TVK Party : విజయ్ కు షాక్ మీద షాక్…కీలక అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
TVK Party : తమిళ రాజకీయాల్లోప్రత్యేక ముద్ర వేయాలన్న లక్ష్యంతో 'తమిళగ వెట్రి కళగం' టీవీకే పార్టీని స్థాపించిన విజయ్‌కు గత ఏడాది కాలంగా ఏదీ కలిసి రావడం లేదు
TVK Party
రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. కేవలం వ్యక్తిగత చరిష్మా ఉంటే సరిపోదు. పదునైన వ్యూహాలతో దూసుకుపోవాలి. సందర్భానుసారంగా ప్రత్యర్థులపై పైచేయి సాధించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రచార పర్వం నుంచి నామినేషన్ల వరకూ ఉండే కీలక అంశాలను, నిబంధనలను అర్థం చేసుకోవాలి.
లేకుంటే ఎదురుదెబ్బలు తగడలం ఖాయం. తమిళ రాజకీయాల్లోప్రత్యేక ముద్ర వేయాలన్న లక్ష్యంతో ‘తమిళగ వెట్రి కళగం’ టీవీకే పార్టీ(TVK Party)ని స్థాపించిన విజయ్‌కు గత ఏడాది కాలంగా ఏదీ కలిసి రావడం లేదు. తొక్కిసలాట ఘటనలో పలువురి మరణానికి కారణమయ్యాడన్న నిందలు, సీబీఐ విచారణ, ఇటు వ్యక్తిగత జీవితంలో విడాకుల అంశం, త్రిషతో లవ్ ఎఫైర్ వంటివి వెంటాడుతున్నాయి. తాజాగా నామినేషన్ల విషయంలోనూ విజయ్ పార్టీకి షాక్ మీద షాకులు తగులుతున్నాయి.
టీవీకే పార్టీ(TVK Party) కీలక అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురవ్వడమే దీనికి ఉదాహరణ. ప్రతిష్టాత్మకమైన ఎడప్పాడి నియోజకవర్గంలో పోటీ చేసి తన పార్టీ సత్తా చాటాలని ఆశించిన విజయ్ కు నామినేషన్ల పర్వంలోనే షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి అరుణ్ కుమార్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అంతే కాదు ఆయన హఠాత్తుగా కనిపించకుండా పోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఎన్నికల ఘట్టంలో ప్రచారం, గెలుపు, ఓటముల కంటే కూడా ముందు నామినేషన్లు సరిగ్గా దాఖలు చేయడం పెద్ద సవాల్. దాని నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు, కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకాలు ఉండాలనే చిన్న నియమాన్ని పాటించకపోవడంతో ఎడప్పాడిలో పోటీ చేయాలనుకున్న టీవీకే అభ్యర్ధి అరుణ్ కుమార్ నామినేషన్ తిరస్కరణకు గురైంది.

ఆయన స్థానంలో ప్రత్యామ్నాయంగా బరిలోకి దింపాలనుకున్న టీవీకే పార్టీకే చెందిన నిత్య నామినేషన్ ను కూడా ఈసీ రిజెక్ట్ చేసింది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లే ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. దీంతో విజయ్ పార్టీ పెద్దలకు ఈసీ నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
నిజానికి ఎడప్పాడిలో అన్నాడీఎంకే దిగ్గజం పళనిస్వామిని ఢీకొట్టి గెలవాలనుకున్న టీవీకే వ్యూహం ఇప్పుడు పూర్తిగా రివర్సయింది. నియోజకవర్గంలో ఇక టీవీకే జెండా ఎగిరే అవకాశం లేకుండా పోవడంతో విజయ్ అభిమానులకు సైతం నిరాశ కలిగిస్తోంది.
RBI :మధ్యతరగతికి ఆర్బీఐ ఊరట…రెపో రేటు మార్చకపోవడానికి కారణాలివే





