Just NationalJust PoliticalLatest News

Suvendu : బెంగాల్ లో బుల్డోజర్ ట్రీట్ మెంట్..గ్యాంగ్ స్టర్స్ కు సువేందు షాక్

Suvendu : సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే సువేందు అధికారి అక్కడి గ్యాంగ్ స్టర్స్ పై దృష్టి సారించారు. పాత కేసులను తవ్వి గ్యాంగ్ స్టర్స్ ను అరెస్ట్ చేయించారు

Suvendu

సుదీర్ఘ కాలంగా సాగిన మమతా బెనర్జీ పాలనకు తెరదించి బెంగాల్ లో కాషాయ జెండా పాతిన బీజేపీ అక్కడి పాలనలోనూ తనదైన మార్క్ చూపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే యూపీలో ఆదిత్యనాథ్ తీసుకొచ్చిన బుల్డోజర్ ట్రీట్ మెంట్ బెంగాల్ లో సువేందు అధికారి ఫాలో అవుతున్నారు. దశాబ్దాల కాలంగా దీదీ పాలనలో పాతుకుపోయిన గ్యాంగ్ స్టర్స్ కు చుక్కలు చూపిస్తున్నారు.

గ్యాంగ్ స్టర్స్ ను జైలుకే పరిమితం చేసేలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వారి నేర సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మొన్నటి వరకూ అమాయక ప్రజలను వేధించి దోచుకున్న కరుడుగట్టిన రౌడీలకు బుల్డోజర్ ట్రీట్ మెంట్ అంటే ఏంటో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే సువేందు(Suvendu) అధికారి అక్కడి గ్యాంగ్ స్టర్స్ పై దృష్టి సారించారు. పాత కేసులను తవ్వి గ్యాంగ్ స్టర్స్ ను అరెస్ట్ చేయించారు.

పైగా వారి అరెస్ట్ గురించి అందరికీ తెలిసేలా అక్కడి పోలీసులు వారికి సంకెళ్లు వేసి నడిరోడ్డుపై తీసుకెళ్లడం చూస్తే సువేందు మార్క్ పాలన ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. నిజానికి బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం అక్కడి గ్యాంగ్ స్టర్స్ మాఫియానే. మమతా బెనర్జీ పాలనలో వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో రెచ్చిపోయారు.

Suvendu
Suvendu

దీంతో ఎన్నికల్లో గెలిస్తే గ్యాంగ్ స్టర్స్ లేకుండా చేస్తామనీ బీజేపీ పదేపదే ప్రచారం చేసింది. దానికి తగ్గట్టుగానే ప్రజల నుంచి గట్టి స్పందనే లభించడం, ఎన్నికల్లో డబుల్ సెంచరీ సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగిపోయాయి. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో రెండోరోజు నుంచే సువేందు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తప్పు చేసిన ఏ గ్యాంగ్ స్టర్ ను వదిలిపెట్టకుండా జైల్లో పడేయమని స్పష్టం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్స్ పై ఫోకస్ పెట్టి వరుసగా అరెస్ట్ చేశారు.

పైగా అందరికీ తెలిసేలా హౌరా బ్రిడ్జిపై నడిపించుకు తీసుకెళ్లిన పోలీసులు ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పారు. అయితే యూపీ తరహా పాలనను బెంగాల్ లో బలవంతంగా రుద్దుతున్నారంటూ విపక్ష టీఏంసీ ఆరోపిస్తోంది. కానీ ప్రజలు మాత్రం గ్యాంగ్ స్టర్స్ నుంచి విముక్తి కోరుకోవడంతో బీజేపీ చర్యలకే మద్దతుగా నిలుస్తున్నారు. ఒకవేళ మహిళలపై అఘాయిత్యాలు, హత్య వంటి వాటికి పాల్పడితే ఎన్ కౌంటర్ చేసేందుకు కూడా వెనుకాడొద్దని పోలీసులకు సువేందు స్పష్టం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

Pawan Kalyan :సహనానికి హద్దులు దాటితే తాట తీస్తాం..పవన్ వార్నింగ్‌పై రాజకీయ విశ్లేషకుల అంచనా

Related Articles

Back to top button