With AI Chatting : ఏఐ చాటింగ్‌తో మైండ్ రిలాక్స్ అవుతుందా?..మీ మెంటల్ హెల్త్ రిస్క్‌లో పడినట్లే..
With AI Chatting : ఏఐ ఇచ్చే సలహాలు, చెప్పే తీపి మాటలు చూడడానికి పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అది ఆ పర్సన్‌కి క్లినికల్‌గా కరెక్ట్ కాకపోవచ్చు.
With AI Chatting
మొన్నటి వరకూ గూగుల్ సెర్చ్, కంటెంట్ కోసమే వాడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్బాట్లు(With AI Chatting).. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాలలోకి సైలెంట్‌గా ఎంటర్ అయిపోయాయి. మనసు బాగోకపోయినా, లోన్లీ ఫీలింగ్ వచ్చినా, గొడవలు జరిగి మైండ్ బ్లాక్ అయినా.. చాలామంది ఈ చాట్బాట్ల ముందే తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
అయితే పైకి ఈ డిజిటల్ సీన్ అంతా భలే ప్రశాంతంగా, మనసు తేలిక పడినట్లుగా అనిపించినా.. లాంగ్ రన్లో ఇది మనుషుల ఎమోషనల్ లైఫ్‌ను, మెంటల్ హెల్త్‌ను ఏ రేంజ్లో డ్యామేజ్ చేస్తుందో తెలిస్తే మైండ్ పోతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ఏఐ అనేది ఒక పవర్ఫుల్ బ్రెయిన్ టూల్ మాత్రమేనని ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ఐడియాలు, కొత్త పాయింట్లు పట్టుకోవడానికి ఇది ఓకే కానీ.. ఒక పార్ట్నర్, మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ, లేదా సైకాలజిస్ట్ ప్లేస్‌ను దీనితో రీప్లేస్ చేయాలనుకోవడం మాత్రం నెక్స్ట్ లెవెల్ రిస్క్ అవుతుంది.
ఎందుకంటే నిజమైన మనుషులతో ఉన్న బంధాలే మనకు జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, గొడవలు జరిగినప్పుడు సద్దుకుపోవడం ఎలాగో నేర్పుతాయి. కానీ మనం చెప్పే ప్రతీ దానికి కూడా స్వీట్ గా, మనం ఏం వినాలనుకుంటామో ఆ మాటలే చెప్పే ఏఐ చాట్బాట్లు(With AI Chatting).. ఈ రియల్ లైఫ్ ఎమోషనల్ డెవలప్మెంట్ను ఏ మాత్రం ఇవ్వలేవు.
మరో డేంజరస్ పాయింట్ ఏంటంటే.. చాట్బాట్లు చాలా బాగా ఇంగ్లీష్ గ్రామిటికల్గా, ఆర్టిక్యులేట్గా మాట్లాడటంతో చాలామంది అవి ఏ సలహా ఇస్తే దానినే వేదవాక్కుగా నమ్మేస్తున్నారు. ఏఐ ఇచ్చే సలహాలు, చెప్పే తీపి మాటలు చూడడానికి పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అది ఆ పర్సన్‌కి క్లినికల్‌గా కరెక్ట్ కాకపోవచ్చు. పర్సనల్ లైఫ్‌లోని డిప్రెషన్, సైకిక్ ఇష్యూస్, మెంటల్ ఇల్నెస్, లవ్ బ్రేకప్స్, సూసైడ్ థాట్స్ వంటి సీరియస్ ప్రాబ్లెమ్స్ ఎదురైనప్పుడు.. ట్రైన్డ్ థెరపిస్ట్ ఇచ్చే సీరియస్ గైడెన్స్‌ని ఈ ఏఐ మాటలు మ్యాచ్ చేయలేవు.
అంతేకాదు, దీని వల్ల మనిషి మైండ్ సెట్ కూడా మారిపోతుంది. మన ప్రతీ మాటకీ ఎస్ అంటూ ఇనిస్టెంట్ రెస్పాన్స్ ఇచ్చే బాట్లతో రోజూ గడపడం అలవాటు అయితే.. నిజ జీవితంలో తోటి మనుషులు కొంచెం తేడాగా మాట్లాడినా కూడా తట్టుకునే ఓర్పు నశిస్తుంది.
ఏదైనా స్వీట్ తిన్నప్పుడు వచ్చే టెంపరరీ హ్యాపీనెస్ లాగానే .. చాట్‌బాట్ ఇచ్చే ఈ ఇనిస్టెంట్ ఓదార్పు బ్రెయిన్‌కు పర్మినెంట్‌గా ఎమోషనల్ పవర్ ఇవ్వదు. ఎప్పుడైనా సరే తోటి మనుషులతో మనస్ఫూర్తిగా పంచుకునే ప్రేమానురాగాలు, మనసు విప్పి మాట్లాడే మాటలే మెంటల్ హెల్త్‌కు అసలైన బూస్టర్ డోస్‌లా పని చేస్తాయి.
Foldable IPhone : యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయో నియా.. క్షణాల్లోనే స్టాక్ ఖాళీ





