Just LifestyleLatest News

Digital Addiction : ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌తో హెల్త్ రిస్క్.. ఈ అడిక్షన్ వెనుక ఉన్న సైకలాజికల్ ఫ్యాక్ట్స్

Digital Addiction : బాడీలో స్ట్రెస్ హార్మోన్లు కంటిన్యూగా హెచ్చుతగ్గులకు లోనవడం వల్ల హార్మోనల్ సిస్టమ్ దెబ్బతిని థైరాయిడ్, రాత్రిపూట నిద్రలేమి, ఒబెసిటీ వంటి సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్స్ సైలెంట్‌గా చుట్టుముడతాయి.

Digital Addiction

నైట్ పడుకునే ముందు ఒక్క 5 నిమిషాలు షార్ట్స్ చూసి పడుకుందామని ఫోన్ పట్టుకుని అరగంట, గంట కూడా దానిలోనే గడిపేయడం చాలామందికి అలవాటే. మొదటి రీల్‌లో ఒక క్రేజీ కామెడీ సీన్ వస్తే గట్టిగా నవ్వుతాం.. ఆ నెక్స్ట్ సెకనుకు ఒక ఎమోషనల్ వీడియో వచ్చి మనసంతా బాధగా మారిపోతుంది.

ఆ తర్వాత మరో స్క్రోల్ చేస్తే.. అక్కడ ఒక లగ్జరీ కార్ ఆర్ బ్యూటీఫుల్ ప్లేస్ చూసి కళ్లల్లో అద్భుతమైన థ్రిల్ కనిపిస్తుంది. ఆ వెంటనే ఒక హారర్ క్లిప్ రాగానే గుండె స్పీడు ఠక్కున పెరుగుతుంది. కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే నవ్వు, విచారం, భయం, థ్రిల్ ఇలా రకరకాల ఎమోషన్లు మెదడును షేక్ చేసేస్తుంటాయి. అవన్నీ చూసాక టైమ్ చూస్తే పడుకునే సమయం దాటిపోతుంది. బాడీ బాగా అలసిపోయినా కూడా మెదడు మాత్రం రెస్ట్ తీసుకోవడానికి ఒప్పుకోదు.

సైకాలజీ అండ్ న్యూరోసైన్స్ చెబుతున్నదాని ప్రకారం.. మనిషి బ్రెయిన్ ఒకేసారి ఇన్ని డిఫరెంట్ అనుభూతులను తట్టుకునేలా రూపుదిద్దుకోలేదు. మనం ఒక కామెడీ సీన్ చూడగానే మెదడు డోపమైన్ అనే సంతోషాన్ని ఇచ్చే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది.

ఆ తర్వాత సెకనులోనే బాధాకరమైన సీన్ రాగానే కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే ఒక సడన్ థ్రిల్ రాగానే అడ్రినలిన్ అనే అత్యవసర స్పందన కలిగించే హార్మోన్ రిలీజ్ అయి బ్లడ్ ప్రెషర్‌ను పెంచేస్తుంది. ఇలా ప్రతి 10 నుంచి 20 సెకన్లకు ఒక కొత్త ఎమోషన్‌కు లోనవడం వల్ల, బాడీలో హార్మోనల్ సర్క్యూట్ ఒక భారీ ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లాగా మారిపోతుందన్న మాట.

దీనివల్ల లాంగ్ రన్‌లో బ్రెయిన్‌తో పాటు శరీరంపైనా కూడా ఊహించని హెల్త్ ఇష్యూస్ పడతాయని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. కంటిన్యూగా డోపమైన్ స్పైక్స్ రావడం వల్ల మైండ్‌లోని ఫోకస్ చేసే సామర్థ్యం దారుణంగా తగ్గిపోతుందట అంటే అటెన్షన్ స్పాన్ క్రష్ అవుతుంది.

దీంతో దేనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం, చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన విసుగు, డిప్రెషన్ , యాంగ్జైటీ రావడానికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్ రీజన్ అని సైకాలజిస్టులు అంటున్నారు. అంతేకాకుండా, బాడీలో స్ట్రెస్ హార్మోన్లు కంటిన్యూగా హెచ్చుతగ్గులకు లోనవడం వల్ల హార్మోనల్ సిస్టమ్ దెబ్బతిని థైరాయిడ్, రాత్రిపూట నిద్రలేమి, ఒబెసిటీ వంటి సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్స్ సైలెంట్‌గా చుట్టుముడతాయి.

Digital Addiction
Digital Addiction

ఇంకా చెప్పాలంటే, అల్గోరిథమ్ డిజైన్ చేసిన ఈ డిజిటల్ ట్రాప్‌లో ప్రతిరోజూ హార్మోన్లతో డేంజరస్‌ జూదం నడుస్తోందన్న మాట. ఒక్క క్షణం నవ్విస్తూ, మరుక్షణంలో భయపెట్టే ఈ 60 సెకన్ల ఎంటర్‌టైన్‌మెంట్ టెంపరరీగా బాగానే అనిపించినా.. లాంగ్ రన్‌లో మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్‌ను దారుణంగా దెబ్బతీస్తోంది.

ఈ డిజిటల్ అడిక్షన్ నుంచి బయటపడటానికి స్క్రీన్ టైమ్‌కి బ్రేకులు వేసి.. రీల్స్ స్క్రోలింగ్‌ను కంట్రోల్ చేసుకోవడమే ఏకైక సొల్యూషన్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు. మీకు అంతగా కామెడీ కావాలి అంటే కామెడీ క్లిప్స్ ఒక అరగంట పాటు చూడండి. సీరియస్ కావాలి అంటే మంచి సస్పెన్స్ సినిమా చూడండి.. అంటే ఏ జోన్‌ ఇష్టపడతామో ఆ జోన్‌ను కాసేపు చూస్తే.. ఒకే నిమిషంలో వంద ఎమోషన్లు బయటపడకుండా ఉంటాయి. దీని వల్ల మైండ్‌లో ఒకేసారి రకరకాల హార్మోనులు రిలీజ్ అవకుండా ఉంటాయి.

Two Options In A Relationship : ప్రయారిటీ తేల్చుకోలేని మనుషులు..రిలేషన్‌షిప్‌లో రెండు ఆప్షన్స్‌పై సైకాలజీ ఏం చెబుతోంది?

Related Articles

Back to top button