Just LifestyleLatest News

Psychology :ఇతరులకు సలహాలు.. వారి జీవితం మాత్రం అస్తవ్యస్తం.. సైకాలజీ ఏం చెబుతుంది?

Psychology : జేబులో రూపాయి లేకపోయినా కోట్లు సంపాదించడం ఎలాగో చెప్తారు, తమ ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నా కూడా పక్కనోళ్లకు సంసారంలో ప్రశాంతత గురించి క్లాసులు పీకుతుంటారు.

Psychology

ఇతరులకున్న సమస్యలకు క్షణాల్లోనే పరిష్కారాలు చెప్తూ, అందరికీ లైఫ్ లెసన్స్ నేర్పించే వ్యక్తులు మన చుట్టూ చాలామందే కనిపిస్తూ ఉంటారు. వారి మాటలు విన్నప్పుడు అబ్బా వీళ్లెంత గొప్పగా బతుకుతున్నారో కదా అనిపిస్తుంది.

అయితే ఒకవేళ వారి వ్యక్తిగత జీవితం లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అంతా గందరగోళంగా, సమస్యల వలయంగా ఉండటం చూసి ఆశ్చర్యం వేస్తుంది. వీరి జేబులో రూపాయి లేకపోయినా కోట్లు సంపాదించడం ఎలాగో చెప్తారు, తమ ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నా కూడా పక్కనోళ్లకు సంసారంలో ప్రశాంతత గురించి క్లాసులు పీకుతుంటారు.

సింపుల్‌గా చెప్పాలంటే ఇతరులు అడక్కుండానే వారికి అద్భుతమైన సలహాలు ఇస్తూ, తమ సొంత జీవితాన్ని మాత్రం హ్యాండిల్ చేయలేక సతమతమవుతూ ఉంటారు. సైకాలజీ( Psychology )లో చెప్పుకుంటే..దీనిని ప్రొజెక్షన్ సైకాలజీ (Projection Psychology) అని పిలుస్తారు. ఇది ఒక విచిత్రమైన మానసిక పరిస్థితిగా నిపుణులు చెబుతున్నారు.

అసలు ఈ మనస్తత్వం వెనుక ఉన్న సైకాలజీ( Psychology ) ఏంటంటే, చాలామందికి తమ జీవితంలోని లోపాలను, వైఫల్యాలను ఒప్పుకోవడం కష్టంగా ఉంటుంది. తమ జీవితం చేజారిపోతోందనే నిజాన్ని వాళ్లు డైరెక్టుగా ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు, వారి మెదడు ఒక రక్షణ కవచాన్ని (Defense Mechanism) ఏర్పాటు చేసుకుంటుంది. అదే ప్రొజెక్షన్.

అంటే, తమ మనసులో ఉన్న అసంతృప్తిని, గందరగోళాన్ని అన్నిటిని కూడా పక్కన పెట్టి, ఇతరుల జీవితాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వారికి సలహాలు ఇవ్వడం ద్వారా తాము చాలా పర్‌ఫెక్ట్‌గా ఉన్నామనే భ్రమను క్రియేట్ చేసుకుంటారు.

పక్కవారికి సలహాలు ఇస్తున్నంత సేపూ వారు తమ సొంత సమస్యలను టెంపరరీగా మర్చిపోతారు. ఇతరులను గైడ్ చేయడం వల్ల ఒక రకమైన మానసిక తృప్తి వస్తుంది. అంతేకాకుండా వారికంటే కూడా తాము గొప్ప స్థాయిలో ఉన్నామనే అహం (Ego Boost) సాటిస్ఫై అవుతుంది. కానీ, ఆ సలహా ఇచ్చే సమయం దాటిపోయిన తర్వాత .. మళ్లీ తమ పాత జీవితంలోకి రాగానే వారిని ఒంటరితనం, అసహాయత వెంటాడుతాయి.

Psychology
Psychology

ఈ మానసిక స్థితి నుంచి బయటపడాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనికోసం మొదటగా ఇతరుల జీవితాల్లోకి తొంగిచూడటం ఆపేసి, వారి జీవితంలో ఉన్న గందరగోళాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఎదుటివారికి ఏదైనా సలహా ఇచ్చే ముందు ఈ రూల్ వారి జీవితానికి అప్లై అవుతుందా? దీన్ని వారు పాటిస్తున్నారా అన్న ప్రశ్న వారికి వారే వేసుకోవాలి.

ఇతరులను మార్చడానికి పెట్టే శ్రద్ధలో.. హాఫ్ వారిని వారు సరిదిద్దుకోవడానికి పెడితే, జీవితం ట్రాక్‌లోకి వస్తుంది. పక్కనున్నవారిని మార్చడం కంటే ముందు మన ప్రపంచాన్ని మనం చక్కదిద్దుకున్నప్పుడే మన మాటకు విలువ, మనసుకు ప్రశాంతత దొరుకుతాయన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

Rupee:డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. చరిత్రలో తొలిసారిగా 96 మార్కును దాటిన మారకపు విలువ

Related Articles

Back to top button