Dopamine Trap : పొద్దున్నే ఫోన్ చూసి డే స్టార్ట్ చేస్తున్నారా? డోపమైన్ ట్రాప్ నుంచి ఇలా బయటపడండి..
Dopamine Trap : స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వల్ల కలిగే ప్రెజర్, అలసట తగ్గించుకుని నేచురల్‌గా ఉత్సాహంగా ఉండటానికి పాటించాల్సిన డైలీ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకోండి.
Dopamine Trap
తెల్లవారుతుండగానే సూర్యుడి కిరణాల కంటే ముందే ఫోన్ స్క్రీన్ లైటింగ్స్ మన కళ్లపై పడుతున్నాయి. నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకూ వచ్చిన నోటిఫికేషన్లు, సోషల్ మీడియా లైకుల వెంట పరుగులు తీస్తూ చాలామంది అలసిపోతున్నారు.
ఈ డిజిటల్ హడావుడి మన బ్రెయిన్లో డోపమైన్(Dopamine Trap) అనే కెమికల్‌ను టెంపరరీగా ఊరించి, ఆ తర్వాత వీక్నెస్లోకి నెట్టేస్తోంది. స్క్రీన్ల ముందు గడిపే సమయం వల్ల టెన్షన్, ఫెటీగ్ పెరుగుతున్నాయి. దీనికి సొల్యూషన్ మన డైలీ లైఫ్‌లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు.
మొదటగా మార్నింగ్ లేవగానే బెడ్ నీట్‌గా సద్దుకోవడం వల్ల ఆ రోజు తొలి పని పూర్తయిందనే తృప్తి కలుగుతుంది. అలాగే ఇది ఆ డే అంతా మంచి ఫ్లో ఇస్తుంది. ఆ తర్వాత చన్నీటి స్నానం చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి అలసట పోతుంది, బ్రెయిన్ యాక్టివ్ అయి నేచురల్‌గా డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయి. శబ్దాల గందరగోళం మధ్య డే లో కనీసం 10 నిమిషాలు కళ్లు మూసుకుని సైలెంట్‌గా కూర్చుని మనసు మాట వింటే మనసుకు ఉల్లాసం, కాన్ఫిడెన్స్ వస్తాయి.
ఆ రోజు చేయాల్సిన పనులను పేపర్‌పై రాసుకుని, ఒక్కో పని అయ్యాక రైట్ మార్క్ పెడుతుంటే బ్రెయిన్‌కు మంచి సంతృప్తి దొరుకుతుంది. ఇక భోజనం చేసేటప్పుడు ఫోన్, టీవీ పక్కన పెట్టి, తింటున్న ఫుడ్ రుచిని, స్మెల్‌ను ఫీల్ అవుతూ నెమ్మదిగా తింటే మనసుకు, బాడీకి హాయిగా ఉంటుంది. స్క్రీన్లపై చదివే దానికంటే కూడా పుస్తకంలోని పేజీలు తిప్పుతూ చదివితే ఆలోచనలు విస్తరిస్తాయి, ఇమాజినేషన్ పెరుగుతుంది. అలాగే సంతోషం, రిలాక్సేషన్ ఇచ్చే పనులు చేస్తే డోపమైన్(Dopamine Trap) లెవెల్స్ బాగుంటాయి.
ఇంటి పనులను కష్టంగా కాకుండా ఒక మెడిటేషన్లా చేస్తే, గిన్నెలు సద్దడం, ఇల్లు క్లీన్ చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. మన గోల్స్, ఇష్టమైన మాటలతో విజన్ బోర్డు తయారు చేసుకుని రూమ్‌లో కనిపించేలా పెట్టుకుంటే మోటివేషన్ దొరుకుతుంది.
అలాగే మొబైల్ ఫోన్, ఇతర డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి కనీసం పావుగంట ఒకే పనిపై పూర్తిగా ఫోకస్ పెడితే పని క్వాలిటీ పెరగడంతో పాటు మనసుకు హాయిగా ఉంటుంది. ఈ ఆరోగ్య సూచనలు కేవలం అవేర్నెస్ కోసమే అయినా, ఏవైనా హెల్త్ సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
After Retirement : 60 ఏళ్లు దాటినా ఆగని జోష్.. ఉద్యోగానికే రిటైర్మెంట్, అనుభవానికేం కాదు..





