Just NationalJust PoliticalLatest News

America : 50 వేల దళాలతో అమెరికా దాడి.. పశ్చిమాసియాలో భయంకర యుద్ధ వాతావరణం

America : యూఎస్ యుద్ధ విమానాలు వరుసగా తొమ్మిదో రోజు రాత్రి కూడా ఇరాన్ వ్యూహాత్మక స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపించాయి.

America

పశ్చిమాసియాలో వరుసగా బాంబుల వర్షం కురుస్తోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను భూస్థాపితం చేయడమే ఏకైక టార్గెట్‌గా అగ్రరాజ్యం అమెరికా(America) తమ దండయాత్రను మరింతగా ఉధృతం చేసింది.

అగ్రరాజ్య సైనిక విభాగం అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) అఫీషియల్‌గా రిలీజ్ చేసిన నివేదికల ప్రకారం.. యూఎస్ యుద్ధ విమానాలు వరుసగా తొమ్మిదో రోజు రాత్రి కూడా ఇరాన్ వ్యూహాత్మక స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపించాయి. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమైన ఈ వైమానిక దాడి, ఇరాన్ డిఫెన్స్‌ సిస్టమ్‌ను పూర్తిగా అతలాకుతలం చేసింది.

ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలను, అమాయకులైన నావికులను టార్గెట్‌గా చేసుకుని మరీ ఇరాన్ దారుణమైన దాడులకు తెగబడుతోందని అమెరికా మండిపడింది. ఈ రెచ్చగొట్టే చర్యలకు చెక్ పెట్టడానికే తాము ఈ స్థాయిలో ప్రతిదాడికి దిగాల్సి వచ్చిందని సెంట్‌కామ్ తన అధికారిక సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.

ఇరాన్ మిలటరీ శక్తిని మూలమట్టంగా నిర్వీర్యం చేసేంత వరకు కూడా తమ వైమానిక దాడులు ఆగవని యూఎస్ మిలటరీ కమాండ్ అధికారులు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. దీనికి ముందే, జూలై 18న కమాండర్ ఇన్ చీఫ్ డైరెక్టుగా ఇచ్చిన ఆదేశాలతో.. ఇరాన్ దక్షిణ ప్రావిన్స్‌లలోని మేజర్ మిలట్రీ ప్రొటెక్షన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై అమెరికా బాంబర్ విమానాలు బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

ఈ తొమ్మిది రోజులుగా ఆపకుండా జరుగుతున్న ఈ రేంజ్‌ దాడుల్లో ఇరాన్‌కు చెందిన చాలా డేంజరస్ అయిన క్షిపణులు, అటాకింగ్ డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి.

America
America

ముఖ్యంగా జూలై 17న జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని టార్గెట్‌గా చేసుకుని దాడికి పాల్పడిన ఇరాన్ రక్షణ దళం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ మూకలపై అమెరికా ఊహించని రేంజ్‌లో ప్రతీకారం తీర్చుకుంది.

ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో 50,000 మందికి పైగా అమెరికా(America) ఆర్మీ దళాలు సర్వసన్నాహాలతో మోహరించి ఉన్నాయని, సరిహద్దు దాటి ఎవరొచ్చినా క్షణాల్లో మట్టికరిపించడానికి సిద్ధంగా ఉన్నామని సెంట్ కామ్ సీరియస్ వార్నింగ్ ఇస్తూ ప్రకటన విడుదల చేయడంతో ప్రపంచదేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Date Of Birth : ఈరోజు ఏ నెంబర్ వారికి ధనలాభం, ఎవరికి హెచ్చరిక?

Related Articles

Back to top button