Just NationalJust PoliticalLatest News

Age Limit : చట్ట సభలకు పోటీ చేసే వయసు మారుస్తారా ?..25 నుంచి 21ఏళ్లకు తగ్గిస్తారా?

Age Limit : 21 ఏళ్ల వయస్సులోనే యువతీ యువకులు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలుగా ఎన్నికై, ఐటీ , విద్యాశాఖ లాంటి కీలక శాఖల మంత్రులుగా సేవలు అందించే అవకాశం లభిస్తుంది.

Age Limit

నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన దేశవ్యాప్తంగా జరిపిన పోరాటం విజయవంతమయింది. సీజేపీ దెబ్బకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఇది పూర్తిగా యువత సాధించిన విజయం అంటూ ప్రశంసలు కురుస్తోంది.

ఇదే సమయంలో దేశంలో ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని కొంతమంది నేతలు పిలుపునిస్తున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. చట్ట సభకు పోటీ చేసే వయసు(Age Limit) 25 నుంచి 21కి మార్చాలని సూచించారు. దీని ద్వారా యువత ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులకు సంబంధించి పోటీ చేసే వయసు(Age Limit) మారుస్తారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఒకవేళ చట్టసభల్లో పోటీ చేసే అర్హత వయస్సు 21 ఏళ్లకు మారుస్తే జరిగే పరిణామాలు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం లోక్‌సభ లేదా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం 25 ఏళ్లు, శాసనమండలి లేదా రాజ్యసభకు 30 ఏళ్లు ఉండాలి.

స్థానిక సంస్థలకు సంబంధించి చూస్తే ఇప్పటికే 21 ఏళ్లు నిండిన వారు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మేయర్ లేదా జడ్పీచైర్మన్ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశంలో జిల్లాలను పాలిస్తున్నప్పుడు, అదే వయస్సులో చట్టసభలకు కూడా పోటీ చేసే అవకాశం కల్పిస్తే తప్పేంటి అని కొంతమంది వాదన.

ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ఒకవేళ ఆ నిబంధనలో మార్పు చేస్తే జనాభాలో దాదాపు 30 శాతం ఉన్న యువతకు పార్లమెంటు, అసెంబ్లీల్లో తగినంత రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుంది. 21 ఏళ్ల వయస్సులోనే యువతీ యువకులు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలుగా ఎన్నికై, ఐటీ , విద్యాశాఖ లాంటి కీలక శాఖల మంత్రులుగా సేవలు అందించే అవకాశం లభిస్తుంది.

Age Limit
Age Limit

అయితే పార్లమెంట్ ఈ అంశంపై రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇది దేశవ్యాప్తంగా చట్టరూపంలోకి మారుతుంది. ఈ విషయంలో చాలా మంది రాజకీయ నాయకులు సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువత అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లో ప్రాతినిధ్యం ద్వారా దేశ ప్రజలకు మేలు చేసే అంశాల్లో తమ వంతు భాగం కావాలని సూచిస్తున్నారు.

Date Of Birth : ఈరోజు ఏ నెంబర్ వారికి ఎలాంటి లక్ దక్కుతుంది..వీరు ఆవేశాన్ని తగ్గించుకుంటేనే మంచిది..

Related Articles

Back to top button