Just NationalLatest News

Cyclone Akvan : ఒడిశా వైపు మళ్లిన అక్వాన్ తీవ్ర తుపాను.. ఉత్తరాంధ్రకు డేంజర్ బెల్స్

Cyclone Akvan : బంగాళాఖాతంలో రెండు రోజులుగా కేంద్రీకృతమైన అక్వాన్ తీవ్ర తుపాను.. దిశ మార్చుకుని గోపాల్‌పూర్ వైపు వెళ్తోంది. దీంతో ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉండే ఛాన్స్ ఉండటంతో అధికారులు పాఠశాలలకు సెలవులను ప్రకటించి తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

Cyclone Akvan

తీవ్ర తుపానుగా మారిన అక్వాన్ బంగాళాఖాతంలో తన దిశను మార్చుకుని తీరం వైపు వేగంగా విరుచుకుపడుతోంది. గడిచిన 6 గంటల వ్యవధిలో గంటకు 13 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం కళింగపట్నానికి 320 కిలోమీటర్లు, నరసాపురానికి 390 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 410 కిలోమీటర్లు దూరంలో ఈ తుపాను వ్యవస్థ కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ముందుగా పొట్టిశ్రీరాములు నెల్లూరు , కాకినాడ జిల్లా తుని మధ్య తీరాన్ని అక్వాన్(Cyclone Akvan) తుపాన్ తాకుతుందని అధికారులు భావించినా, వాతావరణ గమనంలో వచ్చిన తీవ్ర మార్పుల వల్ల ఇది రేపు అంటే నవంబర్ 21 వ తేదీ మధ్యాహ్నానికి గోపాల్‌పూర్ వద్ద తీరం దాటనుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ గాలి వేగం ఊహించని రీతిలో పెరగబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా గంటకు 90 – 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, గరిష్ఠంగా గంటకు 110 కి.మీ. ప్రచండ గాలులు తీర ప్రాంతాలను వణికించే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలల రికార్డు స్థాయిలో అతి భారీ వర్షాలు పడే డేంజర్ ఉంది. అదే విధంగా విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలలో అయితే ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదు కాబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రమాదాలను నివారించడానికి యంత్రాంగం సిద్ధమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉండే స్కూలులు, కాలేజీలు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. తీరప్రాంత గ్రామాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రాకూడదని స్పష్టం చేశారు. సముద్రం తీవ్రంగా అలజడికి గురవుతుండటంతో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెంటనే వెనక్కి రావాలని కలెక్టర్లు ఆదేశించారు.

Opportunists : మీ చుట్టూ ఉన్న అవకాశవాదులను ఇట్టే గుర్తించడం ఎలా? ఈ సైకలాజికల్ ట్రిక్స్ తెలుసుకోండి

Related Articles

Back to top button