Just NationalJust PoliticalLatest News

Ration Cards:లక్షలాది రేషన్ కార్డుల రద్దు.. అప్‌డేట్ చేసుకునే విధానం ఇదే

Ration Cards: రేషన్ కార్డు దారులు ఎవరైనా వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే.. వారి కార్డును పరిశీలించి రద్దు చేసే అవకాశం ఉంటుంది.

Ration Cards

ప్రభుత్వం రేషన్ కార్డుల వినియోగంలో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి అలాగే దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అర్హత లేని వారితో పాటు, బోగస్ రేషన్ కార్డుల(Ration Cards) ద్వారా ప్రయోజనం పొందుతున్న వారిని ఏరివేయడానికి సిద్ధం అయి లక్షలాది కార్డులను రద్దు చేస్తోంది. ముఖ్యంగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయని వారిపై గవర్నమెంట్ కఠినంగా వ్యవహరిస్తోంది.

రేషన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయడంతో పాటు వేలిముద్రల ద్వారా ధృవీకరణ పూర్తి చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి చేసింది. ఇలా చేయకపోతే రేషన్ కార్డు రద్దు కావడమే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉచిత రేషన్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

రేషన్ కార్డులో పేరున్న వారంతా ప్రస్తుతం జీవించి ఉన్నారా లేదా అనే విషయాన్ని కన్ఫమ్ చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అలాగే ఒకే వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండటంతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో కార్డులు కలిగి ఉండటం వంటి అక్రమాలు తమ దృష్టికి రావడంతో వాటిని అరికట్టడానికి ఈ-కేవైసీని ఒక మార్గంగా ఎంచుకుంది. దీనివల్ల ప్రభుత్వానికి అసలైన లబ్ధిదారుల వివరాలు మాత్రమే అందుతాయి. దీని ద్వారా నిధుల దుర్వినియోగం బాగా తగ్గుతుంది. రేషన్ కార్డు దారులు ఎవరైనా వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే.. వారి కార్డును మరోసారి పరిశీలించి రద్దు చేసే అవకాశం ఉంటుంది.

Ration Cards
Ration Cards

నిజానికి ఈ-కేవైసీ పూర్తి చేయడం చాలా ఈజీ. లబ్ధిదారులు తమ దగ్గరలోని రేషన్ దుకాణానికి వెళ్లి, అక్కడి ఈ-పోస్ (e-PoS) యంత్రం ద్వారా బయోమెట్రిక్ వేలిముద్రలను వేయాలి. ఒకవేళ మీరు మీ సొంత ఊరిలో లేకపోయినా టెన్షన్ పడక్కరలేదు. ‘వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్’ పథకం కింద మీరు దేశంలో ఎక్కడున్నా, మీకు అందుబాటులో ఉన్న రేషన్ షాపులోనే దీనిని పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలనలో లక్షలాది బోగస్ కార్డులను అధికారులు తొలగించారు. కాబట్టి గడువు ముగిసేలోపు కేవైసీ పూర్తి చేసుకోవడం మంచిది.

రేషన్ కార్డులు (Ration Cards) కేవలం బియ్యం, పప్పులు వంటి నిత్యావసరాలు తీసుకోవడానికి మాత్రమే కాదు. ఇది ఒక ముఖ్యమైన గుర్తింపుతో పాటు నివాస ధృవీకరణ పత్రంగా కూడా ఇది పనిచేస్తుంది. తక్కువ ఇన్కమ్ ఉన్న కుటుంబాలకు ఇది ఒక రక్షణ కవచం లాంటిది. ఉచిత రేషన్ తో పాటు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గృహలక్ష్మి, మహిళలకు ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి పథకం), ఆరోగ్య శ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే ప్రాతిపదికగా నిలుస్తుంది. అందుకే మీ కార్డు మీ దగ్గర ఉండాలంటే వెంటనే కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Jananayagan:ఎన్నికలు ముగిశాయి.. మరి బాక్సాఫీస్ వద్ద జననాయగన్ హంగామా ఎప్పుడు?

Related Articles

Back to top button