Just LifestyleLatest News

Situations : సీరియస్ పరిస్థితుల్లో నవ్వు ఎందుకు వస్తుంది? దీని వెనుక దాగుంది ఏంటి?

Situations : కొన్నిసార్లు మన వాళ్లు అనుకునే ముందు వారికి మన బాధను చెబుతూ ఓపెన్ అవుతాం. అయితే వారి నుంచి ఓదార్పు దక్కకపోగా సరైన రెస్పాన్స్ రానప్పుడు మన బాధ ఇంకా రెట్టింపు అవుతుంది.

Situations

మనం ఒక్కోసారి పరిష్కరించలేని సమస్యతోనో, లేదా పంచుకుంటే తగ్గే బాధతోనో సతమతమవుతుంటాం. అటువంటప్పుడు మన మనసులోని బాధను విని ఓదార్చేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుణ్ణు అనుకుంటాం. అందుకే కొన్నిసార్లు మన వాళ్లు అనుకునే ముందు వారికి మన బాధను చెబుతూ ఓపెన్ అవుతాం. అయితే వారి నుంచి ఓదార్పు దక్కకపోగా సరైన రెస్పాన్స్ రానప్పుడు మన బాధ ఇంకా రెట్టింపు అవుతుంది.

పైగా దానిలోని సీరియస్‌నెస్‌ను అర్ధం చేసుకోకుండా తేలిగ్గా నవ్వుతూ చెబుతుంటే ఆ బాధ కాస్త కోపంగా మారిపోతుంది. అయ్యో అనవసరంగా చెప్పి చులకన అవుతున్నానా అన్న ఫీలింగ్ వెంటాడుతుంది. అయితే అందరికీ అన్ని విషయాలలో జరగకపోయినా కొంతమంది మాత్రం ఈ పరిస్థితిని(Situations) తప్పకుండా ఫేస్ చేసే ఉంటారు.

ఇలాంటి సమయంలో అసలు ఆ పరిస్థితికున్న(Situations) సీరియస్‌నెస్ ఎందుకు పట్టించుకోవడం లేదు? నిజంగానే వారికి పట్టనట్లు ఎందుకు ఉంటున్నారన్న సందేహం కలుగుతుంది. అయితే ఇలా ఒక్కోసారి బయటకు కనిపించే నవ్వు లేదా ఆ ప్రశాంతత వెనుక..వారి లోపల కరిగిపోతున్న ఒక మనసు దాగి ఉండవచ్చంటున్నారు సైకాలజిస్టులు.

సీరియస్ పరిస్థితుల్లో(Situations) , బాధ కలిగించే విషయాలలో మనుషులు ఇలా సాధారణంగా ప్రవర్తించడానికి మెయిన్ రీజన్.. వారి మనసును వారు రక్షించుకోవడానికి చేసే ప్రయత్నమేనట. ఒక గాయం అయినప్పుడు మన శరీరం ఎలాగైతే స్పందిస్తుందో, మనసు కూడా ఏదైనా షాక్, భయం, బాధ వంటివి తట్టుకోలేనప్పుడు, దాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తుంది. దీనినే రక్షణ కవచం అంటారని సైకాలజీ వివరిస్తోంది.

ఎందుకంటే గతంలో తగిలిన బాధ వల్ల ఆ మనిషి తనను తాను కాపాడుకోవడానికి వారి మనసును సిద్ధం చేసుకుంటారు. అంటే ఒక రకమైన భావోద్వేగ స్థంభన వల్ల, ఆ బాధను అనుభూతి చెందకుండా ఉండటానికి ..అప్పటికే వారి మనసు ఒక ఆర్టిఫిషియల్ నవ్వును కానీ నిర్లిప్తతను కానీ ముసుగుగా వేసేసుకుంటుంది.

Situations
Situations

అలా అని ఇది ఎలాంటి మానసిక జబ్బు కాదు, కానీ మనసు తనను తాను బాధ నుంచి కాపాడుకోవడానికి అలవాటు చేసుకున్న ఒక మార్గం అంటారు సైకాలజిస్టులు. కొన్నిసార్లు ఏడవలేని బాధ.. నవ్వుగా మారి బయటకు వస్తుంది. దీన్నే ‘నెర్వస్ లాఫ్’ అని కూడా అంటారు.

అయితే, ఇలాంటి అలవాటు వారికి ఉండటం వల్ల కొన్నిసార్లు ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఏంటంటే అవతలివారు.. వారిని అపార్థం చేసుకుంటారు. వారు బాధ్యత లేని వారిగానో లేదా కఠిన హృదయులుగానో భావిస్తారు. దీనిని కంట్రోల్ చేసుకోవడం వారి చేతిలోనే ఉంటుందని వాళ్లే తెలుసుకోవాలి.

ఎందుకంటే ఆ వ్యక్తికి ముందుగా తన మనసులో ఏముందో తనకు అర్థం అయితేనే పరిష్కారం కూడా ఉంటుంది . వారిలో కలిగే భయం, ఆందోళన లేదా బాధను బయటకు చెప్పడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మెల్లమెల్లగా అవతలి వారి బాధను కూడా అనుభవించడం మొదలుపెడతారు. అలా అర్ధం చేసుకున్నప్పుడు వారిలో కనిపించే నవ్వులు లేదా నిర్లక్ష్యం వాటంతటే అవే తగ్గిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button