Just LifestyleLatest News

Two Options In A Relationship : ప్రయారిటీ తేల్చుకోలేని మనుషులు..రిలేషన్‌షిప్‌లో రెండు ఆప్షన్స్‌పై సైకాలజీ ఏం చెబుతోంది?

Two Options In A Relationship : కొంతమందికి సొసైటీలో లేదా బంధాలలో అందరి దృష్టిలో మంచివారు అనే ఇమేజ్ కాపాడుకోవడం చాలా ముఖ్యం అని భావిస్తారు.

Two Options In A Relationship

నాకు నువ్వు ముఖ్యమే..వాళ్లు కూడా ముఖ్యమే, నేను ఎవరినీ వదులుకోలేనని చెప్పే ఈ ఒక్క మాట.. లైఫ్‌లో ఎన్నో సంబంధాలను, బంధాలను నిశ్శబ్దంగా నలిపేస్తుంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. చివరకు ఒక సందర్భంలో సమస్య తెగేదాకా లాగకుండా ఉండటానికి.. సరే, ఇకపై ఎలాంటి ఇబ్బంది రాదు.. నేను అడ్జస్ట్ అవుతానని ఒప్పుకుంటారు.

కానీ మళ్లీ కొన్ని రోజుల తర్వాత మాట మార్చి నా పరిస్థితిని అర్ధం చేసుకోమని చెబుతూ ఎదుటివారిని అడ్జస్ట్ అవ్వమని ప్రెజర్ తెస్తుంటారు. అయితే తన లైఫ్‌లో ఒక ప్రయారిటీ తేల్చుకోవడానికి వీళ్లకు ఎందుకంత భయం.. అసలు ఈ మనస్తత్వం వెనుక ఉన్నది నిజంగా మంచితనమా లేక స్వార్థమా అనే విషయాన్ని సైకాలజిస్టులు వివరిస్తున్నారు.

ఈ రకమైన ప్రవర్తన వెనుక ఫియర్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ అంటే గొడవలకు భయపడటమే మెయిన్ రీజన్. కొంతమందికి సొసైటీలో లేదా బంధాలలో అందరి దృష్టిలో మంచివారు అనే ఇమేజ్ కాపాడుకోవడం చాలా ముఖ్యం అని భావిస్తారు.

ఒకరినే కావాలని అనుకుంటే, ఇంకొకరి దృష్టిలో తాము చెడ్డవాళ్లమయిపోతామేమోననే భయం వీరిని వెంటాడుతుంది. దీనివల్ల సమస్యను పరిష్కరించకుండా వాయిదా వేస్తూ వస్తుంటారు. సైకాలజీలో దీనిని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (FOMO) లేదా ఆప్షన్స్ ఓపెన్‌గా ఉంచుకోవడం అని కూడా అంటారు.

అంటే ఏ ఒక్కరినీ కోల్పోకూడదనే తాపత్రయం నిజానికి ఒక రకమైన భావోద్వేగ స్వార్థమే (Emotional Selfishness) అవుతుంది. ఎందుకంటే, నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రెండు వైపులా ఉన్నవారు మానసిక వేదన అనుభవిస్తున్నారని తెలిసినా కూడా, వీరు తమ కంఫర్ట్ జోన్‌ను దాటి బయటకు రారు.

అంతేకాదు ఈ ప్రాసెస్‌లో కన్వీనియంట్ అడ్జస్ట్‌మెంట్ అనే ఇంకో పెద్ద సైకలాజికల్ గేమ్ జరుగుతూ ఉంటుంది. మొదట సర్దుకుపోతామని ఒప్పుకున్న వ్యక్తులే, మెల్లగా తాము చేస్తున్న త్యాగాన్ని, తమ పరిస్థితిని పెద్దదిగా చేసి చూపిస్తూ.. చివరికి ఎదుటి వ్యక్తిని గిల్ట్‌లోకి నెట్టేస్తారు.

Two Options In A Relationship
Two Options In A Relationship

అయితే ఒకరి స్థానాన్ని ఇంకొకరితో భర్తీ చేయలేం కాబట్టే ..ఒకరికోసం ఇంకొకరిని వదిలేయడం సరికాదు. అలా అని ఒకరి కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. రెండు వైపులా కచ్చితమైన బౌండరీస్ పెట్టడం రావాలి.

ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏంటి అనేది ముందు ఆ వ్యక్తి క్లారిటీ తెచ్చుకోవాలి. పరిస్థితులను బ్యాలెన్స్ చేయడం రావాలి. నా జీవితంలో మీ పరిధి ఇది(Two Options In A Relationship), వారి పరిధి ఇది.. ఒకరి విషయంలో ఇంకొకరు జోక్యం చేసుకోవద్దని ధైర్యంగా చెప్పగలగాలి.దాని ప్రకారం నడుచుకునేలా చూడాలి.

Cellulitis : కాళ్లపై ఎర్రటి వాపు, నెప్పి వేధిస్తోందా? సెల్యులైటిస్ ఏమో చెక్ చేసుకోండి..

Related Articles

Back to top button