Just InternationalLatest News

Solar Storm : భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాన్..మన మొబైల్స్, ఇంటర్నెట్‌ల పరిస్థితి ఏంటి?

Solar Storm : మన మొబైల్ ఫోన్లు, నెట్‌వర్క్స్ ఏమైనా డౌన్ అవుతాయా అనే డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది .

Solar Storm

సూర్యుడు అంతరిక్షంలో అప్పుడప్పుడు ఇచ్చే సడన్ షాక్‌లు డైరెక్టుగా మనందరి డైలీ లైఫ్‌పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఒక షాకింగ్ అప్‌డేట్ బయటికొచ్చింది. ఒక పవర్‌ఫుల్ సౌర తుపాను (సోలార్ స్టార్మ్)(Solar Storm) భూమి వైపు చాలా ఫాస్ట్‌గా దూసుకొస్తోందన్న వార్త అందరిలోనూ టెన్షన్ పుట్టిస్తోంది. అది కూడా ఈరోజే ఈ సోలార్ స్టార్మ్ భూమిని తాకే అవకాశం ఉందని సైంటిస్టులు అలర్ట్ చేస్తున్నారు.

సూర్యుడి నుంచి బయలుదేరిన ఈ కిరణాలు ఇప్పటికే అంతరిక్షంలో పెద్ద రచ్చ చేస్తున్నాయి. అసలు ఈ సోలార్ స్టార్మ్(Solar Storm) వెనుక జరిగే విషయం ఏంటి? దీనివల్ల మన మొబైల్ ఫోన్లు, నెట్‌వర్క్స్ ఏమైనా డౌన్ అవుతాయా అనే డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది .

తాజాగా సూర్యుడిపై రెండు పెద్ద బ్లాస్ట్ జరగడంతో.. విపరీతమైన మ్యాగ్నెటిక్ పవర్, ప్లాస్మా వాయువులతో కూడిన పెద్ద వేవ్స్ స్పేస్‌లోకి విడుదల అయ్యాయి. వీటిని సైంటిస్టులు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అని పిలుస్తారు.

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. సూర్యుడి నుంచి వచ్చిన ఈ 2 వేవ్స్‌లో రెండోది మొదటిదాని కంటే చాలా వేగంగా ప్రయాణిస్తోంది. దాంతో అది భూమిని తాకేలోపే ఈ రెండూ కలిసిపోయి ఒకే పెద్ద సోలార్ వేవ్‌లా మారతాయని నోవా సైంటిస్టులు క్లియర్‌గా చెబుతున్నారు.

నిజానికి ఇలా రెండు పవర్‌ఫుల్ తరంగాలు ఒకటై భూమిని హిట్ చేసినప్పుడు నింగిలో ఒక అద్భుతం కనిపిస్తుంది. అప్పుడు ఆకాశంలో రంగురంగుల వెలుగులు మెరుస్తాయి. వీటిని అరోరాలు అంటారు. జనరల్‌గా ఇవి నార్త్, సౌత్ పోల్స్‌లోనే కనిపిస్తూ ఉంటాయి.

కానీ ఈసారి ఇంపాక్ట్ గట్టిగా ఉండటంతో వేరే ప్లేసెస్ నుంచి కూడా ఇవి కనిపించొచ్చు. కాకపోతే ఈ కలర్‌ఫుల్ సీన్ వెనుక మన టెక్నాలజీకి చిన్న టెస్ట్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఈ సోలార్ మార్పుల వల్ల జీపీఎస్ నేవిగేషన్, రేడియో సిగ్నల్స్, శాటిలైట్ సర్వీసెస్‌లో అక్కడక్కడా చిన్న చిన్న సిగ్నల్ డ్రాప్స్ లేదా డిస్టర్బెన్స్ రావొచ్చు.

Solar Storm
Solar Storm

అయితే దీనివల్ల మన దగ్గర పవర్ కట్ జరగడం లేదా ఇంటర్నెట్, ఫోన్ నెట్‌వర్క్స్ కంప్లీట్‌గా ఆగిపోవడం జరుగుతుందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సైంటిస్టులు క్లారిటీ ఇస్తూ.. ఇది కేవలం G2 విభాగానికి చెందిన నార్మల్ సోలార్ స్టార్మ్(Solar Storm) మాత్రమే కాబట్టి ఎవరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

మన భూమికి ఉన్న నేచురల్ ప్రొటెక్షన్ లేయర్ మనందరినీ సేఫ్‌గా కాపాడుతుందని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు. కాబట్టి ఎవరూ ఈ ఇష్యూపై పానిక్ అవ్వాల్సిన పని లేదు, కాకపోతే స్పేస్‌లో జరుగుతున్న ఈ అప్డేట్స్‌ని మాత్రం సైంటిస్టులు నిరంతరాయంగా ట్రాక్ చేస్తూ ఉన్నారు.

Solar Roof Top: సోలార్ రూఫ్ టాప్ ..కరెంట్ బిల్లుల భారం నుంచి విముక్తి వస్తుందా?

Related Articles

Back to top button