Gold Price : గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. రాకెట్‌లా దూసుకెళ్తున్న బంగారం,వెండి.. జ్యువెలరీ కొనేముందు ఇవి తెలుసుకోండి..
Gold Price : వంద శాతం ప్యూర్ గోల్డ్‌తో జ్యువెలరీ తయారు చేయడం సాధ్యం కాదు..విరిగిపోతుంది కాబట్టి బంగారంలో రాగి లేదా ఇతర లోహాలు కలిపి 22 లేదా 18 క్యారెట్లలో ఆభరణాలను చేస్తారు.
Gold Price
పసిడి ప్రియుల గుండెల్లో మరోసారి రైళ్లు పరుగెట్టాలాంటి వార్త వినిపిస్తోంాది. ఇటీవల కాస్త అటు ఇటుగా ఉన్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిపోతున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో శనివారం పసిడి, వెండి గ్రాఫ్‌లు చూస్తే అందరికీ మతులు పోగొడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న గ్లోబల్ టెన్షన్లు, దీనికితోడు రష్యాపై అమెరికా కొత్త ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి పరిస్థితులతో అంతర్జాతీయ మార్కెట్ మొత్తం అనిశ్చితిలో పడిపోయింది. కరెన్సీ మార్పిడి విలువల్లో అప్ అండ్ డౌన్స్ రావడంతో ఇన్వెస్టర్లంతా తమ డబ్బులను సేఫ్‌గా ఉంచడానికి బులియన్ మార్కెట్ వైపు చూస్తున్నారు.దీంతో బంగారం,వెండి రేట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల శుద్ధమైన పసిడి ధర శుక్రవారం రోజు రూ.1లక్ష 53వేల149 వద్ద ఉండగా, శనివారానికి ఏకంగా రూ.2,201 పెరిగి రూ.1లక్ష55వేల350 మార్కును తాకింది. ఇక విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, ప్రొద్దుటూరులలో కూడా సేమ్ ఇదే రేటు ఉంది.నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1లక్ష38వేల650గా మార్కెట్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గమనిస్తే స్పాట్ బంగారం ధర ఔన్స్‌కు 4,342 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
మరోవైపు గోల్డ్ బాటలోనే సిల్వర్ కూడా భారీ ఎత్తున షాక్ ఇచ్చింది. నిన్నటివరకు కిలో సిల్వర్ రూ.2లక్షల32వేల498గా ఉంటే, ఒక్క రోజులోనే ఏకంగా రూ.4,110 పెరిగి రూ.2లక్షల36వేల608 రేంజ్‌కు చేరిపోయింది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర ఔన్స్‌కు 63.51 డాలర్లుగా ఉంది.
అయితే పసిడి విషయంలో ప్రతీ ఒక్కరూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడం మంచిది. మొదటిది గోల్డ్ ప్యూరిటీ . బంగారం క్వాలిటీని క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ ఉంటే దానిలో 99.9 శాతం ప్యూరిటీ ఉన్నట్లు లెక్క. 22 క్యారెట్‌లో 91.67 శాతం ప్యూరిటీ ఉంటుంది. క్యారెట్స్ ఎంత తగ్గితే అంత ప్యూరిటీ తగ్గుతుందని గుర్తుంచుకోవాలి.
అయితే వంద శాతం ప్యూర్ గోల్డ్‌తో జ్యువెలరీ తయారు చేయడం సాధ్యం కాదు..విరిగిపోతుంది కాబట్టి బంగారంలో రాగి లేదా ఇతర లోహాలు కలిపి 22 లేదా 18 క్యారెట్లలో ఆభరణాలను చేస్తారు. గోల్డ్ కాయిన్స్ విషయానికి వస్తే 14 లేదా 18 క్యారెట్లలో వీటిని తయారు చేస్తుంటారు.

ఇక రెండోది అత్యంత కీలకమైన బీఐఎస్ హాల్‌మార్క్. షాపులో ఆభరణాల క్వాలిటీపై ఎలాంటి మోసాలు జరగకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ హాల్ మార్కింగ్‌ను ఇవ్వాలన్న విషయాన్ని తప్పనిసరి చేసింది. గోల్డ్ ప్యూరిటీ, దాన్ని తయారు చేసిన జ్యువెలరీ కోడ్, హాల్ మార్కింగ్ వేసిన డేట్ అంతా లేజర్ ప్రింటింగ్ ద్వారా జ్యువెలరీపై ముద్రిస్తారు. జ్యువెలరీ కొనేముందు ఈ గుర్తు ఉందో లేదో పక్కాగా చెక్ చేసుకోవాలి.
వీటితో పాటు మేకింగ్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఆభరణాల డిజైన్, వర్క్ బట్టి ఇవి 3 శాతం నుంచి 25 శాతం వరకు మారుతుంటాయి. అలాగే మనకిష్టమైన జ్యువెలరీ కాస్ట్‌ను మనమే ఈజీగా లెక్కపెట్టుకోవాలంటే.. ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఫైనల్ ఆభరణం ధర = మనం కొనే రోజు మార్కెట్లో ఉన్న గ్రాము పుత్తడి ధర(Gold Price) x జ్యువెలరీ వెయిట్ + మేకింగ్ ఛార్జీలు + వేస్టేజీ ఛార్జీలు + జీఎస్టీ పన్నులు ఇలా వరుసగా లెక్కపెట్టాలి.. ఈ లెక్క సరిగ్గా చూసుకుంటే గోల్డ్ షాపుల్లో మోసపోకుండా పర్ఫెక్ట్‌గా షాపింగ్ చేసుకోవచ్చు.
Transactional Relationship : కనుమరుగువుతున్న అనుబంధాలు.. ఖాళీ అవుతున్న కుటుంబ బంధాలు





