Just Nationaljust AnalysisLatest News

Satyam Computers : రూ.500 నుంచి రూ. 20 కి పడిపోయిన షేర్.. దేశాన్ని ఊపేసిన సత్యం కుంభకోణం వెనుక అసలు నిజాలేంటి?

Satyam Computers : సాఫ్ట్ వేర్ జాబ్ అంటే ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది యువకులకు కేరాఫ్ అడ్రస్‌గా సత్యం కంప్యూటర్స్ పేరే వినిపించేది. సత్యంలో జాబ్ వస్తే చాలు లైప్ సెటిల్ అయినట్టే అనే అభిప్రాయం కూడా అప్పట్లో యూత్‌ నుంచి బలంగా వినిపించేది.

Satyam Computers

సత్యం కంప్యూటర్స్…2008కు ముందు ఒక సంచలనం. ఒక చిన్న అద్దె భవనంలో కేవలం 20 మందితో ప్రారంభమైన సంస్థ కొద్ది కాలంలోనే 12 వేల కోట్లకు పైగా టర్నోవర్ సాధించి రికార్డు సృష్టించింది. సత్యం కంప్యూటర్స్(Satyam Computers) పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు దాని ఫౌండర్ బైర్రాజు రామలింగరాజు. కానీ అందరికీ సత్యం రామలింగరాజు అంటేనే తెలుస్తుంది.

పదేళ్లలోనే దేశంలో టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. అంతేకాదు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో కూడా చోటు సాధించిన ఘనత దానిదే. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ అంటే ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది యువకులకు కేరాఫ్ అడ్రస్‌గా సత్యం కంప్యూటర్స్ పేరే వినిపించేది. సత్యంలో జాబ్ వస్తే చాలు లైప్ సెటిల్ అయినట్టే అనే అభిప్రాయం కూడా అప్పట్లో యూత్‌ నుంచి బలంగా వినిపించేది.

అయితే సత్యం ఫౌండర్ రామలింగరాజు చేసిన ఒక్క తప్పు ఆయన అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేసింది.  2009 జనవరిలో సత్యం కుంభకోణం వెలుగుచూసింది. సత్యం రామలింగరాజు లేని లాభాలను ఉన్నట్టుగా చూపించారు. ఉద్యోగుల సంఖ్యను పెంచి వాటాదారులను కూడా మోసం చేశాడనే ఆరోపణలు రావడంతో కలకలం రేగింది.

చివరికి ఆయనే స్వయంగా తన తప్పు అంగీకరించి షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. అప్పటి వరకు సత్యం కుంభకోణం బయటకు రాలేదు. బ్యాలెన్స్‌ షీట్లలో కొన్ని సంవత్సరాలుగా తప్పుడు లెక్కలు చూపించానని ఆయన అంగీకరించారు.

2003–07లో సత్యం బ్యాలెన్స్ షీట్‌లోని మొత్తం ఆస్తులు వాస్తవ విలువ కంటే మూడు రెట్లు పెరిగి సుమారు 12 వేల కోట్లకు చేరుకున్నాయి. అయితే తప్పుడు లెక్కలతో దాదాపు రూ.7,000 కోట్ల అకౌంటింగ్ మోసం జరిగినట్టు తేలింది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించినట్టు స్వయంగా రామలింగరాజు తెలిపారు. డమ్మీ అకౌంట్లతో నిధులను వేరే పెట్టుబడుల కోసం ఉపయోగించినట్టు తేలింది. సత్యం రామలింగరాజు లేఖతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది.

Satyam Computers
Satyam Computers

సత్యం షేర్లు ఒక్కసారిగా 70 శాతానికి పైగా పడిపోయాయి. సత్యం షేరు విలువ 500 రూపాయల నుంచి ఒక్కరోజే 20 రూపాయలకు పడిపోయింది. సత్యం కుంభకోణంపై ఫిర్యాదు రావడంతో రామలింగరాజును అరెస్ట్ చేశారు. ఆ సంస్థకు చెందిన 30 బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేశారు.

సెన్సెక్స్ నుంచి సత్యం కంప్యూటర్స్‌(Satyam Computers)ను తొలగించారు. 2009లో వేలం ప్రక్రియ నిర్వహించగా టెక్ మహింద్రా కొనుగోలు చేసింది. మరోవైపు ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయగా, రామలింగరాజుతో సహా పది మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. అందరికీ ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష , జరీమానా విధించింది.

Arunachalam : తెరుచుకున్న అరుణాచల మోక్ష మార్గం.. కానీ భక్తులు ఈ రూల్స్ పాటించాల్సిందే..

Related Articles

Back to top button