Just Nationaljust AnalysisLatest News

Anil Ambani : విడిపోయాడు-పడిపోయాడు..అనిల్ అంబానీ పతనానికి కారణాలివే

Anil Ambani : ఓ సామాన్యుడు ఎంతకైనా ఎదగగలడని ధీరూబాయ్ అంబానీ నిరూపించారు. కానీ ఆయన కుమారుడు అనిల్ అంబానీ మాత్రం లక్షల కోట్లు ఇచ్చినా సరే చేతిలో రూపాయి లేకుండా పోగొట్టుకోవచ్చని నిరూపించారు.

Anil Ambani

కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి అంటారు. అలాగే కలిసి ఉంటే బలం..విడిపోతే పడిపోతాం..ఈ రెండు రూల్స్ కూడా అనిల్ అంబానీకి సరిగ్గా సరిపోతాయి. అంబానీ అంటే సంపదకు చిహ్నం. పెట్రోల్ బంక్‌లో పని చేసి మహా సామ్రాజ్యాన్ని నిర్మించి.. ఓ సామాన్యుడు ఎంతకైనా ఎదగగలడని ధీరూబాయ్ అంబానీ నిరూపించారు.

కానీ ఆయన కుమారుడు అనిల్ అంబానీ(Anil Ambani) మాత్రం లక్షల కోట్లు ఇచ్చినా సరే చేతిలో రూపాయి లేకుండా పోగొట్టుకోవచ్చని నిరూపించారు. అంబానీ తదనంతరం ముఖేష్ కలిసి ఉందామని చెప్పినా అనిల్ వినలేదు. దీంతో పెద్దల సమక్షంలో ఆస్తులు పంచుకుని విడిపోయారు. తండ్రి వారసత్వాన్ని ముఖేష్ అంబానీ అద్భుతంగా కొనసాగిస్తే, అనిల్ అంబానీ మాత్రం అప్పుల పాలయ్యారు. చివరికి దివాలా పిటిషన్లు వేయాల్సిన పరిస్థితికి వచ్చారు.

ఆవేశపూరిత నిర్ణయాలు, మూలధన వనరుగా అప్పులపై మితిమీరి ఆధారపడటం, నిరంకుశ ధోరణి, వివాదాస్పద ఒప్పందాలతో అనిల్ పతనమయ్యారు. కంపెనీని నడపడానికి అప్పులు మాత్రమే అతని మంత్రం, అయితే అతని కంపెనీలు నష్టాల్లోకి జారి, కనీసం రుణాల ఈఎంఐలు చెల్లించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది.

అనిల్ అంబానీ(Anil Ambani) చేసిన మరో తప్పు తనకు ఎలాంటి పరిజ్ఞానం , సామర్థ్యం లేని వ్యాపార రంగంలోకి ప్రవేశించడం. ఈ రంగాలు నిలబడలేక, వాటి సొంత భారంతోనే కుప్పకూలిపోయాయి. దీనికి రిలయన్స్ డిఫెన్స్ ఒక స్పష్టమైన ఉదాహరణ.

ప్రభుత్వం, అధికార పార్టీ పూర్తిగా తన పక్షాన ఉన్నాయని, అలా కాంట్రాక్టులు వస్తాయని భావించి అనిల్ రిలయన్స్ డిఫెన్స్‌లో ప్రవేశించారు. కానీ ఆయన మౌలిక సదుపాయాలను, సామర్థ్యాన్ని నిర్మించే వరకు ప్రభుత్వం ఆయనకు సహాయం చేయలేదు.

Anil Ambani
Anil Ambani

రుణాలు తీర్చలేక, అతను రిలయన్స్ బిగ్ సినిమా, రిలయన్స్ బ్రాడ్‌కాస్టింగ్, రిలయన్స్ నిప్పన్, బీఎస్ఈఎస్ వంటి కంపెనీలలో తన వాటాలను అమ్మడం ప్రారంభించారు. ఆర్‌కామ్ కూడా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. స్వీడిష్ కంపెనీ ఎరిక్సన్ అండ్ చైనీస్ బ్యాంకులకు బాకీలు చెల్లించకపోవడంతో అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.

చివరికి అప్పులిచ్చిన బ్యాంకులు కోర్టులను ఆశ్రయించడంతో ఆయన కంపెనీలు దివాలా ప్రక్రియకు దారితీశాయి. స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్‌కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేక జైలుకెళ్లే పరిస్థితి రావడంతో ముఖేష్ అంబానీ 462 కోట్ల మొత్తాన్ని చెల్లించి సోదరుడ్ని ఆదుకున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఎంతటి వ్యాపార సామ్రాజ్యం అయినా కూలిపోతుంది అనడానికి అనిల్ అంబానీ ప్రత్యక్ష ఉదాహరణ.

Possessiveness : పెళ్లిలోనే కాదు.. ఫ్రెండ్‌షిప్, ప్రేమలోనూ పొసెసివ్‌నెస్ ఎందుకు?.. సైకాలజీ ఏం చెబుతోంది?

Related Articles

Back to top button