New Rules In Railways : రైల్వే రూల్స్ పూర్తిగా మార్చేసిన కేంద్రం.. ఈ తప్పులు చేస్తే షాకింగ్ జరీమానాలు
New Rules In Railways : చిన్నచిన్న నేరాలకు వేసే జైలు శిక్షలను రద్దు చేసి ప్రయాణీకులకు ఊరటనిచ్చిన కేంద్రం.. రూల్స్ అతిక్రమిస్తే కట్టే జరీమానాను మాత్రం చాలా ఘాటుగా పెంచేసింది.
New Rules In Railways
ట్రైన్ టిక్కెట్ చేతిలో ఉంటే చాలు.. ప్రయాణం సాఫీగా సాగిపోతుందనుకుంటే ఇకపై పొరపాటే అవుతుంది. ప్రయాణీకుల రక్షణ, రైళ్లలో క్రమశిక్షణే టార్గెట్‌గా కేంద్ర ప్రభుత్వం జన విశ్వాస్ చట్టాన్ని తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు కేవలం టీటీఈ (TTE)కి మాత్రమే ఉండే చెకింగ్, ఫైన్ విధించే అధికారాలను ఇకపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులకు కూడా కట్టబెట్టింది. చిన్నచిన్న నేరాలకు వేసే జైలు శిక్షలను రద్దు చేసి ప్రయాణీకులకు ఊరటనిచ్చిన కేంద్రం.. రూల్స్(New Rules In Railways) అతిక్రమిస్తే కట్టే జరీమానాను మాత్రం చాలా ఘాటుగా పెంచేసింది.
ఈ చట్టం ప్రకారం ట్రైన్లో కానీ, స్టేషన్ ప్రాంగణాలలో కానీ ఎలాంటి ఉల్లంఘనలు చేసినా జేబు ఖాళీ అవ్వడం ఖాయం. ఉదాహరణకు టిక్కెట్ లేకుండా ట్రైన్లో జర్నీ చేసినా, లేదా బుక్ చేసుకున్న స్టేషన్ కంటే ఎక్కువ దూరం వెళ్లినా, వేరొకరి టిక్కెట్‌తో ప్రయాణం చేస్తూ దొరికిపోయినా టిక్కెట్ ఛార్జీతో పాటు కనీసంగా రూ. 500ల ఫైన్‌ను ఆర్పీఎఫ్ వసూలు చేస్తుంది.
ట్రైన్స్‌లో ఇకపై అసభ్య ప్రవర్తనలకు అస్సలు అవకాశం లేదు. ఆల్కహాల్ తాగి ప్రయాణించడం, మద్యం మత్తులో రచ్చ చేయడం, తోటి ప్రయాణికులెవరితో అయినా అసభ్యంగా మాట్లాడటం, అనుచితంగా ప్రవర్తించడం వంటివి చేస్తే ఏకంగా రూ. 1,000 వరకు ఫైన్ విధించడమే కాకుండా, సామాజిక సేవ(Social service) చేయిస్తారు.
అలాగే ఇకపై లైసెన్స్ లేకుండా ట్రైన్లో ఏమైనా సరుకులు విక్రయించినా, యాచించినా కూడా రూ. 2,000 జరీమానా కట్టాల్సి ఉంటుంది. విధుల్లో ఉన్న రైల్వే సిబ్బందితో ఎవరైనా వాగ్వాదానికి దిగినా, వారి పనులకు ఆటంకం కలిగించినా రూ. 2,500 ఫైన్ ఉంటుంది. అలాగే రైల్వే స్థలాలను ఆక్యుపై చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
ఇక తోటి ప్రయాణికుల భద్రత, హక్కుల విషయానికి వస్తే ఈ రూల్స్(New Rules In Railways) ఇంకా కఠినంగా ఉన్నాయి. రిజర్వేషన్ బోగీల్లోకి పర్మిషన్ లేకుండా ఎవరైనా దూరినట్లయితే రూ. 2,000 ఫైన్ పడుతుంది. వేరొకరు రిజర్వ్ చేసుకున్న బెర్తును ఆక్రమించడమే కాకుండా.. ఖాళీ చేయడానికి నిరాకరిస్తే రూ. 1,000 ఫైన్ విధిస్తారు. రైల్వే ట్రాఫిక్ డైరక్షన్లను పాటించకపోయినా రూ. 500, మహిళల కోసం కేటాయించిన స్పెషల్ బోగీల్లోకి పురుషులు ప్రవేశించినా . 2,500 పెనాల్టీ చెల్లించాలి. అలాగే ట్రైన్లో స్మోకింగ్ చేస్తే రూ. 2,000 ఫైన్ పడుతుంది.

అలాగే లగేజ్ వ్యాపారులకు కూడా ఈ కొత్త చట్టం గట్టి హెచ్చరిక జారీ చేస్తోంది. తప్పుడు ఇన్ఫర్మేషన్తో అనుమతి లేని సరుకులను ట్రాన్స్పోర్ట్ చేయడం , ఫైర్ యాక్సిడెంట్లకు దారితీసే ప్రమాదకర వస్తువులను తరలించడం చేస్తే ఏకంగా రూ. 10,000ల భారీ ఫైన్ విధిస్తారు. ఇక రైల్వేకి చెందిన వార్నింగ్ బోర్డులు, నోటీస్ బోర్డులను ధ్వంసం చేస్తే మొదటి తప్పుగా రూ. 2,000 జరీమానా ఉంటుంది. కాబట్టి ఇక నుంచి ట్రైన్ జర్నీలో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే జర్నీ హ్యాపీగా సాగిపోతుంది. లేదంటే జేబుకు చిల్లు తప్పదు.





