Advice : మీరూ అడగకపోయినా అడ్వైజ్‌లు ఇస్తున్నారా? అసలు ఉచిత సలహాలు ఇవ్వడం మంచిదేనా?
Advice : సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం.. అడగకుండా సలహాలు ఇవ్వడమనేది అవతలి వ్యక్తితో ఉన్న సంబంధాన్ని బట్టి, వారు చెప్పే విధానాన్ని బట్టి మంచిదా కాదా అనేది ఆధారపడి ఉంటుంది.
Advice
సొసైటీలో మనకు తరచూ ఉచిత సలహా ఇచ్చేవాళ్లు కనిపిస్తూనే ఉంటారు. మనం ఒక సమస్యలో ఉండి సలహా అడిగితే అవతలి వాళ్లు చెప్పడం కామన్. కానీ, కొందరు మనం అడగకపోయినా, అసలు ఆ విషయంతో వాళ్లకు సంబంధమే లేకపోయినా సలహాలు ఇచ్చేస్తుంటారు. కెరీర్, పెళ్లి, పిల్లల పెంపకం, హెల్త్, చివరికి మనం కొనే డ్రెస్‌ల వరకు ప్రతి దాంట్లోనూ ఉచిత సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు.
సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం.. అడగకుండా సలహాలు(Advice) ఇవ్వడమనేది అవతలి వ్యక్తితో ఉన్న సంబంధాన్ని బట్టి, వారు చెప్పే విధానాన్ని బట్టి మంచిదా కాదా అనేది ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాలలో ఇలా అడగకపోయినా అడ్వైజ్‌లు ఇవ్వడాన్ని నెగిటివ్‌గానే చెబుతారు.
ఎందుకంటే, ఒక వ్యక్తి అడగకుండా అడ్వైజ్(Advice) ఇచ్చినప్పుడు, అవతలి వ్యక్తికి తాను తక్కువ అనే భావన లేదా తన సామర్థ్యాన్ని అవతలి వారు అనుమానిస్తున్నారన్న ఫీలింగే ఎక్కువ కలుగుతుంది. ఇది వారి పర్సనల్ ఫ్రీడమ్‌కు , సెల్ఫ్ రెస్పెక్ట్‌కు భంగం కలిగించినట్లు అవుతుంది. అందుకే సైకాలజీలో దీనిని ఇంట్రూసివ్ బిహేవియర్ అని పిలుస్తారు.
అయితే, తల్లిదండ్రులు , మన శ్రేయోభిలాషులు, మన మేలు కోరి కొన్నిసార్లు అడగకపోయినా హెచ్చరించడం లేదా సలహా ఇవ్వడం మంచిదే. అయితే అది కూడా ఒక పరిధి దాటితే..అంటే పదేపదే ఇలా సలహాలు ఇస్తుంటే అవతలి వారికి విసుగు తెప్పిస్తుంది.
అసలు మనుషులు అడగకపోయినా అడ్వైజ్‌లు ఎందుకిస్తారనే దానికి సైకాలజీ కొన్ని ఆసక్తికరమైన కారణాలను చెబుతోంది. అందులో మొదటి వారిలో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. అంటే తమకు అవతలి వారి కంటే ఎక్కువ తెలుసని, తాము చాలా తెలివైన వాళ్లమని నిరూపించుకోవాలనే తాపత్రయం వీరిలో ఎక్కువ.
ఇక రెండోవారిలో కంట్రోల్ చేయాలనే కోరిక వీరికి ఎక్కువ ఉంటుంది. అవతలి వ్యక్తి జీవితాన్ని లేదా వారి నిర్ణయాలను తమకు నచ్చినట్లు మార్చాలనే ఒక తెలియని కోరిక వారిలో ఉంటుంది.
అలాగే మరికొందరిలో రెస్క్యూయర్ ఇన్స్టింక్ట్ అంటే రక్షించే నైజం ఉంటుంది. అంటే లోకంలో అందరి సమస్యలను తామే పరిష్కరించాలనే ఒక భ్రమలో బతుకుతుంటారు.
ఇంకొందరు కేవలం అవతలి వారిపై తమకున్న మితిమీరిన ఆందోళన వల్ల కానీ ప్రేమ వల్ల కానీ ఇలా చేస్తుంటారు. కానీ కారణం ఏదైనా, అడగని సలహా అనేది అవతలి వ్యక్తికి సహాయపడటానికి బదులు వారిని మానసిక ఒత్తిడికి గురి చేస్తుందన్న విషయాన్ని అడ్వైజ్‌లు ఇచ్చేవారు తెలుసుకోవాలి.

ఇలాంటి ఉచిత సలహాదారుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే మన మెంటల్ పీస్‌ను కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. ఎవరైనా అడగకుండానే సలహా ఇస్తున్నప్పుడు వారితో ఏమాత్రం వాదించకుండా, కేవలం సరే మీ అభిప్రాయం చెప్పారు, ధన్యవాదాలు అని చెప్పి చివరకు మీకు నచ్చింది చేయడాన్ని నేర్చుకోవాలి.
కొన్ని సార్లు ఓకే.. మీరు చెప్పింది కూడా బాగుంది ఫైనల్‌గా ఏదొక నిర్ణయం నేను తీసుకుంటాను అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఎదుటివారికి మనం లొంగడం లేదని అర్థమవుతుంది. జీవితంలో ఎవరి సలహాలు స్వీకరించాలి, ఎవరివి పక్కన పెట్టాలి అనే క్లారిటీ మనకు ఉన్నప్పుడే మనం మానసికంగా బలంగా ఉంటాం. మనకు నచ్చినట్లుగా బతకగలం.
Puducherry : పుదుచ్చేరి ఎన్డీఏ కూటమిలో విభేదాలు..విజయ్ పార్టీతో రంగస్వామి పొత్తు ?





