Just LifestyleLatest News

Soya Beans : బరువు తగ్గాలనుకుంటున్నారా? ..అయితే మీ డైట్‌లో సోయాబీన్స్ యాడ్ చేసుకోండి..

Soya Beans : అలెర్జీ ఉన్నవారు సోయాకు దూరంగా ఉండాలి. ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే కొందరిలో గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు రావొచ్చు.

Soya Beans

శాకాహారులకు అత్యుత్తమ ప్రోటీన్ మూలాల్లో ఒకటిగా సోయాబీన్స్(Soya Beans) ది బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలో అధిక నాణ్యత కలిగిన ప్లాంట్ ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, బి-విటమిన్లు , ఐసోఫ్లేవోన్‌లు పుష్కలంగా ఉంటాయి. వరల్డ్ వైడ్‌గా లభించే అత్యంత న్యూట్రిషనల్ వ్యాల్యూస్ కలిగిన ధాన్యాలలో ఇది ప్రత్యేకమైనదిగా చెబుతోంది.

సోయాబీన్స్‌(Soya Beans)లోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ , ఐసోఫ్లేవోన్లు బోన్స్ బలానికి దోహదపడతాయి. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన మహిళల్లో బోన్స్ డెన్సిటీ తగ్గకుండా కాపాడటంలో ఇవి తోడ్పడతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి.

జంతు ఉత్పత్తుల నుంచి వచ్చే ఫ్యాట్‌కు ఆల్టర్‌నేటివ్‌గా సోయా ప్రోటీన్‌ను తీసుకుంటే బాడీలో ఎల్‌డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది. దీనిలో సాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

సోయాలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తిన్న తర్వాత ఎక్కువ సమయం కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల పదే పదే ఫుడ్ తీసుకోవాలనే కోరిక తగ్గి వెయిట్ కంట్రోల్‌లో ఉంటుంది.

బాడీకి కావలసిన అన్ని రకాల ఇంపార్టెంట్ అయిన అమినో ఆమ్లాలు సోయా ప్రోటీన్‌లో ఉంటాయి. కాబట్టి ఎక్సర్‌సైజ్‌లు చేసేవారు, మజిల్ స్ట్రెంత్‌ని కోరుకునే శాకాహారులు తమ ప్రోటీన్ అవసరాల కోసం దీనిపై ఆధారపడొచ్చు.

దీనిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను హెల్దీగా ఉంచి మలబద్ధకం రాకుండా చూస్తుంది. అంతేకాకుండా, గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా హై అవకుండా అడ్డుకోవడం ద్వారా బ్లడ్‌లో చక్కెర స్థాయిల బ్యాలెన్స్‌ చేయడానికి ఇది మద్దతు ఇస్తుంది.

సోయాను మన ఫుడ్‌లో రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు. ఉడికించిన సోయా గింజలను సలాడ్లలో వేసుకోవచ్చు. సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ రూపంలో కర్రీలోనూ, బిర్యానీ చేసుకోవచ్చు. టోఫు అంటే సోయా పనీర్, సోయా పాలు ఉపయోగించొచ్చు. పచ్చి సోయా గింజలు , సూప్‌ల రూపంలోనూ తీసుకోవచ్చు.

Soya Beans
Soya Beans

అయితే సోయాను తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలెర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే కొందరిలో గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు రావొచ్చు. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు తగినంత అయోడిన్ కలిగిన ఆహారంతో పాటు దీనిని తీసుకోవడం లేదా డాక్టర్ల సలహా పాటించడం మంచిది.

మొత్తానికి సోయాబీన్స్ ఒక అద్భుతమైన పోషకాహారమనే చెప్పాలి.అందుకే మంచి లైఫ్ స్టైల్‌తో పాటు సోయాను తక్కువగా తీసుకుంటే వల్ల ఎముకలు, గుండె , కండరాల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ మిమ్మల్ని అడిక్ట్ చేస్తోందా? చిన్ని ట్రిక్స్ ఫాలో అవ్వండి చాలు..

Related Articles

Back to top button