Just NationalJust BusinessLatest News

Gold Rates : ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? గోల్డ్ రేట్ తగ్గిందా? పెరిగిందా?

Gold Rates : రెండు తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేటు పరిస్థితి చూస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మెయిన్ సిటీలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు రన్ అవుతున్నాయి.

Gold Rates

గోల్డ్ కొనాలనుకునే వారికి సండే మార్కెట్ పెద్దగా షాక్ ఇవ్వలేదు. దేశీయంగా బంగారం ధరలు స్వల్ప మార్పులతో స్థిరంగానే కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో కనిపిస్తున్న ట్రెండ్స్ బట్టే భారతదేశంలోనూ రేట్లు డిసైడ్ అవుతున్నాయి. ప్రెజెంట్ హైదరాబాద్‌తో పాటు దేశంలోని మిగతా మెట్రో నగరాలు అన్నింటిలోనూ బంగారం ధరలు ఇంచుమించు ఒకే ధరలో కంటిన్యూ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడి 10 గ్రాముల ధర రూ.1లక్ష 43వేల 290 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే మనవాళ్లు ఎక్కువగా ఆర్నమెంట్ చేయించుకోవడానికి ఇష్టపడే 22 క్యారెట్ల బంగారం ధర మార్కెట్‌లో రూ.1లక్ష30వేల 650 నుంచి రూ.1లక్ష31వేల 350 మధ్యలో అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు దాదాపుగా రూ.1లక్ష07వేల 470 గా రికార్డైంది.

Gold Rates
Gold Rates

రెండు తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేటు పరిస్థితి చూస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మెయిన్ సిటీలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు రన్ అవుతున్నాయి. అంటే హైదరాబాద్‌లో ఏ ధర ఉందో వైజాగ్, విజయవాడలోనూ అదే రేటుకు బంగారం అందుబాటులో ఉంది.

అయితే ఇక్కడొక చిన్న విషయం గుర్తుంచుకోవాల్సి ఉంది. మీరు జ్యువెలరీ షాప్‌కి వెళ్లి బంగారు ఆభరణాలు కొనేటప్పుడు ఈ బేసిక్ ధరలతో పాటు మేకింగ్ ఛార్జీలు , జీఎస్టీ వంటి ఎక్స్‌ట్రా టాక్స్‌లు పడతాయి. అందుకే లైవ్ రేట్స్ కోసం మీ దగ్గర్లోని నమ్మకమైన పెద్ద షోరూమ్‌లను సంప్రదించడం మంచిది.

Argentina vs Spain : అర్జెంటీనా, స్పెయిన్ మధ్య సాకర్ యుద్ధం..ట్రోఫీ చిక్కేదెవరికి ?

Related Articles

Back to top button