LGP : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్.. జూలై 1 నుంచి ఈ కొత్త రూల్స్
LGP : గృహ వినియోగ ఎల్పీజీ( LPG) సిలిండర్లు ,పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడుతున్న కస్టమర్లపై కొత్త రూల్స్ ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
LGP
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా జూలై 1, 2026 నుంచి గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. గృహ వినియోగ ఎల్పీజీ( LPG) సిలిండర్లు ,పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడుతున్న కస్టమర్లపై ఈ కొత్త రూల్స్ ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఈ కేవైసీ( eKYC) పూర్తి చేయడం, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లకు వచ్చే ఓటీపీ ఆధారంగానే డెలివరీ ఇవ్వడంతో పాటు డ్యూయల్ కనెక్షన్లపై లిమిట్స్ విధించడం వంటి అంశాలను ఈ న్యూ పాలసీలో చేర్చారు. పీఎన్జీ గ్యాస్ లైన్లు అందుబాటులో ఉన్న మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల వాడకాన్ని తగ్గించడంతో పాటు..జనాలను పీఎన్జీ వైపు మళ్లించడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఈ కొత్త నిబంధనల వెనుక ఒక బలమైన కారణం ఉంది. చాలా ఇళ్లలో గ్యాస్ పైప్‌లైన్ (PNG) సౌకర్యం ఉన్నా కూడా, బ్యాకప్ కోసం ఎల్పీజీ(LGP) సిలిండర్లను కూడా ఇంకా అలాగే తమ వద్ద ఉంచుకుంటున్నారు. దీనివల్ల అనవసరమైన గ్యాస్ నిల్వలు పెరగడమే కాకుండా, గవర్నమెంట్ సబ్సిడీలు దుర్వినియోగం అవుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.
అందుకే ఇక మీదట పీఎన్జీ సేవలు ఉన్న ఏరియాల్లో ఎల్పీజీ(LGP) కనెక్షన్లు కొనసాగించకుండా సిలిండర్లను వెనక్కి అప్పగించాలని వినియోగదారులకు నోటీసులు పంపే అవకాశం ఉంది. అయితే, గ్యాస్ పైప్‌లైన్ ఇంకా రాని గ్రామీణ, సిటీ ప్రాంతాల్లోని సాధారణ ఎల్పీజీ కస్టమర్లకు మాత్రం దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, వారు కచ్చితంగా మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవడంతో పాటు డెలివరీ సమయంలో ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది.

ఇక అందరూ ప్రతీ నెలా ఆసక్తిగా ఎదురుచూసే గ్యాస్ సిలిండర్ ధరల విషయానికి వస్తే.. జూలై 1 నుంచి ధరలలో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం కావడం వల్ల, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు కొంత వరకూ తగ్గే ఛాన్స్ ఉంది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గుతాయా లేక అలాగే స్థిరంగా కొనసాగుతాయా అనేది ప్రభుత్వ ఇంధన కంపెనీల ఫైనల్ డెసిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఏది ఏమైనా గ్యాస్ వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. జూలై 1 లోపే తమ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ కేవైసీ స్టేటస్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం, ఆధార్ లింక్ వంటి పనులను పూర్తి చేసుకుంటే మంచిది.
Enumeration : బీఎల్వో రాకపోయినా టెన్షన్ వద్దు..మొబైల్ నుంచే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసేయొచ్చు





