఏర్పడుతుంది. అన్నింటికంటే పెద్ద నష్టం ఏంటంటే, వీళ్లు చెప్పే చాడీల వల్ల ఎంతోమంది నిజాయితీ పరులైన వ్యక్తులు సొసైటీలో చెడ్డవాళ్లుగా ముద్ర పడాల్సి వస్తుంది.

ఇలాంటి(Two Faced People) మైండ్ సెట్ ఉన్న వారిలో మార్పు రావడమనేది చాలా కష్టమైన విషయమే అయినా, కొన్ని పద్ధతుల ద్వారా మార్పు తీసుకురావచ్చు. ముందుగా వీరు చెప్పే మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోవద్దు. మెల్లమెల్లగా వారిని దూరం పెట్టడం ప్రారంభించాలి. ఇక్కడి మాటలు అక్కడికి మోస్తున్నప్పుడు ఆ విషయం తెలియగానే వారిని మందలించడం కానీ మొహం మీదే ఆ తప్పును ఎత్తి చూపించడం కానీ చేయాలి.
ఇలా చేయడం వల్ల వారి ఆటలు సాగవనే భయం కలిగి మెల్లగా ఆ అలవాటును మానుకుంటారు. అలాగే వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా, ఇలాంటి పనుల వల్ల ఫ్యూచర్లో సొసైటీలో ఎలాంటి గౌరవం ఉండదనే విషయాన్ని మెల్లగా అర్థమయ్యేలా చెప్పాలి. నిజాయితీగా బతకడంలోనే అసలైన సంతోషం ఉందనే విషయాన్ని వాళ్లు గ్రహించినప్పుడే ఈ మెంటాలిటీ నుంచి బయటపడగలుగుతారు.
Rishabh Pant : లక్నో కెప్టెన్సీకి పంత్ గుడ్ బై..ఎక్స్ వేదికగా ఫ్రాంచైజీ వెల్లడి





