Just NationalJust PoliticalLatest News

Karnataka CM : కర్ణాటక సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సస్పెన్స్‌కు మరికొన్ని గంటల్లో ఎండ్ కార్డ్

Karnataka CM : సిద్ధరామయ్య స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ మార్గం సుగమం చేయడంతో సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Karnataka CM

కర్ణాటక రాజకీయాల్లో మూడు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లోనే పూర్తిగా తెరపడనుంది. మూడేళ్లుగా సాగుతున్న నాయకత్వ మార్పుపై క్యూరియాసిటీ..ఈరోజుతో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.

సిద్ధరామయ్య స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ మార్గం సుగమం చేయడంతో సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మే 28న తన మంత్రివర్గ సహచరులతో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసిన వెంటనే, సిద్ధరామయ్య తన రాజీనామా లెటర్‌ను సమర్పించే అవకాశాలున్నాయి. దీని కోసం ఆయన మే 27న గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధరామయ్య అంగీకరించారు.

పార్టీని వీడకుండా సిద్ధరామయ్యను నేషనల్ పాలిటిక్స్‌లోకి తీసుకురావడానికి అధిష్టానం కొన్ని కీలకమైన ఆఫర్లను ఆయన ముందు ఉంచింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో సిద్ధరామయ్యకు సీటు కేటాయించడంతో పాటు, ఏఐసీసీ (AICC) లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక కీలక పదవిని అప్పగించడానికి అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

రాహుల్ గాంధీ స్వయంగా సిద్ధరామయ్యతో ఈ ప్రతిపాదన చేయడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గతంలో తాను చెప్పినట్లే, రాహుల్ కోరడంతో ఎలాంటి బేషజాలు లేకుండా పదవి నుంచి తప్పుకోవడానికి నిశ్చయించుకున్నారు.

మరోవైపు కర్ణాటకలో ఈ అధికార మార్పిడి ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడానికి.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కె.సి. వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరులోనే మకాం వేశారు. వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను సేకరించి, కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరును అఫీషియల్‌గా ప్రకటిస్తారు.

Karnataka CM
Karnataka CM

కాకపోతే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో డీకే శివకుమార్ వర్గం సంబరాలకు సిద్ధమవబోతుండగా, సిద్ధరామయ్య అనుచరుల్లో మాత్రం నిరాశ కనిపిస్తోంది. మొత్తానికి ఈ రాజకీయ వేడితో కర్ణాటక అంతా ఉత్కంఠ నెలకొంది.

Onion :ఉల్లిపాయే కదా అని లైట్ తీసుకోకండి..ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Related Articles

Back to top button