Just NationalJust PoliticalLatest News

DK Shivakumar : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ ?..హైకమాండ్ వరుస భేటీలతో టెన్షన్

DK Shivakumar : తాజాగా కర్ణాటకలోనూ మరోసారి సీఎం మార్పు ఖాయమైంది. గత కొంతకాలంగా ఇక్కడ సీఎంగా కొనసాగుతున్న సిద్ధరామయ్య స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం కుర్చీపై ఉండే ఉత్కంఠ మరెక్కడా చూడలేం. ఎన్నికల్లో గెలిచిన వెంటనే అనూహ్యంగా సీఎం క్యాండిడేట్లను ఎంపిక చేయడం, పదవీకాలం పూర్తవకుండానే మార్పులు చేసుకోవడం వంటివి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కనిపిస్తుంటాయి. ఆ పార్టీలో ఉండే సీనియర్ నేతల మధ్య పోటీ అలాంటిది మరి.

తాజాగా కర్ణాటకలోనూ మరోసారి సీఎం మార్పు ఖాయమైంది. గత కొంతకాలంగా ఇక్కడ సీఎంగా కొనసాగుతున్న సిద్ధరామయ్య స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ హఠాత్తుగా డీకేను ఢిల్లీకి పిలవడంతో కర్ణాటక కాంగ్రెస్ లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

గతంలో ఎన్నికల సమయంలో గెలిచినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం ముందు ప్రతిపాదనలు రావడం, అలాగే ముందుగా సిద్ధరామయ్యకు అవకాశమివ్వాలన్న దానికి శివకుమార్ వర్గం అంగీకరించింది. దీంతో గత నవంబర్ నుంచే అక్కడ సీఎం మార్పుపై తీవ్ర చర్చ జరిగింది.

ఇరు వర్గాలు తమ తమ అనుచరులతో బలప్రదర్శనలు, వరుస సమావేశాలు కూడా నిర్వహించారు. మధ్యలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని తాత్కాలికంగా వాయిదా వేయగలిగారు.

అయితే సిద్ధరామయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకోవడంతో డీకే శివకుమార్ వర్గం కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచింది. రెండున్నరేళ్లకే ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మూడేళ్లు పూర్తవుతున్నా మాట్లాడడం లేదన్న అసంతృప్తి డీకే వర్గంలో బాగా ఎక్కువగానే కనిపిస్తోంది.

DK Shivakumar
DK Shivakumar

ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్యకు హైకమాండ్ నుంచి పిలుపు రావడం, హుటాహుటిన ఢిల్లీ వెళ్లి భేటీ కావడం కూడా జరిగాయి. దీనిపై ఆయన ఆచితూచి స్పందించారు. ఎందుకు పిలిచారో తనకు తెలీదన్నారు. మరోవైపు డీకే శివకుమార్ కు మంగళవారం ఉదయం హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన కూడా వెళ్లారు. వీరిద్దరితోనూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ సమావేశం కానున్నారు.

ఈ సమావేశంలో నాయకత్వ మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్(DK Shivakumar) కు మిగిలిన రెండేళ్లు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం బలంగా కోరుతోంది. మరోవైపు ఇప్పుడు సీఎం పదవిలో మార్పులు అవసరం లేదని సిద్ధరామయ్య వర్గం అభిప్రాయపడుతోంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిని ఎలా పరిష్కరిస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Bandla Ganesh : పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ ఎమోషనల్ కామెంట్స్‌.. ఆ చివరి ప్రాజెక్ట్ ఎప్పుడంటూ చర్చ

Related Articles

Back to top button