West Bengal Politics : దీదీ రివర్స్ ఎంట్రీ ఇస్తే బీజేపీకి చెక్ పడినట్లేనా? అధీర్ మైండ్ గేమ్‌తో బెంగాల్ రాజకీయాల్లో భూకంపం..
West Bengal Politics : మమత తన వెంట ఉన్న ఆ ఒక్క భారాన్ని వదిలించుకుని వస్తేనే కాంగ్రెస్ అనే పెద్ద మర్రిచెట్టు కిందకి గ్రాండ్ వెల్‌కమ్ అని బాంబు పేల్చుతూ అధీర్ క్రేజీ ఆఫర్ ఇచ్చారు.
West Bengal Politics
పశ్చిమ బెంగాల్ పొలిటికల్ సర్కిల్‌లో ఒక్కసారిగా హైవోల్టేజ్ డ్రామా మొదలైంది. ఊహించని మలుపులతో ఎప్పుడూ వేడివేడిగా ఉండే కోల్‌కతా..ఈసారి కాంగ్రెస్ వేసిన ఒకే ఒక్క పాచిక యావత్ భారత దేశ రాజకీయాల దృష్టిని పశ్చిమబెంగాల్(West Bengal Politics) వైపు తిప్పుకునేలా చేసింది.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేయాలంటూ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి విసిరిన ఓ ఛాలెంజ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది.
కాకపోతే మమత తన వెంట ఉన్న ఆ ఒక్క భారాన్ని వదిలించుకుని వస్తేనే కాంగ్రెస్ అనే పెద్ద మర్రిచెట్టు కిందకి గ్రాండ్ వెల్‌కమ్ అని బాంబు పేల్చుతూ అధీర్ క్రేజీ ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ భారం మరెవరో కాదు, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీయేనన్నది అక్కడ ఓపెన్ సీక్రెట్ అన్న విషయం తెలిసిందే.
హస్తినలో ఇండియా కూటమి భేటీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మమత కనిపించిన మరుసటి రోజే.. బెంగాల్‌లో ఆమెకు కట్టర్ ఎనిమీగా ఉండే అధీర్ నోటి నుంచి ఈ మాట రావడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అంతేకాదు 1998లో కాంగ్రెస్‌ను వీడి బయటకొచ్చిన మమతా బెనర్జీ..ఒకవేళ నిజంగానే అధీర్ మాటను సీరియస్‌గా తీసుకుని మళ్లీ కాంగ్రెస్ గూటికి తిరిగొస్తారా? అదే జరిగితే బెంగాల్‌తో పాటు దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలుంటాయనే చర్చ జోరుగా సాగుతోంది.
మమత హస్తం గూటికి చేరితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి తిరుగులేని అధికారం వస్తుంది. లోక్‌సభలో ప్రస్తుతం టీఎంసీకి ఉన్న భారీ ఎంపీల బలం డైరెక్టుగా కాంగ్రెస్ అకౌంట్‌లోనే పడుతుంది. దీనివల్ల పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా మరింత శక్తివంతంగా మారడమే కాకుండా, కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టే ఏకైక జాతీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తన ప్లేస్‌ను రీ-ఫిక్స్ చేసుకుంటుంది. ఇటు రాహుల్, మమతల దోస్తానా నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుంది.
అలాగే బెంగాల్‌లో బీజేపీ(West Bengal Politics) వేగానికి కళ్లాలు పడతాయి. ఇప్పటివరకు అక్కడ కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీల మధ్య ఓట్లు చీలిపోవడం వల్ల కమలం పార్టీ బాగా లబ్ధి పొందుతూ వచ్చింది. ఇప్పుడు టీఎంసీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకులు ఒక్కటైతే, ఆ వ్యతిరేక ఓట్లన్నీ ఒకే వైపు పోలై, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి గెలుపు అవకాశాలు క్లోజ్ అయినట్లే అవుతుంది.

ఇక మమత కాంగ్రెస్‌లో చేరితే గ్రౌండ్ లెవల్‌లో కేడర్ ఏకమవుతుంది. దశాబ్దాలుగా కొట్టుకుంటూ వస్తున్న లోకల్ కాంగ్రెస్, టీఎంసీ కార్యకర్తల మధ్య మొదట్లో కాస్త ఘర్షణ వాతావరణం ఉన్నా.. దీదీ ఇమేజ్, కాంగ్రెస్ మార్క్ కలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు గ్రాస్ రూట్ స్థాయిలో ఒకే పెద్ద తుపాన్‌లా మారుతాయి.
అంతేకాకుండా లోకల్ పార్టీల మైండ్ సెట్ మారుతుంది. కేంద్రంలో ఉన్న బలమైన పవర్‌ను దెబ్బతీయాలంటే స్థానిక పార్టీలు సొంతంగా ఫైట్ చేయడం కంటే, జాతీయ పార్టీలతో చేతులు కలపడమే సరైన మార్గం అనే ట్రెండ్‌కి ఇది శ్రీకారం చుడుతుంది. మొత్తానికి మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో చేరడమనేది జరిగితే అది కేవలం ఒక విలీనం మాత్రమే కాదు.. భారత పాలిటిక్స్ రూపురేఖలనే మార్చేసే పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.





