Just NationalJust BusinessLatest News

Gold Rates : పసిడి ప్రియులకు షాక్..యుద్ధ భయంతో మళ్లీ పెరిగిన ధర

Gold Rates : ఈ యుద్ధ పరిస్థితులతో అటు చమురు ధరలకు, ఇటు బంగారం ధరలకు ఇప్పట్లో బ్రేక్ పడే అవకాశాలు లేనట్టే

Gold Rates

గత ఏడాదిన్నర కాలంగా పసిడి ప్రియులకు ఊరట కంటే షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్న బంగారం ధరలు(Gold Rates) మరోసారి రాకెట్ లా దూసుకెళ్లాయి. ఒకసారి తగ్గుతుంటే ఆరేడు సార్లు పెరుగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు అసలు కొనాలా వద్దా అంటూ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు.

పైగా ప్రధాని మోదీ కూడా బంగారం కొనొద్దని చెబుతున్నా గురువారం 2 వేల వరకూ తగ్గేటప్పటికీ కొనుగోళ్లు పెరిగాయి. అయితే ఊహించని విధంగా శుక్రవారం గోల్డ్ రేట్లు(Gold Rates) ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ పెరిగాయి. గత మూడు రోజులుగా తగ్గముఖం పట్టడంతో కొనుగోలుదారులు సంతోషపడ్డారు.

అయితే ఇరాన్ డ్రోన్లను అమెరికా కూల్చడం, దీనికి ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం బులియన్ మార్కెట్ పై గట్టిగానే చూపించింది.

శుక్రవారం అనూహ్యంగా 10 గ్రాముల బంగారం ధర రూ.1580 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,640గా ఉంది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు కూడా భారీగా పెరిగింది. ఇవాళ రూ.1,450 పెరిగి ప్రస్తుతం రూ.1,44,500 దగ్గర కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా ఎగబాకాయి. కిలో వెండి ధరపై రూ.5 వేలు పెరిగింది. దీని ప్రకారం కిలో వెండి ప్రస్తుతం రూ.2,80,000కు చేరుకుంది.

Gold Rates
Gold Rates

అసలే పెళ్లిళ్లు , ఇతర శుభకార్యాలతో బిజీగా ఉన్నవారికి ఈ పెరిగిన ధరలు పెద్ద షాకిచ్చాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ముగిసే వరకూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూనే ఉంటాయని చెబుతున్నారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనే పరిస్థితి కనిపించడం లేదని, ట్రంప్ ధోరణే దీనికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధ పరిస్థితులతో అటు చమురు ధరలకు, ఇటు బంగారం ధరలకు ఇప్పట్లో బ్రేక్ పడే అవకాశాలు లేనట్టే.

పెట్టుబడిదారులు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్స్ వైపే మొగ్గుచూపుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ పెరిగిపోతోంది. దాని ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్లపై కూడా పడుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉంటున్నాయి. ప్రస్తుతానికి బంగారం కొనుగోలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Siddaramaiah : సిద్ధరామయ్య డిమాండ్లు ఇవే..కొడుకు కోసం పెద్ద ప్లానే

Related Articles

Back to top button