CM Vijay : మరోసారి కెమెరా ముందుకు సీఎం విజయ్..2 రోజులు ప్రత్యేక షూటింగ్..
CM Vijay : జన నాయకుడు మూవీ తర్వాత నటనకు ముగింపు పలికిన తమిళనాడు సీఎం విజయ్, ప్రభుత్వం తరఫున ఒక స్పెషల్ యాడ్ కోసం మళ్లీ మేకప్ వేసుకోనున్నారనే న్యూస్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
CM Vijay
తమిళనాడు ముఖ్యమంత్రిగా పవర్లోకి వచ్చిన తర్వాత స్టార్ హీరో విజయ్ సినిమాలకు దూరంగా ఉంటానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. జన నాయకుడు మూవీతో యాక్టర్‌గా తన సుదీర్ఘ ప్రయాణానికి గుడ్ బై చెప్పినట్లు ప్రకటించడంతో, ఆయనను మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై చూసే అవకాశం లేదని అభిమానులు భావించారు. కానీ, ఆ నిర్ణయానికి చిన్న ఎక్సెప్షన్ ఇస్తూ విజయ్ మళ్లీ కెమెరా ముందుకు రావడానికి ఆసక్తికరమైన కారణం ఏర్పడింది. గౌతమ్ వాసుదేవ్ మేనన్ పర్యవేక్షణలో ఒక స్పెషల్ షూటింగ్లో విజయ్(CM Vijay) పాల్గొనబోతున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సాధారణంగా గవర్నమెంట్ స్కీమ్స్, విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఫేమస్ సినీ యాక్టర్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకుంటుంటారు. అయితే ఇప్పుడు సీఎం స్థానంలో విజయ్ ఉండటంతో, బయటి నుంచి మరొక స్టార్‌ను ఆహ్వానించాల్సిన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. తమిళనాడులో ఆయనకు ఉన్న అపారమైన ప్రజాదరణ, గుర్తింపును దృష్టిలో ఉంచుకుని, గవర్నమెంట్ రూపొందించనున్న ఒక ప్రత్యేక యాడ్‌లో సీఎం విజయ్ను భాగస్వామ్యం చేయాలనే ప్లాన్ రెడీ చేశారు. ఇది నిజమైతే పరిపాలనా బాధ్యతలను స్వీకరించిన తర్వాత విజయ్ కెమెరా ముందుకు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది.
గవర్నమెంట్ యాడ్స్ సాధారణంగా తక్కువ టైమ్‌లో, పరిమిత బడ్జెట్‌తో పూర్తవుతాయి. అయితే విజయ్ కనిపించనున్న ఈ యాడ్‌ను మాత్రం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, సినిమాను తలపించే విజువల్స్ ఇచ్చేలా భారీ రేంజ్లో రూపొందించాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవజ్ఞులైన టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దింపి చిన్న మూవీని చూసిన అనుభూతిని అందించేలా దీనిని ప్లాన్ చేస్తున్నారు.
సీఎంగా విజయ్(CM Vijay) లైఫ్ స్టైల్, డైలీ లైఫ్ పూర్తిగా మారిపోవడంతో, ఈ షూటింగ్ కోసం కేవలం రెండు రోజుల సమయాన్ని మాత్రమే కేటాయించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని బై ఎలక్షన్స్ ముగిసిన వెంటనే ఈ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది సినిమాల్లోకి కమ్‌బ్యాక్ కాకపోయినా, జన నాయకుడు తర్వాత విజయ్ను మళ్లీ విజువల్ ఫ్రేమ్‌లో చూడబోతున్న వార్త మాత్రం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్గా మారింది.
SmartPhone Prices : మొబైల్స్‌పై ఏఐ ఎఫెక్ట్.. 30 శాతం వరకు పెరగనున్న ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు





