Just LiteratureLatest News

Relationship : మీ రిలేషన్‌షిప్‌లో అటెన్షన్ తగ్గిందా? కొత్త వాళ్ల వైపు అట్రాక్ట్ అవుతున్నారా?

Relationship : ప్రతి మనిషికి గుర్తింపు, ప్రశంస, ప్రేమ, కేరింగ్ అనేవి ప్రాథమిక అవసరాలు. రిలేషన్‌షిప్‌లో అది దొరకనప్పుడు.. బయట ఎవరైనా చిన్న ప్రశంస కురిపించినా మనసు వారి వైపు లాగుతుంది.

Relationship

ప్రేమ, పెళ్లి అనేవి ప్రతీ ఒక్కరికీ అందమైన అనుభూతులు. కానీ ఎలాంటివారిలో అయినా మెల్లమెల్లగా తొలినాటి ఉత్సాహం, అటెన్షన్ తగ్గుతుంటాయి. అయితే ఎప్పుడైతే భాగస్వామి నుంచి దక్కాల్సిన ప్రేమ, గుర్తింపు లోపిస్తాయో.. ఆటోమేటిక్‌గా ఎదుటివారి మనసు బయట ఎక్కడైనా అది దొరుకుతుందేమోనని వెతకడం ప్రారంభిస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

అలా భాగస్వామితో రిలేషన్ వీక్ అయినపుడు వేరే వ్యక్తి వైపు ఆకర్షితులవడాన్ని సైకాలజీలో మెయిన్‌గా ఎమోషనల్ డిప్రివేషన్ (Emotional Deprivation) అని పిలుస్తారు. ఒక బంధంలో ఉంటున్నా సరే మానసికంగా ఎక్కువ ఒంటరితనాన్ని అనుభవించడం ఎమోషనల్ డిప్రివేషన్ అవుతుంది.

ప్రతి మనిషికి గుర్తింపు, ప్రశంస, ప్రేమ, కేరింగ్ అనేవి ప్రాథమిక అవసరాలు. రిలేషన్‌షిప్‌(Relationship)లో అది దొరకనప్పుడు.. బయట ఎవరైనా చిన్న ప్రశంస కురిపించినా మనసు వారి వైపు లాగుతుంది. దీనినే ది అటెన్షన్ సీకింగ్ రిఫ్లెక్స్ అని కూడా అంటారు.

అంటే శారీరకంగా కాకపోయినా, మానసికంగా వేరే వ్యక్తికి దగ్గరవుతూ తన పార్ట్‌నర్‌కు చెప్పలేని విషయాలను, బాధలను వేరే వ్యక్తితో పంచుకుంటారు. దీనిని ఎమోషనల్ ఇన్‌ఫిడిలిటీ అంటే మానసిక నమ్మకద్రోహంగా పరిగణిస్తారు.

అయితే దీనిని కేవలం మంచి లేదా చెడు అనే రెండు ముక్కల్లో తేల్చేయలేమని సైకాలజిస్టులు అంటున్నారు. ఎందుకంటే ఇదొక వార్నింగ్ బెల్ మాత్రమే. పార్ట్‌నర్ నిర్లక్ష్యం చేసినప్పుడు వేరే వాళ్లు చూపించే అటెన్షన్‌కు అట్రాక్టవడం మనుషుల నైజం. అంటే ఆకలి వేసినప్పుడు ఆహారం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లడం ఎంత కామనో, ప్రేమ కరవైనప్పుడు అది దొరికే చోటికి మనసు వెళ్లడం అంతే సహజం.

కాబట్టి ఇలాంటి ఆలోచన రాగానే తప్పు చేశామనితో కృంగిపోనవసరం లేదు. కాకపోతే ఆలోచన రావడం వేరు, దాని ప్రకారం అడుగులు వేయడం వేరు. ఆ ఆకర్షణలో కొట్టుకుపోయి పార్ట్‌నర్‌ను మోసం చేయడం లేదా బంధాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం కచ్చితంగా ఆ రిలేషన్‌షిప్‌(Relationship)ను దెబ్బతీస్తుంది. మనసు అటువైపు వెళ్తున్నప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి, ప్రస్తుత బంధాన్ని సరిదిద్దుకోవాలే తప్ప ఆ తప్పులోకి వెళ్లకూడదని తెలుసుకోవాలి.

కొత్తవాళ్లెవరయినా పరిచయం అయినపుడు తమ పార్ట్‌నర్‌ను దూరం పెట్టడమనేది ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తున్నాం. బంధంలో అటెన్షన్ తగ్గినప్పుడు, బయట ఎవరైనా వ్యక్తి పరిచయమై ప్రేమ, కన్సర్న్, ప్రాధాన్యత ఇస్తుంటే… పాత భాగస్వామిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి. దీనిని సైకాలజీలో ఫాంటసీ వర్సెస్ రియాలిటీ అంటారు. కొత్త వ్యక్తితో ఇంకా ఎలాంటి బాధ్యతలు, గొడవలు మొదలు కావు కాబట్టి ఆ బంధం చాలా అందంగా, ఒక ఫాంటసీలా కనిపిస్తుంది.

అదే సమయంలో వారికి డైలీ సమస్యలతో, బిజీగా ఉండే తమ భాగస్వామి బోర్ కొట్టే రొటీన్ లైఫ్‌లా కనిపిస్తారు. దీనివల్ల కొత్తవాళ్ల అటెన్షన్ దొరకగానే తమ పార్ట్‌నర్‌తో మాట్లాడటం తగ్గించేయడం, వారిని దూరం పెట్టడం చేస్తుంటారు. టెంపరరీగా దొరికే కొత్త అటెన్షన్ కోసం, ఎన్నో ఏళ్లుగా ఉన్న నమ్మకమైన బంధాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ..ఫ్యూచర్‌లో పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది.

Relationship
Relationship

పార్ట్‌నర్ కెరీర్ లేదా బాధ్యతల వల్ల టెంపరరీగా బిజీగా ఉన్న సమయంలో అవతలి వాళ్లు వేరే వ్యక్తి అటెన్షన్ కోసం చూస్తే.. అక్కడ బంధంలో లోతు తక్కువగా ఉన్నట్లే అర్థం. ఆ కొద్దిపాటి గ్యాప్‌లోనే వేరే వాళ్ల అటెన్షన్ కోరుకుంటే మాత్రం ఆ రిలేషన్(Relationship) కేవలం అటెన్షన్ కోసమే ఏర్పడిందా అనే డౌట్ వస్తుంది.

దీనిని సైకాలజీలో కో-డిపెండెన్సీ అంటారు. అంటే తన హ్యాపీనెస్ కోసం పూర్తిగా పార్ట్‌నర్‌పైనే ఆధారపడటం అన్నమాట.ఇది ఏమాత్రం మంచిది కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు.

అందుకే పార్ట్‌నర్ బిజీగా ఉంటే ఆ సమయంలో సొంత హాబీలు, ఫ్రెండ్స్ , కెరీర్‌పై దృష్టి పెట్టి సంతోషాన్ని వెతుక్కోవాలి. అంతేకానీ ఆ ఖాళీని వేరే వ్యక్తితో భర్తీ చేయాలనుకోవడం ఆ బంధానికి మంచిది కాదని తెలుసుకోవాలి.

E20 Petrol : E20 పెట్రోల్‌తో వెహికల్ మైలేజ్ తగ్గిపోతుందా? ఇన్సూరెన్స్ కూడా రాదా?

Related Articles

Back to top button