Four Day Work
కార్మిక రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పులను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. పార్లమెంట్ చట్టాలను ఆమోదించిన సుమారు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, కేంద్రం తాజాగా నాలుగు కీలక కార్మిక కోడ్‌లకు (Labour Codes) సంబంధించిన తుది నిబంధనలను అధికారికంగా నోటిఫై చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
దీనిలో పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతనాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తిపరమైన భద్రత-ఆరోగ్య-పని పరిస్థితుల నియమావళి ఉన్నాయి. ఈ చట్టాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 30కి పైగా గెజిట్ నోటిఫికేషన్లను రిలీజ చేయడంతో, కొన్ని ప్రత్యేక రంగాలలో వారానికి కేవలం నాలుగు రోజులు (Four Day Work Week) మాత్రమే పని చేసే సరికొత్త విధానానికి మార్గం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, వారానికి పని గంటలను 48 గంటలకే పరిమితం చేస్తుంది. అయితే, యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య పరస్పర అంగీకారంతో ఈ పని గంటలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. దీంతో చాలా కంపెనీలు రోజువారీ పని గంటలను 12 గంటల వరకు పెంచుకుంటూ పోయి.. వారంలో కేవలం 4 రోజులు(Four Day Work) మాత్రమే పనిదినాలను కేటాయించే అవకాశమే ఎక్కువ ఉంటుంది.
దీని ద్వారా ఉద్యోగులు వారానికి మూడు రోజుల పాటు పూర్తి విశ్రాంతిని తీసుకుంటూ లాంగ్ వీకెండ్‌ను పొందే అవకాశం లభిస్తుంది. అయితే, రోజువారీ వేతనం తీసుకునే కార్మికులకు మాత్రం.. సాధారణ పని దినం 8 గంటలుగా ఉండటంతో పాటు ఆ తర్వాత పని చేసే ప్రతి గంటకూ ఓవర్ టైమ్ రేట్లు వర్తించనున్నాయి.
ఈ నాలుగు రోజుల పని విధానం ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్(Infrastructure) సెక్టార్‌కు, షిఫ్ట్ ఆధారిత ప్రాజెక్టులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) ఆధారిత సేవలు, షేర్డ్ సర్వీసెస్ వంటి విభాగాలకు ఎంతో బాగుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, రియల్ టైమ్ డెలివరీ , క్లయింట్లతో కంటిన్యూగా కమ్యూనికేషన్ అవసరమయ్యే కొన్ని సర్వీస్ రంగాలలో దీనిని ప్రాక్టికల్‌గా అమలు చేయడం కొంత సవాలుతో కూడుకుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ కొత్త లేబర్ కోడ్స్ వల్ల ఉద్యోగుల వేతన వ్యవస్థలోనూ (Salary Structure) భారీ మార్పులు రాబోతున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం, ఒక ఉద్యోగికి వచ్చే మొత్తం శాలరీలో కనీసం 50 శాతం వాటా కచ్చితంగా బేసిక్ పే (Basic Pay) రూపంలోనే ఉండాలి. ప్రస్తుతం మెజారిటీ కంపెనీలు వేరే అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తాన్ని చూపిస్తూ బేసిక్ పేను తక్కువగా ఉంచుతున్నాయి.
కొత్త కండిషన్ల వల్ల బేసిక్ పే పెరగడమనేది ఉద్యోగుల ఫ్యూచర్‌కు ఎంతో మేలు చేస్తుంది, ఎందుకంటే దీనివల్ల వారి ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్లు ఎక్కువగా పెరుగుతాయి. కానీ, పీఎఫ్ కటింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఉద్యోగుల చేతికి వచ్చే నెలవారీ జీతం (In-hand Salary) కొంత తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మార్పులపై కొంతమంది ఉద్యోగులలో ఆందోళన ఉన్నా కూడా, లాంగ్ టర్మ్‌లో ఉద్యోగుల హక్కుల రక్షణకు , పారదర్శకమైన పని వాతావరణానికి ఈ చట్టాలు ఎంతో దోహదపడతాయని కేంద్రం ఆశిస్తోంది.
